Petrol Diesel Price Today: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయలో కొన్ని రోజులపాటు శాంతించిన ఇంధన ధరలు ఇప్పుడు మళ్లీ పెరగడం ప్రారంభించాయి. గత రెండు రోజులుగా దేశ వ్యాప్తంగా పెరుగుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు (100.11), గుంటూరు (100.11), నెల్లూరు (100.26), విజయవాడ (100.11)లో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ దాటేసింది. ఆదివారం దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఓసారి తెలుసుకుందాం..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 93.94 గా ఉండగా (శనివారం రూ. 93.68 ), డీజిల్ రూ. 84.89 (శనివారం రూ. 84.61 ) వద్ద కొనసాగుతోంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.19 గా నమోదుకాగా (శనివారం రూ. 99.94), డీజిల్ ధర రూ. 92.17 (శనివారం రూ. 91.87 ) ఉంది.
* ఇక తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.51 గా ఉండగా (శనివారం రూ. 95.28 ), డీజిల్ రూ. 89.65 (శనివారం రూ. 89.39 ) వద్ద కొనసాగుతోంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆదివారం లీటర్ పెట్రోల్ ధర రూ. 97.07గా నమోదుకాగా (శనివారం రూ. 96.80 ), లీటర్ డీజిల్ ధర రూ. 89.99 (శనివారం రూ. 89.70) వద్ద ఉంది.
* తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర క్రమంగా వందకు చేరువవుతోంది. ఇక్కడ ఆదివారం లీటర్ పెట్రోల్ ధర రూ. 97.63 గా ఉండగా.. (శనివారం రూ. 97.36), డీజిల్ ధర రూ. 92.54 (శనివారం రూ. 92.24 ) వద్ద కొనసాగుతోంది.
* ఇక ఆదిలాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర వందరకు చేరువైంది. ఇక్కడ ఆదివారం లీటర్ పెట్రోల్ ధర రాష్ట్రంలో అత్యధికంగా రూ. 99.51 గా నమోదైంది (శనివారం రూ. 99.41), ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 94.29 వద్ద (శనివారం రూ. 94.14 ) కొనసాగుతోంది.
* ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. విజయవాడలో లీటర్ పెట్రలో ధర రూ. 100.11 (శనివారం రూ. 99.99 )గా ఉండగా.. డీజిల్ రూ. 94.43 వద్ద కొనసాగుతోంది.
* విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ లీటర్ రూ. 99.24 గా ఉండగా (శనివారం రూ. 98.82 ), డీజిల్ ధర రూ. 93.57 వద్ద కొనసాగుతోంది.
Also Read: Ayurveda Medicine : ఆయుర్వేదంతో కరోనాకు చెక్..! ఈ పద్దతుల ద్వారా చక్కటి ఫలితాలు.. మీరు ట్రై చేయండి..
yuva Prime Minister Scheme : యువత కోసం కేంద్రం సరికొత్త పథకం..! ఎంపికైతే నెలకు 50,000 స్టైఫండ్..