Paytm: మార్చి 15 తర్వాత పేటీఎంలో ఎలాంటి సేవలు కొనసాగుతాయి? ఈ ప్రశ్నలకు ఆర్బీఐ సమాధానాలు!

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై నిషేధానికి సంబంధించి మీకు ఇంకా ఏవైనా ప్రశ్నలు ఉన్నాయా? దాని సర్వీసు ఎలా పని చేస్తుంది? గడువు తర్వాత ఎలా ఉండబోతోంది? ఆర్బీఐ ఆంక్షల తర్వాత ఎలాంటి సేవలు అందుబాటులో ఉంటాయన్నది చాలా మందిలో తలెత్తుతున్న ప్రశ్న. మీ సందేహాలన్నింటినీ పరిష్కరించడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రతి ప్రశ్నకు సమాధానాలను పంచుకుంది. అలాగే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సేవలపై నిషేధం గడువును ఆర్బీఐ ఫిబ్రవరి 29 నుండి మార్చి 15 వరకు పొడిగించింది..

Paytm: మార్చి 15 తర్వాత పేటీఎంలో ఎలాంటి సేవలు కొనసాగుతాయి? ఈ ప్రశ్నలకు ఆర్బీఐ సమాధానాలు!
Paytm

Updated on: Feb 18, 2024 | 7:15 AM

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై నిషేధానికి సంబంధించి మీకు ఇంకా ఏవైనా ప్రశ్నలు ఉన్నాయా? దాని సర్వీసు ఎలా పని చేస్తుంది? గడువు తర్వాత ఎలా ఉండబోతోంది? ఆర్బీఐ ఆంక్షల తర్వాత ఎలాంటి సేవలు అందుబాటులో ఉంటాయన్నది చాలా మందిలో తలెత్తుతున్న ప్రశ్న. మీ సందేహాలన్నింటినీ పరిష్కరించడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రతి ప్రశ్నకు సమాధానాలను పంచుకుంది. అలాగే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సేవలపై నిషేధం గడువును ఆర్బీఐ ఫిబ్రవరి 29 నుండి మార్చి 15 వరకు పొడిగించింది.

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు మార్చి 15 వరకు ఆర్బీఐ ఇచ్చిన ఉపశమనం ఏమిటంటే పేటీఎం సేవలు మార్చి 1 నుంచి నిషేధం ఉండగా, ఆ గడువును పెంచింది ఆర్బీఐ. ఇప్పుడు ఆ గడువు మార్చి 16.అటువంటి పరిస్థితిలో పేటీఎం నుండి మారాలనుకునే వినియోగదారులకు ఇప్పుడు మార్చి 15 వరకు సమయం ఉంది. పేటీఎం వాలెట్‌లో డబ్బు మిగిలి ఉన్నవారు కూడా మార్చి 15 వరకు ఉపయోగించుకోవచ్చు. అటువంటి పరిస్థితిలో మార్చి 16 తర్వాత పేటీఎంతో ఏం జరుగుతుందో ఆర్బీఐ సమాధానం ఇచ్చింది.

  • మార్చి 15 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతా నుండి డబ్బు విత్‌డ్రా చేయవచ్చా?:

అవును ప్రజలు మార్చి 15 తర్వాత కూడా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతా నుండి డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు లేదా నిధులను బదిలీ చేయవచ్చు. ఆ ఖాతాలో డబ్బు బకాయి ఉన్నంత వరకు మాత్రమే ఇది జరుగుతుంది. అదేవిధంగా బ్యాంకులో బ్యాలెన్స్ బాకీ ఉండే వరకు ప్రజలు ఈ ఖాతాల డెబిట్ కార్డులను కూడా ఉపయోగించవచ్చు.

ఇవి కూడా చదవండి
  • మార్చి 15 తర్వాత, మీరు మీ పొదుపు లేదా కరెంట్ ఖాతాలో డబ్బును జమ చేయగలరా?: 

కాదు, మార్చి 15, 2024 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సేవింగ్స్, కరెంట్ ఖాతాలో ఏ మొత్తం జమ చేయలేరు. ఫండ్స్‌పై వడ్డీ, క్యాష్‌బ్యాక్, పార్టనర్ బ్యాంక్‌తో స్వీప్-ఇన్, రీఫండ్ మాత్రమే అందుబాటులో ఉంటాయి.

  • మార్చి 15 తర్వాత పేటీఎంలోకి డబ్బు వేస్తే క్రెడిట్‌ అవుతుందా?

లేదు.. మీ డబ్బు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాకు వస్తే, అది మార్చి 16 తర్వాత క్రెడిట్ కాదు. ఇందుకోసం డబ్బును మరో ఖాతాలోకి మార్చుకోవాలి.

  • గ్యాస్ లేదా ఇతర ప్రభుత్వ సబ్సిడీలు ఖాతాలోకి వస్తాయా?

లేదు, మార్చి 16 నుండి మీ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలో ఎలాంటి సబ్సిడీ క్రెడిట్ ఉండదు. దీని కోసం మీరు మీ సబ్సిడీని మరొక ఖాతాకు లింక్ చేయాలి.

  • మార్చి 16 తర్వాత కరెంటు బిల్లులు ఆటోమేటిక్‌గా చెల్లింపులు అవుతాయా?

అవును, నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (NACH) సేవలు మార్చి 15 తర్వాత కూడా పనిచేస్తాయి. మీ ఫోన్ బిల్లు, లోన్ ఈఎంఐ మొదలైనవి ఆటోమేటిక్‌గా చెల్లించబడతాయి. కానీ మీ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలో డబ్బు మిగిలి ఉన్నంత వరకు మాత్రమే ఇది జరుగుతుంది. అదేవిధంగా, యూపీఐ ద్వారా ఓటీపీ సబ్‌స్క్రిప్షన్ చెల్లింపు కూడా అందులో బ్యాలెన్స్ మిగిలి ఉన్నంత వరకు మాత్రమే ఆటోమేటిక్‌గా ఉంటుంది.

  • పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వాలెట్ ఏమవుతుంది?

మీకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతా కాకుండా వాలెట్ ఉంటే మీరు మార్చి 15 తర్వాత కూడా ఈ సేవను ఉపయోగించవచ్చు. కొత్త డబ్బు ఇందులో కూడా డిపాజిట్ చేయడం ఉండదు. అంటే వాలెట్‌లో బ్యాలెన్స్ ఉన్నంత వరకు మీరు చెల్లింపు చేయవచ్చు.

  • పేటీఎం వాలెట్‌లో రీఫండ్ లేదా క్యాష్‌బ్యాక్ వస్తుందా?

అవును, మీ పేటీఎం వాలెట్‌లో ఏదైనా మొత్తాన్ని రీఫండ్ చేయాలన్నా లేదా క్యాష్‌బ్యాక్ పొందాలన్నా, అది 15 రోజుల తర్వాత కూడా సాధారణంగానే కొనసాగుతుంది.

  • పేటీఎం వాలెట్‌ని మూసివేసి, మరొక ప్రదేశానికి నిధులను బదిలీ చేయవచ్చా?

అవును, మీరు మీ పేటీఎం వాలెట్‌ను నిర్ణీత గడువులోగా మూసివేయాలనుకుంటే, మీరు వాలెట్‌లోని డబ్బును మరొక ఖాతాకు బదిలీ చేయవచ్చు. మీరు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ యాప్‌లో వాలెట్‌ని మూసివేయడానికి అభ్యర్థనను రూపొందించవచ్చు.

  • పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఫాస్ట్ ట్యాగ్ కొనసాగుతుందా?

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఫాస్టాగ్ గురించి చాలా మంది అయోమయంలో ఉన్నారు. పేటీఎం ఫాస్టాగ్‌లో బకాయి ఉన్నంత వరకు మాత్రమే ఉపయోగించవచ్చని ఆర్బీఐ స్పష్టంగా చేసింది. దీని తర్వాత మీరు వేరే బ్యాంకు ఫాస్టాగ్ తీసుకోవాలి. ఫాస్టాగ్‌లో మిగిలిన బ్యాలెన్స్‌ను బదిలీ చేసే సౌకర్యం కూడా లేదు.

  • మరొక బ్యాంక్‌తో లింక్ ఉన్నట్లయితే..

మీరు పేటీఎం POS మెషీన్, క్యూఆర్‌ కోడ్‌ లేదా సౌండ్‌బాక్స్‌ని ఉపయోగిస్తుంటే, పేటీఎం ఈ సేవలు కొనసాగుతాయి. ఒకవేళ ఈ డివైజ్‌లన్నీ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కి బదులుగా వేరే ఏదైనా బ్యాంక్‌కి లింక్ చేయబడితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి వారు మునుపటిలా పనులు కొనసాగించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి