Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paytm Offer: రూ.4 పంపిస్తే రూ.100 క్యాష్‌బ్యాక్‌.. బంపర్‌ ఆఫర్‌ ప్రకటించిన పేటీఎం..

డిజిటల్‌ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. మరోసారి 4కా 100 క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఇండియా వర్సెస్‌ దక్షిణాఫ్రికా టెస్ట్‌ సిరీస్‌ సందర్భంగా యూపీఐ నగదు బదిలీపై ఈ అద్భుతమైన ఆఫర్‌ను తిరిగి తీసుకొస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది...

Paytm Offer: రూ.4 పంపిస్తే రూ.100 క్యాష్‌బ్యాక్‌.. బంపర్‌ ఆఫర్‌ ప్రకటించిన పేటీఎం..
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Jun 10, 2022 | 4:49 PM

డిజిటల్‌ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. మరోసారి 4కా 100 క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఇండియా వర్సెస్‌ దక్షిణాఫ్రికా టెస్ట్‌ సిరీస్‌ సందర్భంగా యూపీఐ నగదు బదిలీపై ఈ అద్భుతమైన ఆఫర్‌ను తిరిగి తీసుకొస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ఆఫర్‌ జూన్‌ 19 వరకు ఉంటుందని పేర్కొంది. మ్యాచ్‌ రోజుల్లో కొత్త కస్టమర్లు పేటీఎం యూపీఐ ఉపయోగించి నాలుగు రూపాయలు పంపితే రూ.100 క్యాష్‌ బ్యాక్‌ పొందవచ్చని తెలిపింది. అలాగే ఇప్పటికే యాప్‌ కలిగిన కస్టమర్లు రిఫరల్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొనడం ద్వారా రూ.100 వరకు క్యాష్‌ బ్యాక్‌ పొందొచ్చని కంపెనీ వివరించింది. ఈ ఏడాది ఫిబ్రవరి ఇండియా వర్సెస్‌ సిరీస్‌లో ఈ ఆఫర్‌ను తొలిసారి ప్రవేశపెట్టినపుడు లక్షల మంది కస్టమర్లు రూ.100 క్యాష్‌బ్యాక్‌ను గెలుచుకున్నారని కంపెనీ తెలిపింది.

కొత్త వినియోగదారులు Google Playstore లేదా App Store నుంచి Paytm యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా Paytm UPIకి సైన్ అప్ చేయవచ్చు. Paytm యాప్‌లో UPI సేవలను ఉపయోగించి డబ్బు పంపించి క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. ఏదైనా UPI QR కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా చెల్లింపులు చేసినా క్యాష్‌ బ్యాక్‌ వస్తుంది. Paytm అనేది వినియోగదారులు, వ్యాపారులకు అత్యంత సమగ్రమైన చెల్లింపు సేవలను అందించే యాప్‌ల్లో ఒకటి.