Penny for your Tweets: మనీ ట్రాన్స్‌ఫర్ విభాగంలోకి సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ అడుగుపెట్టబోతోంది. తమ ప్లాట్‌ఫాం నుంచి డబ్బు బదిలీ చేసే అవకాశం కల్పిస్తోంది ట్విట్టర్. ఇందుకు ప్రత్యేకంగా టిప్ జార్ అనే ఆప్షన్‌ను సంస్థ అభివృద్ధి చేస్తోంది. ఇటీవల ఈ ఫీచర్‌ను అమెరికాలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ‘క్రియేటర్స్’ పేరుతో కొంతమంది జాబితాను ట్విట్టర్ సిద్ధం చేసి పెడుతుంది. వారికి మాత్రమే ఇతర యూజర్లు డబ్బులు పంపించేలా వీలు కల్పిస్తోంది. ఇందులో జర్నలిస్ట్‌లు, ఎక్స్‌పర్ట్‌లు, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లు, కంటెంట్ క్రియేటర్స్, మ్యూజిక్ క్రియేటర్స్ మాత్రమే ఉంటారు. టిప్ జార్ ఫంక్షన్ అందుబాటులో ఉన్న ప్రొఫైల్స్‌కు ఒక ప్రత్యేకమైన ఐకాన్‌ను యాడ్ చేస్తున్నారు. అంటే వారికి మాత్రమే ఇతరులు డబ్బులు పంపగలుగుతారు. ప్రస్తుతానికి పేపాల్, వెన్మో, క్యాష్ యాప్ లాంటి అమెరికాలో పేరొందిన సర్వీసుల నుంచే డబ్బులు పంపే అవకాశం ఉంది. దీంతో తానూ నగదు బదిలీ రంగంలోకి అడుగు పెడుతున్నట్లు ట్విట్టర్ పేర్కొంది.
టిప్ జార్ ఆప్షన్ ప్రస్తుతం మొబైల్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత డెస్క్‌టాప్ యూజర్లకు ఇస్తారని తెలుస్తోంది. కంటెంట్ క్రియేటర్లుగా ట్విట్టర్ ఎంపిక చేసిన వారికి.. యూజర్లు తమకు నచ్చినంత డబ్బును టిప్ రూపంలో పంపవచ్చు. కొంతమంది మ్యూజిక్ కంటెంట్ క్రియేటర్లు తమ పాడ్‌కాస్ట్, యూట్యూబ్ వీడియోలు పెట్టి… దిగువ ‘మీకు నచ్చితే డబ్బులు ఇవ్వొచ్చు’ అని పేమెంట్ లింక్స్ పెడుతున్నారు. అలాంటివాళ్లు ఇకపై నేరుగా టిప్ జార్ ద్వారా డబ్బులు ఇవ్వొచ్చన్నమాట. అయితే, యూఎస్‌లో కొన్ని సంస్థల్లో జర్నలిస్టులు గిఫ్ట్‌లు తీసుకోవడం నిషేధం. దీంతో ఇప్పుడు టిప్ జార్ ద్వారా టిప్స్ తీసుకోవడం విషయంలో ఆయా మీడియా సంస్థలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో తెలియాల్సి ఉంది.
the twitter tip jar feature is rolling out y’all already know the drill pic.twitter.com/0OvGPqdFOd
— no (@afroelven) May 6, 2021
టిప్ జార్ వల్ల ఈమెయిల్ ఐడీ బయటకు రావడం చిక్కులు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతోపాటు పేమెంట్ చేసేటప్పుడు డబ్బులు పంపిన వ్యక్తికి చెందిన అడ్రస్ లాంటి వివరాలు.. డబ్బులు అందుకున్న వ్యక్తికి రిసిప్ట్ ద్వారా తెలిసిపోతున్నాయట. దీని వల్ల ప్రైవసీకి భంగంవాటిల్లుతుందని నెజటిన్లు అంటున్నారు. కొన్ని సందర్భాల్లో రిసిప్ట్ జనరేట్ అయినా డబ్బులు చేరడం లేదట. అయితే, దీనిపై ట్విట్టర్ స్పందిస్తూ… సమస్య పేమెంట్ సంస్థల వైపు నుంచి ఉందని చెప్పుకొచ్చింది. దీనిపై పే పాల్ కూడా స్పందించింది. ట్విట్టర్ వాడుతున్న పేపాల్ సర్వీసు ‘గూడ్స్ అండ్ సర్వీసెస్’కు సంబంధించినదని… అందుకే షిప్పింగ్ అడ్రస్ రూపంలో వివరాలు అవతలి వ్యక్తికి చేరుతున్నాయని చెప్పింది. అయితే, ‘ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ’ అనే ఆప్షన్‌కు యూజర్లు మారడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడొచ్చని చెప్పింది.
Read Also… Infosys Foundation: కరోనాపై పోరుకు ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. 100 కోట్ల విరాళం