Petrol, Diesel Price Today: వరుసగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. మే 21న కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో చమురు మార్కెటింగ్ కంపెనీలు చివరిసారిగా మే 22న చమురు ధరలను తగ్గించాయి. గత 106 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండటం లేదు. అయితే ఈరోజు క్రూడాయిల్ ధర కూడా భారీగా పెరిగింది. క్రూడ్ ఆయిల్ ధర ఈరోజు దూసుకుపోతోంది. WTI క్రూడ్ $ 1.25 పెరిగి $ 88.12 వద్ద, బ్రెంట్ క్రూడ్ $ 1.41 పెరిగి బ్యారెల్ $ 94.43 వద్ద ట్రేడవుతోంది.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు
• ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.72,డీజిల్ ధర రూ. 89.62
• ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.35, డీజిల్ ధర రూ.94.27
• చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24
• కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.06.03, డీజిల్ ధర రూ.92.76
• నోయిడాలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.96-
• బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.94, డీజిల్ ధర రూ. 87.89
• హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ రూ.97.82
• విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.23, డీజిల్ ధర రూ.98.97
• ఆగ్రాలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.48, డీజిల్ ధర రూ. 89.64
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి