Passenger vehicles: కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాలనూ గట్టిగానే తాకుతోంది. అసలే అటూ ఇటూగా ఉంటున్న ఆటోమొబైల్ రంగాన్ని కరోనా రెండో వేవ్ మరింత దెబ్బ కొట్టింది. ఏప్రిల్ నెలలో పాసింజర్ వాహనాల అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. మార్చితో పోలిస్తే 10శాతం విక్రయాలు పడిపోయాయి. మార్చి నెలలో మొత్తం 2,90,939 వాహనాలు మాత్రమే అమ్ముడుపోయాయని చెబుతున్నారు. తరువాత ఏప్రిల్ నెలలో పాసింజర్ వాహనాల విక్రయాలు 2,61,633 మాత్రమే జరిగాయి. గత సంవత్సరం ఏప్రిల్‌లో లాక్‌డౌన్ కారణంగా అసలు ఎటువంటి విక్రయాలు జరగలేదు. ‘‘ముందుగానే అనుకున్నట్లే ఏప్రిల్‌లో కొవిడ్ సెకండ్ వేవ్ ప్యాసింజర్ వాహన విక్రయాలను ప్రభావితం చేసింది. దీంతో మార్చితో పోలిస్తే అమ్మకాలు 10.07శాతం తగ్గాయి. కొవిడ్ కేసుల పెరుగుదల, వివిధ రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌లు, కఠిన ఆంక్షలే దీనికి కారణం’’ అని సొసైటీ ఆఫ్ ఆటోమొబైల్ మ్యానిఫ్యాక్చరర్స్(సియామ్) డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ తెలిపారు.
సియామ్ లెక్కల ప్రకారం ద్విచక్ర వాహనాల విక్రయాల్లో 33శాతం తగ్గుదల నమోదైంది. గత నెల మొత్తం 9,95,097 లక్షల విక్రయించారు. అదే మార్చిలో 14,96,806 వాహనాలను అమ్మారు. మోటార్ సైకిల్ విక్రయాలు 33శాతం , స్కూటర్ల విక్రయాల్లో 34శాతం తగ్గాయి. ఇక త్రిచక్ర వాహన విక్రయాలు 57శాతం పడిపోయాయి. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే మే నెలలో కూడా అమ్మకాలు మరింత పడిపోవచ్చని చెబుతున్నారు. ఇప్పటికే దాదాపుగా అన్నిరాష్ట్రాలు లాకౌట్ ప్రకటించడంతో..వాహన విక్రయాలు కింది చూపులు చూస్తున్నాయి. ఇక ఈ నెలలో పరిస్థితులు అంత అనుకూలించేలా లేవని సియామ్ భావిస్తోంది.
ఇదిలా ఉండగా.. కరోనా రెండో వేవ్ ప్రభావంతో దేశమంతా లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. మెల్లగా ఒక్కోరాష్ట్రమూ లాక్ డౌన్ బాట పట్టడమో.. లేకపోతే కఠిన ఆంక్షలు విధించడమో చేస్తున్నాయి. దీంతో వ్యాపార రంగాలు కుదేలు అవుతున్నాయి. ఈ ప్రభావం ఆటోమొబైల్ రంగం మీద కూడా గట్టిగానే పడింది. పోయిన నెలలో కొద్దిగా వ్యాపారాలు నడిచినా ఈ నెలలో అందుకు అవకాశం లేదు. దీంతో ఈ నెల అమ్మకాలు మరింత పడిపోతాయని భావిస్తున్నారు.
Petrol-Diesel Rates Today: రన్ రాజా రన్ అంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు… మన నగరంలో మాత్రం ఇలా…