Petrol Price Today: ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ మొదలైనప్పటి నుంచి దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు కనిపించలేదు. దాదాపు నాలుగున్నర నెలలపాటు స్థిరంగా కొనసాగిన ధరలు మార్చి 22న మళ్లీ పెరగడం మొదలయ్యాయి. వరుసగా మంగళ, బుధ వారాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. 80 పైసల చొప్పున ధరలు పెరగడంతో మళ్లీ అందరూ ఆందోళనకు గురయ్యారు. ఇక పెట్రో, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉంటాయేమేనని భావించారు. అయితే గురువారం పెట్రోలియం సంస్థలు వాహనాదరులకు కాస్త ఊరట కల్పించాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులేకపోవడం కాస్త ఉపశమనం కలిగినట్లైంది. ఈరోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూసేయండి..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.01గా ఉండగా, డీజిల్ రూ. 88.27 గా నమోదైంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.67 కాగా, డీజిల్ రూ. 95.85 వద్ద కొనసాగుతోంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.91 వద్ద కొనసాగుతుండగా, డీజిల్ రూ. 92.95 గా ఉంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.26 గా ఉండగా, డీజిల్ రూ. 86.58 గా నమోదైంది.
* హైదరాబాద్‌లో గురువారం లీటర్ పెట్రోల్ ధర రూ. 110.01 గా ఉండగా, డీజిల్ రూ. 96.37 గా ఉంది.
* విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 112.37 కాగా, డీజిల్ రూ. 98.36 వద్ద కొనసాగుతోంది.
* విశాఖపట్నంలో ఈరోజు లీటర్ పెట్రోల్ ధర రూ. 111.50 గా ఉండగా, డీజిల్ రూ. 96.94 గా నమోదైంది.
Also Read: Viral Video: గంగూలీనీ వదలని పుష్ప ఫీవర్.. పుష్పరాజ్‌గా మారిన దాదా.. వైరల్ అవుతోన్న వీడియో.
Ghani Movie Trailer: కుర్ర హీరో ట్రైలర్‌కు కోటి వ్యూస్.. దూసుకుపోతున్న వరుణ్ తేజ్ గని
Lungs Cancer Symptoms: మీ గోర్లలో మార్పులు ఏమైనా వచ్చాయా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..