AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol Diesel Price: అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగినా ముడి చమురు ధరలు.. మన దేశంలో మాత్రం..

గత కొద్ది రోజులుగా దేశంలో పెట్రోల్‌(Petrol ), డీజిల్‌ (Diesel)ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. పరుగులు పెట్టిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు ప్రస్తుతం బ్రేకులు పడ్డాయి. ఇలా స్థిరంగా కొనసాగుతుండటంతో వాహనదారులకు ఊరట..

Petrol Diesel Price: అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగినా ముడి చమురు ధరలు.. మన దేశంలో మాత్రం..
Petrol Diesel Price
Sanjay Kasula
|

Updated on: Mar 01, 2022 | 9:47 AM

Share

గత కొద్ది రోజులుగా దేశంలో పెట్రోల్‌(Petrol ), డీజిల్‌ (Diesel)ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. పరుగులు పెట్టిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు ప్రస్తుతం బ్రేకులు పడ్డాయి. ఇలా స్థిరంగా కొనసాగుతుండటంతో వాహనదారులకు ఊరట కలిగిస్తుందనే చెప్పాలి. ఇక రష్యా-ఉక్రెయిన్‌ ఉద్రిక్తత (Russia Ukraine war)ల నేపథ్యంలో పెట్రోల్‌, డీజిల్‌ (Petrol, Diesel)ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ యుద్ధం కారణంగా ముడి చమురు చమురు(Crude Oil) ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. మార్కెట్‌లో బ్యారెల్ చమురు ధరలకు 100 డాలర్లకు చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ టారిఫ్‌లను తగ్గిస్తున్నట్లే, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధనాలపై వ్యాట్‌ను కూడా తగ్గించాయి. తద్వారా మహానగరంలో అప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. అయినా కూడా దేశంలోని 25 ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధర రూ.100 పైనే ఉంది.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.39గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.95.85గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 108.94గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.29గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.66గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.05గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20 ఉండగా.. డీజిల్ ధర రూ.94.62గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.69 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.48కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.56లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.109.75 ఉండగా.. డీజిల్ ధర రూ. 95.83గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.65 లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.95.74గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.91గా ఉండగా.. డీజిల్ ధర రూ.96.03గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.110.48లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.96.56లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ.95.41 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 86.67 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.67 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 89.79 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 101.40 ఉండగా.. డీజిల్ ధర రూ.91.43గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100.58 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.85.01గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.14 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.86.68గా ఉంది.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!