Cibil Score: ఈ 4 పనులు చేస్తే మీ సిబిల్ స్కోర్ ఢమాల్.. ఇలా జాగ్రత్త పడండి

చాలామంది లోన్ తిరస్కరణకు గురైనప్పుడో.. లేదా క్రెడిట్ కార్డు రానప్పుడో సిబిల్ స్కోర్ చెక్ చేసుకుంటారు. మిగతా సమయంలో అసలు దాని గురించి పట్టించుకోరు. అలా కాకుండా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం వల్ల మీరు జాగ్రత్త పడవచ్చు. అంతేకాకుండా కొన్ని పనులు చేయకూడదు.

Cibil Score: ఈ 4 పనులు చేస్తే మీ సిబిల్ స్కోర్ ఢమాల్.. ఇలా జాగ్రత్త పడండి
Cibil Score

Updated on: Dec 09, 2025 | 2:32 PM

Cibil Score: మీరు ఆర్ధికంగా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారనేది మీ సిబిల్ స్కోర్‌ను బట్టి ఎవరికైనా తెలుస్తోంది. మన ఆర్ధిక వ్యవహారాలు అన్నీ ఒక్క క్రెడిట్ రిపోర్ట్‌తో తెలిసిపోతుంది. మీకు బ్యాంక్ నుంచి లోన్ కావాలన్నా.. క్రెడిట్ కార్డు తీసుకోవాలన్నా సిబిల్ స్కోర్ అనేది ప్రధాన పాత్ర పోషిస్తోంది. మీ రిపోర్టును బట్టి లోన్, క్రెడిట్ కార్డు ఇవ్వాలా.. వద్దా అనేది బ్యాంకులు నిర్ణయిస్తాయి. దీంతో మీ క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యం. స్కోర్ తక్కువగా ఉంటే మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కుంటారు. మీకు అవసరమైన సమయంలో ఏ బ్యాంక్ లోన్ ఇచ్చేందుకు ముందుకు రాదు. అందుకే క్రెడిట్ స్కోర్‌ను ఎప్పుడూ కాపాడుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సిబిల్ స్కోర్ తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం.

అధిక క్రెడిట్ కార్డు వినియోగం

ఎక్కువగా క్రెడిట్ కార్డు లిమిట్‌ను ఉపయోగించకండి. లిమిట్‌లో మీరు 30 శాతం మాత్రమే వినియోగించాలి. అంతకంటే ఎక్కువ వాడితే మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావతం చూపుతుంది. ఇక క్రెడిట్ కార్డు మినిమం బిల్లు సరిపోతుందని చాలామంది అనుకుంటారు. కానీ క్రెడిట్ కార్డు లిమిట్ 60 నుంచి 80 శాతం ఎప్పుడూ వినియోగంలో ఉండటం వల్ల సిబిల్‌పై ప్రభావితం చూపుతుంది. అందుకే క్రెడిట్ కార్డు లిమిట్‌ను తక్కువగా వినియోగించండి.

ఆలస్యంగా బిల్లు చెల్లింపులు

ఈఎంఐలు కాస్త ఆలస్యంగా చెల్లిస్తే ఏం కాదని చాలామంది భావిస్తారు. దీని వల్ల కూడా క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. కొంతమంది డ్యూ డేట్ మర్చిపోయి చెల్లింపులు చేయరు. అందుకే అకౌంట్ నుంచి ఆటోమేటిక్‌గా చెల్లింపులు అయ్యేలా సెటప్ చేసుకోండి. ఇక రిమైండర్లు పెట్టుకోండి.

తక్కువ కాలంలో ఎక్కువ లోన్లు

తక్కువ కాలంలో ఎక్కకువసార్లు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నా క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. ఒకే నెలలో వేర్వేరు బ్యాంకుల్లో ఐదుసార్లు దరఖాస్తు చేసుకుంటే క్రెడిట్ స్కోర్ ప్రభావితమవుతుంది. అందుకే లోన్ల కోసం దరఖాస్తు చేసేటప్పుడు మీ సిబిల్ స్కోర్ చెక్ చేసుకోండి. మీరు సదరు బ్యాంక్ లోన్ మంజూరు చేసే అవకాశం ఉంటేనే దరఖాస్తు చేసుకోండి. లేకపోతే వదిలేయడమే మంచిది.

పాత క్రెడిట్ కార్డులను మూసివేయడం

చాలామంది భారమై పాత క్రెడిట్ కార్డులను రద్దు చేయడం చూస్తుంటారు. ఇది మంచిది కాదు. మీరు పాత క్రెడిట్ కార్డులను మూసివేసినా మిగతా కార్డులపై వినియోగం ఎక్కువగా ఉంటే మీకు నష్టమే. పాత క్రెడిట్ కార్డులను మీరు సంవత్సరాలుగా వాడుతూ ఉంటారు గనుక మీ ప్రొఫైల్‌కు ఎక్కువ బలం ఉంటుంది. అందుకే పాత క్రెడిట్ కార్డులను రద్దు చేయకండి.