Paytm Cashback Offer: బంపర్‌ ఆఫర్‌.. పేటీఎం నుంచి ఇంటి అద్దె చెల్లిస్తే రూ. 1000 క్యాష్‌బ్యాక్‌

|

Feb 28, 2021 | 8:42 PM

Paytm Cashback Offer: పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. పేటీఎం సరికొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. క్రెడిట్‌ కార్డుతో ఇంటి అద్దె చెల్లించే అవకాశాన్ని కల్పిస్తోంది...

Paytm Cashback Offer: బంపర్‌ ఆఫర్‌.. పేటీఎం నుంచి ఇంటి అద్దె చెల్లిస్తే రూ. 1000 క్యాష్‌బ్యాక్‌
Follow us on

Paytm Cashback Offer: పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. పేటీఎం సరికొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. క్రెడిట్‌ కార్డుతో ఇంటి అద్దె చెల్లించే అవకాశాన్ని కల్పిస్తోంది. పేటీఎంలో మొబైల్‌ రీచార్జ్‌ చేయడం, పోస్టు పెయిడ్‌ బిల్లు చెల్లించడం , కరెంటు బిల్లు కట్టడం, అలాగే గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసుకోవడం తదితర అనేక సదుపాయాలు పేటీఎం కల్పిస్తోంది. తాజాగా కొత్తగా ఇంటి అద్దె విషయంలో మంచి ఆఫర్‌ను ప్రకటించింది పేటీఎం. అద్దెకు ఉంటున్నవారు ఇంటి యజమాని అకౌంట్‌లోకి అద్దె ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. అసలు విషయం ఏంటంటే క్రెడిట్ కార్డు ద్వారా ఇంటి అద్దెను చెల్లించవచ్చు. రెంట్‌ పేమెంట్‌ ఫీచర్‌ ద్వారా ఇంటి అద్దె చెల్లించినట్లయితే రూ. 1000 క్యాష్‌ బ్యాక్‌ లభిస్తుంది. ప్రతీ ట్రాన్సాక్షన్‌పై క్యాష్‌ బ్యాక్ పొందే అవకాశం కల్పిస్తోంది. క్రెడిట్ కార్డ్ పాయింట్స్ కూడా వస్తాయి. పేటీఎంలో ఇంటి అద్దె చెల్లించడానికి ముందుగా మీ పేటీఎం యాప్ ఓపెన్ చేయండి. హోమ్ స్క్రీన్‌పై Recharge & Pay Bills పైన క్లిక్ చేయండి.
అందులో Rent Payment అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేయాలి.

ఆ తర్వాత Proceed అనే ఆప్షన్‌పైనే క్లిక్ చేయాలి. తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, అకౌంట్ హోల్డర్ పేరు ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడం అనేది ఆప్షనల్ మాత్రమే. తర్వాత ప్రొసీడ్ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిన క్లిక్ చేయాలి. ఆ తర్వాత డబ్బులు ఎంత అనేది ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత Proceed to Pay పైన క్లిక్ చేయాలి. తర్వాత క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసి పేమెంట్ పూర్తి చేయాలి. క్షణాల్లోనే పేమెంట్ ఓనర్ బ్యాంక్ అకౌంట్‌లోకి క్రెడిట్ అవుతుంది. క్రెడిట్ కార్డుతో పాటు యూపీఐ, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేసే సదుపాయం ఉంటుంది. ఇలా ఇంటి అద్దె చెల్లించడానికి ఇంటి యజమాని బ్యాంకు ఖాతా వివరాలు మాత్రమే ఎంటర్‌ చేస్తే సరిపోతుంది. ఇంతర వివరాలు ఎంటర్‌ చేయాల్సిన అవసరం లేదు. ఇక మీరు ప్రతీనెల చెల్లించిన ఇంటి అద్దెను ట్రాక్‌ చేయవచ్చు. 2021 మార్చి నాటికి రూ.300 కోట్లు ఇంటి అద్దె చెల్లిస్తారిన పేటీఎం అంచనా వేస్తోంది.

ఇవి కూడా చదవండి:

Bank Lockers: ఖాతాదారులు బ్యాంకుల్లో లాకర్లను ఉపయోగిస్తున్నారా… ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే

BSNL Broadband: రూ. 299కే బీఎస్‌ఎన్‌ఎల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌.. సరికొత్త ప్లాన్స్‌ అందుబాటులోకి..