Paytm offer: వంట గ్యాస్ 9 రూపాయలకే.. పేటీఎం క్యాష్ బ్యాక్ ఆఫర్.. ఎలా ఉపయోగించుకోవాలంటే..

ఇంట్లో పూట గడవాలంటే గ్యాస్ ఉండాల్సిందే. అయితే, అది కొనాలంటే మాత్రం గుండె గుభేలు మనే పరిస్థితి. నిత్యావసరం.. కాదు.. కాదు.. లేకుంటే బ్రతకలేని అవసరం.. కొనుక్కోవాలంటే ఆకాశాన్ని అంటే ధర.

Paytm offer: వంట గ్యాస్ 9 రూపాయలకే.. పేటీఎం క్యాష్ బ్యాక్ ఆఫర్.. ఎలా ఉపయోగించుకోవాలంటే..
Paytm offer
Follow us
KVD Varma

|

Updated on: Apr 20, 2021 | 6:57 PM

Paytm offer: ఇంట్లో పూట గడవాలంటే గ్యాస్ ఉండాల్సిందే. అయితే, అది కొనాలంటే మాత్రం గుండె గుభేలు మనే పరిస్థితి. నిత్యావసరం.. కాదు.. కాదు.. లేకుంటే బ్రతకలేని అవసరం.. కొనుక్కోవాలంటే ఆకాశాన్ని అంటే ధర. ఆ ట్యాక్స్.. ఈ ట్యాక్స్.. ఇలా ప్రస్తుతం అన్నీ కలిపి సుమారుగా 800 రూపాయలకు చేరుకుంది వంట గ్యాస్ సిలెండర్ ధర. ఏం కొనేట్టు లేదు.. ఏం తినేట్టు లేదు అని పాడుకుంటూనే గ్యాస్ కొనుక్కోవడం మధ్య-దిగువ తరగతి ప్రజలకు అలవాటు అయిపొయింది. అంతేగా.. మరేం చేస్తారు? అయితే, వంట గ్యాస్ సిలెండర్ కేవలం 9 రూపాయలకే ఇంటికి తెచ్చుకునే అవకాశం వస్తే.. అబ్బ ఎగిరి గంతేసి దానిగురించి తెలుసుకుందాం అనుకోరు. ఎగిరి గంతేయక్కర్లేదు కానీ..ఈ ఆర్టికల్ చదవండి.. 9 రూపాయలతో గ్యాస్ సిలెండర్ ఎలా పొందవచ్చో తెలుసుకోండి. అన్నట్టు ఇది అందరికీ రాదు.. కొందరికోసమే.. వివరాలు ఇలా ఉన్నాయి..

ప్రముఖ ఆన్ లైన్ పేమెంట్ యాప్ పేటీఎం ఈ ఆఫర్ అందిస్తోంది. మీరు కనుక పేటీఎం ద్వారా గ్యాస్ బుక్ చేసుకుంటే.. మీకు అద్భుతమైన క్యాష్ బ్యాక్ ఆఫర్ మా దగ్గర ఉంది అంటోంది పేటీఎం. అయితే, ఇక్కడో చిన్న మెలిక పెట్టింది పేటీఎం.. ఏమిటంటే.. తమ యాప్ ద్వారా గ్యాస్ బుక్ చేసుకునే వాళ్ళకి ఒక స్క్రాచ్ కార్డ్ ఇస్తానంటోంది. అందులో 10 రూపాయల నుంచి 800 వరకూ ఎంతైనా క్యాష్ బ్యాక్ రావచ్చని చెబుతోంది. అంటే అదృష్టం ఉంటె 800 రావచ్చు కదా. లేకపోయినా కనీసం 10 రూపాయలు వస్తుంది. ఆ పది రూపాయలా అనకండి. అది కూడా డబ్బే కదా! అంతకంటే ఎక్కువ వచ్చే చాన్స్ కూడా తీసిపారేయలేం కదా.. అంతే కాదు, గ్యాస్ పేటీఎం ద్వారా తీసుకున్నపుడు వచ్చే ఈ స్క్రాచ్ కార్డ్ కి ఏడురోజుల వ్యాలిడిటీ మాత్రమె ఉంటుంది. ఆ లోపు స్క్రాచ్ కార్డ్ ను ఉపయోగించాలి. ఇక ఈ ఆఫర్ మొదటిసారి పేటీఎం వాడుతున్న వారికీ మాత్రమె అందుబాటులో ఉంది. అలాగే ఇది ఈ నెల (ఏప్రిల్) 30 వ తేదీతో ముగుస్తుంది.

ఒకవేళ మేరు కనక.. మొదటిసారి పేటీఎం ను ఉపయోగిస్తున్నట్లయితే.. మీరు ఇలా చేయడం ద్వారా వంట గ్యాస్ సిలెండర్ పై క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందగలుగుతారు.. 1: ముందు మీరు పేటీఎం యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. 2: షో మోర్ (show more) అనే కేటగిరీ క్లిక్ చేయాలి 3: అక్కడ రీఛార్జ్ అండ్ పే బిల్స్ క్లిక్ చేయాలి 4: ఇక్కడ మీరు గ్యాస్ బుక్ చేసుకోవడానికి ఆప్షన్ కనిపిస్తుంది. దానిలో మీ గ్యాస్ ప్రొవైడర్ ఎంపిక చేసుకోవాలి 5: ఇక్కడ మీ ప్రోమో కోడ్ FIRSTLPGను ఎంటర్ చేయాలి. 6: మీరు గ్యాస్ బుక్ చేసుకున్న 24 గంటల లోపు స్క్రాచ్ కార్డ్ పొందుతారు. దానిని 7 రోజుల్లోగా ఉపయోగించి అందులో ఉన్న క్యాష్ బ్యాక్ పొందవచ్చు.

Also Read: Postal Charges: పోస్టాఫీసుల్లో కనీస బ్యాలెన్స్‌ ఛార్జీలు తగ్గింపు.. కీలక నిర్ణయం తీసుకున్న ఆర్థిక శాఖ

Vaccination: మే 1 నుంచి అందరికీ టీకా సరే.. వ్యాక్సిన్ సరఫరా కొరతను ఎలా అధిగమిస్తారు? నిపుణులు ఏమంటున్నారు?