Petrol Price Today: అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అయితే దేశీయంగా మాత్రం ఇంధన ధరలు నిలకడగా ఉండడం వినియోగదారులకు ఊరటకల్పిస్తోంది. నిజానికి గత మూడు నెలల క్రితం ఆకాశమే హద్దుగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో కాస్త శాంతించాయి. దీంతో చాలా రోజుల నుంచి దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతూ వచ్చాయి. కానీ వచ్చే నెలలో ధరలు పెరగక తప్పదనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే మంగళవారం దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి చూసేయండి..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.41 గా ఉండగా, డీజిల్ రూ. 86.67 వద్ద కొనసాగుతోంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ రూ. 109.98 కాగా, డీజిల్ రూ. 94.14 గా ఉంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ. 101.40 గా ఉండగా, డీజిల్ రూ. 91.43 వద్ద కొనసాగుతోంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో లీటర్ పెట్రోల్ రూ. 100.65 వద్ద కొనసాగుతుండగా, డీజిల్ రూ. 85.08 గా నమోదైంది.
* హైదరాబాద్‌లోనూ పెట్రోల్ డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20 గా ఉండగా, డీజిల్ రూ. 94.62 వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 109.32 గా ఉండగా, డీజిల్ రూ. 96.44 వద్ద కొనసాగుతోంది.
* సాగర నగరం విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.32 గా నమోదుకాగా, డీజిల్ రూ. 95.43 గా ఉంది.
Also Read: Viral Video: కోడి- పాము మధ్య భీకర పోరు.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే..
Child care: పిల్లల ఆహారంలో ఈ పొరపాట్లు చేస్తున్నారా?.. అయితే ఊబకాయం సమస్యలు తప్పవు..
Amit Shah: హిజాబ్ వివాదంపై పెదవి విప్పిన అమిత్ షా.. ఏమన్నారంటే..