AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol, Diesel Price Today: మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధరలు.. లీటర్‌కు 80 పైసలు చొప్పున పెంచిన చమురు కంపెనీలు..

పెట్రోల్(Petrol), డీజిల్(Diesel) ధరలు మళ్లీ పెరిగాయి. ఈ మేరకు దేశంలోని ప్రధాన చమురు(Crude Companies) మార్కెటింగ్ కంపెనీలు ఏప్రిల్ 3 ఆదివారం పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి...

Petrol, Diesel Price Today: మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధరలు.. లీటర్‌కు 80 పైసలు చొప్పున పెంచిన చమురు కంపెనీలు..
Petrol Diesel Price Today
Srinivas Chekkilla
|

Updated on: Apr 03, 2022 | 8:07 AM

Share

పెట్రోల్(Petrol), డీజిల్(Diesel) ధరలు మళ్లీ పెరిగాయి. ఈ మేరకు దేశంలోని ప్రధాన చమురు(Crude Companies) మార్కెటింగ్ కంపెనీలు ఏప్రిల్ 3 ఆదివారం పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. ఆదివారం రాజధాని ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 80 పైసలు చొప్పున పెరిగాయి. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 84 పైసలు, డీజిల్ ధర 85 పైసలు పెరిగింది. ఇంధన ధరల తాజా పెరుగుదల తర్వాత, ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.41కి, డీజిల్ లీటరుకు రూ.94.67కి చేరుకుంది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 118.41, డీజిల్ రూ. 102.64. చేరుకుంది. గత 13 రోజుల్లో 11వసారి చమురు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి.

నవంబర్ 4, 2021 నుంచి చమురు ధరలు దేశవ్యాప్తంగా స్థిరీకరించారు. దాదాపు ఒకటిన్నర నెలల తర్వాత అంటే మార్చి 22న మొదటిసారిగా ధరలు పెంచారు. మార్చి 22 నుంచి ఏప్రిల్ 3 వరకు 13 రోజుల్లో 11 సార్లు చమురు ధరలు పెరిగాయి. గత 13 రోజుల్లో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.8 పెరిగింది. మార్చి 21, 2022 వరకు ఢిల్లీలో ఒక లీటర్ పెట్రోల్ ధర లీటరుకు రూ.95.41 ఉండగా ప్రస్తుతం లీటరుకు రూ.103.41కి పెరిగింది. చెన్నైలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 75 పైసలు చొప్పున పెరిగాయి. చెన్నైలో పెట్రోల్ ధర లీటరుకు రూ.108.96, డీజిల్ లీటరుకు రూ.99.04 పెరిగింది.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.117.13గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.103.20గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.117.31గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.103.41గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 117.63గా ఉండగా.. డీజిల్ ధర రూ.103.70గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.117.13గా ఉండగా.. డీజిల్ ధర రూ.103.66గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.118.15కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.105.50లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.117.62ఉండగా.. డీజిల్ ధర రూ. 104.06గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.117.22లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.104.70గా ఉంది.

Read Also..  Gold And Silver Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. తగ్గిన వెండి ధర.. తాజా రేట్ల వివరాలు..

Follow Us
కాకినాడ ప్రమాదంలో 18 మంది మృతి.. సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
కాకినాడ ప్రమాదంలో 18 మంది మృతి.. సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
ఇకపై గ్రేడ్‌ ఆధారిత డ్రైవింగ్‌ లైసెన్స్‌.. కేంద్రం కొత్త విధానం
ఇకపై గ్రేడ్‌ ఆధారిత డ్రైవింగ్‌ లైసెన్స్‌.. కేంద్రం కొత్త విధానం
తిరుమలలో ఇలాంటి పనులా? బిగ్‌బాస్ గీతూపై భక్తుల ఆగ్రహం.. వీడియో
తిరుమలలో ఇలాంటి పనులా? బిగ్‌బాస్ గీతూపై భక్తుల ఆగ్రహం.. వీడియో
వామ్మో.. బంగారం రూ.2లక్షలు.. వెండి రూ.4లక్షలు..?
వామ్మో.. బంగారం రూ.2లక్షలు.. వెండి రూ.4లక్షలు..?
దారుణం.. మనిషి చనిపోయినా పట్టించుకోకుండా.. చేపల కోసం ఎగబడ్డ జనం
దారుణం.. మనిషి చనిపోయినా పట్టించుకోకుండా.. చేపల కోసం ఎగబడ్డ జనం
నా డబ్బు నాకే అంటూ కోర్టులో గెలిచిన 10 ఏళ్ల కొడుకు
నా డబ్బు నాకే అంటూ కోర్టులో గెలిచిన 10 ఏళ్ల కొడుకు
March 2026 Horoscope: కెరీర్, మనీ విషయాల్లో వారికి అన్ని శుభాలే..
March 2026 Horoscope: కెరీర్, మనీ విషయాల్లో వారికి అన్ని శుభాలే..
టీ20 వరల్డ్ కప్ 2026లో మళ్లీ భారత్, పాక్ పోరు.. తేదీ, సమయం ఇదే..?
టీ20 వరల్డ్ కప్ 2026లో మళ్లీ భారత్, పాక్ పోరు.. తేదీ, సమయం ఇదే..?
భారతీయ బ్రాండ్ల జెండా ప్రపంచంపై ఎగరాలి.. సద్గురు కీలక సూచనలు..
భారతీయ బ్రాండ్ల జెండా ప్రపంచంపై ఎగరాలి.. సద్గురు కీలక సూచనలు..
ఆ హీరో యాక్టింగ్ సరిగ్గా చేయలేదు.. సినిమా ప్లాప్ అయ్యింది..
ఆ హీరో యాక్టింగ్ సరిగ్గా చేయలేదు.. సినిమా ప్లాప్ అయ్యింది..