Petrol Price Today: గత కొన్ని రోజులుగా శాంతంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల పుణ్యామాని పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేవు. దాదాపు నాలుగున్నర నెలలుగా ఇంధన ధరల్లో ఎలాంటి మార్పులు కనిపించలేదు. కానీ తాజాగా ఒక్కసారిగా మళ్లీ ధరలు పెరిగాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో చమురు సంస్థలు ఇంధన ధరలను పెంచేశాయి. ఈ క్రమంలోనే తాజాగా మంగళవారం ధరలను పెంచుతూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది.
పెరిగిన ధరలు మంగళవారం ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశంలోని పలు నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో పెరుగుదల కనిపించింది. ఏకంగా ఒకేసారి పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 88 పైసలు పెరిగాయి. మంగళవారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.21 గా ఉండగా, డీజిల్ రూ. 87.47 వద్ద కొనసాగుతోంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.82 కాగా, డీజిల్ రూ. 95గా ఉంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.16 గా ఉండగా, డీజిల్ రూ. 92.19 గా నమోదైంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో లీటర్ పెట్రోల్ రూ. 101.42 కాగా, డీజిల్ రూ. 85.80 వద్ద కొనసాగుతోంది.
* హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.10 వద్ద కొనసాగుతుండగా, డీజిల్ రూ. 95.50 గా ఉంది.
* విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 111.23 గా ఉండగా, డీజిల్ రూ. 96.79 వద్ద కొనసాగుతోంది.
* సాగరతీరం విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.93 కాగా, డీజిల్ రూ. 95.41 గా ఉంది.
Also Read: Crude Oil: భారీగా పెరిగిన ముడి చమురు ధర.. మరి పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీగా పెరుగుతాయా..?
Viral Video: ఇదేం పిచ్చిరా బాబు.. కొంచెం ఉంటే ప్రాణాలు గాల్లో కలిసేవి..!