Petrol Diesel Price Today: రోజువారీ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు SMS రూపంలో తెలుసుకోవడం ఎలా..? తాజా రేట్ల వివరాలు

Petrol Diesel Price Today: భారతీయ చమురు కంపెనీలు శుక్రవారం ఉదయం పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. ఈరోజు కూడా చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి..

Petrol Diesel Price Today: రోజువారీ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు SMS రూపంలో తెలుసుకోవడం ఎలా..? తాజా రేట్ల వివరాలు
Follow us

|

Updated on: Jul 01, 2022 | 9:52 AM

Petrol Diesel Price Today: భారతీయ చమురు కంపెనీలు శుక్రవారం ఉదయం పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. ఈరోజు కూడా చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.72కి, డీజిల్ రూ.89.62కి విక్రయిస్తున్నారు. ఇక ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్‌, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ లీటర్ పెట్రోల్ రూ.111.35 ఉండగా, డీజిల్ రూ.97.28కి విక్రయిస్తున్నారు. చెన్నైలో పెట్రోలు ధర రూ.102.63 ఉండగా ఉండగా, డీజిల్ ధర రూ.94.24గా ఉంది. అదే సమయంలో పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో పెట్రోల్ రూ.106.03 ఉండగా, డీజిల్ రూ.92.76కు లభిస్తున్నాయి. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.109.66 ఉండగా, డీజిల్‌ ధర రూ.97.82గా ఉంది.

దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు చాలా కాలంగా మారడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ఊరట లభిస్తోంది. మే 21న కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. అంతకుముందు గత ఏడాది నవంబర్‌లో కూడా పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గించబడింది. దాని కారణంగా చమురు ధరలు తగ్గాయి.

SMS ద్వారా మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలను తనిఖీ చేయండి

మీరు SMS ద్వారా మీ నగరంలో ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను తెలుసుకోవచ్చు. దీని కోసం, ఇండియన్ ఆయిల్ (IOCL) వినియోగదారులకు RSP కోడ్ రాసి 9224992249 నంబర్‌కు పంపండి. మీ నగరం RSP కోడ్ తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ఆధారంగా, చమురు మార్కెటింగ్ కంపెనీలు ధరలను సమీక్షించిన తర్వాత ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం వివిధ నగరాల పెట్రోల్, డీజిల్ ధరల సమాచారాన్ని అప్‌డేట్ చేస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి