Deadlines: మనం కొన్ని కొన్ని ముఖ్యమైన పనులు గడువులోగా చేయకపోతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో లావాదేవీలకు సంబంధించి పనులు ప్రతి రోజు ఉంటాయి. రోజులు పెరుగుతున్నకొద్ది నిబంధనలు మారిపోతున్నాయి. కొత్త కొత్త రూల్స్ వస్తున్నాయి. అందుకు అనుగుణంగా మనం పనులు చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర ఇబ్బందులతో పాటు పెనాల్టీలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), ప్రభుత్వాలు విధించిన గడువులోగా పనులు చేసుకోవాలి. ఇక 2022లో కూడా కొన్ని ముఖ్యమైన అలర్ట్స్ మీకు అందిస్తున్నాయి. ముఖ్యమైన పనులను గుర్తించుకొని గడువులోగా పూర్తి చేసుకోండి.
బ్యాంకు కేవైసీ దాఖలుకు తుది గడువు:
వివిధ బ్యాంకుల ఖాతాదారులు తమ బ్యాంకులకు కేవైసీ పత్రాలు సమర్పించేందుక తుది గడువు మార్చి 31. ఇది వరకు గత ఏడాది డిసెంబర్ 31 వరకు మాత్రమే ఉండేది. కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 31కి పొడిగించింది ఆర్బీఐ. ఖాతాదారులు గడువులోగా ఈ పని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి చివరి నాటికి కేవైసీ పత్రాలు లేకున్నా బ్యాంకులు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ లోపు కేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
ఐటీఆర్ వెరిపికేషన్‌కు తుది గడువు
2020-2021 ఆర్థిక సంతవ్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసిన వారికి ఆదాయం పన్ను శాఖ రిలాక్సేషన్ అవకాశం కల్పించింది. ఐటీఆర్‌ల ఈ-వెరిఫికేషన్ పెండింగ్‌లో ఉంటే ఐటీఆర్-5 పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. నేరుగా లేదా ఈ-వెరిఫికేషన్‌గా సమర్పించాల్సి ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు ఫిబ్రవరి 28వ తేదీ వరకు పత్రాలు సమర్పించి ఈ-వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలి.
పెన్షనర్ల లైఫ్ సర్టిఫికేట్ అందించడం..
వివిధ ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసి పదవి విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్ అందుతుంటుంది. అయితే వారు ప్రతి ఏడాది లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. నిరంతరంగా పెన్షన్ పొందాలంటే పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలి. దీనిని సమర్పించేందుకు ఫిబ్రవరి 28 వరకు గడువు ఉంది.ఇది వరకు డిసెంబర్ 31 వరకు గడువు ఉండేది. దానిని పొడిగించింది ప్రభుత్వం. వచ్చే నెల 28లోగా పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్‌ను అందించకుంటే బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ జమ కాదు.
అడ్వాన్స్ టాక్స్ పేమెంట్ గడువు..
ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి అడ్వాన్స్ టాక్స్ పేమెంట్ చేసేందుకు తుది గడువు మార్చి 15 వరకు. ప్రతి ఒక్కరు 100 శాతం అడ్వాన్స్ టాక్స్ పేమెంట్ చేయాలి. ఒక వేళ గడువులోగా చెల్లించకుంటే ఐటీ చట్టం కింద 234ఏ,234బీ సెక్షన్ల కింద వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు మాత్రం అడ్వాన్స్ టాక్స్ పేమెంట్స్ నుంచి మినహాయింపు ఉంటుంది.
పాన్-ఆధార్ లింకింగ్
పాన్‌కార్డు-ఆధార్‌తో లింక్ చేయడం ఈ పని పూర్తి చేసేందుకు ఇప్పటికే ఎన్నో సార్లు గడువు ఇచ్చింది. మీరు ఒక వేళ ఆధార్-పాన్ కార్డు అనుసంధానం చేయకపోతే మార్చి 31లోగా చేయాల్సి ఉంటుంది. ఒక వేళ గడువు తర్వాత లింక్ చేసుకుంటే రూ.1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆధార్‌తో అనుసంధానించకుండా పాన్ కార్డు ఇన్ ఆపరేటివ్‌గా మారితే మీరు షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో నిధులు మదుపు చేయడం కష్ట సాధ్యం అవుతుంది.
2021-22 ఐటీఆర్ ఫైలింగ్ గడువు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ రిటర్న్ దాఖలు చేయడానికి గడువు ఈ ఏడాది జూలై 31 వరకు పొడిగించింది ప్రభుత్వం. గడువు లోగా రిటర్న్ దాఖలు చేయకపోతే ఐటీ దాఖలు చేసేవారు రూ.5వేల జరిమానా చెల్లించుకోవాల్సి ఉంటుంది.
ఐటీఆర్ ఫైలింగ్ గడువు ఇది
మీరు 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ సమర్పించకపోతే మార్చి 31 తుది గడువు ఉంది. ఈ లోపు ఈ పని చేసుకోవాలి. ఈ నెల ఒకటో తేదీ నుంచి మార్చి 31 లోపు సమర్పించే ఐటీఆర్‌లను మరీ ఆలస్యం ఐటీఆర్ అని పేర్కొంటారు. రూ.5000 వరకు ఆలస్య రుసుముతో ఫైలింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రూ.5 లక్షల్లోపు ఆదాయానికి రూ.1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
మీరు 2021-22 ఆర్థిక సంవత్సరానికి పాత టాక్స్ విధానాన్ని ఎంచుకున్నట్లయితే ఆదాయం పన్ను చట్టంలోని వివిధ సెక్షన్ల కింద పన్ను మినహాయింపు పొందాలనుకుంటే అవసరమైన పనులను మార్చి 31లోగా పూర్తి చేసుకోవాలి. ఐటీ చట్టం 80సీ కింద రూ.1.5 లక్షలు, ఎన్‌పీఎస్ కంట్రిబ్యూషన్‌లకు 80సీసీడీ (1బీ) కింద రూ.50వేలు, మెడికల్ బీమా ప్రీమియం కింద రూ.25వేలు లేదా రూ.50వేలు మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది.
అడ్వాన్స్ పన్ను చెల్లింపు గడువు..
ఏప్రిల్ నుంచి మొదలయ్యే 2022-23 ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లింపుదారులు తొలి విడుత అడ్వాన్స్ టాక్స్ చెల్లింపునకు తుది గడువు జూన్ 15 వరకు ఉంది ఈ ఇచ్చిన గడువులోగా అడ్వాన్స్ టాక్స్‌లో 15 శాతం చెల్లించాల్సి ఉంటుంది. లేకపోతే ఆదాయం పన్ను చట్టంలోని 234బీ, 234సీ సె సక్షన్ల కింద టాక్స్‌పై అదనంగా వడ్డీ చెల్లించుకోవాల్సి ఉంటుంది.
డెబిట్/ క్రెడిట్ కార్డు టోకెనైజేషన్ గడువు
ఆన్‌లైన్‌లో సురక్షితంగా క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా లావాదేవీలు జరపడానికి ఆర్బీఐ నిబంధనలు విధించింది. ఈ సందర్భంగా టోకెనైజేషన్ వ్యవస్థ అమలు పరుస్తోంది. ఇది వరకు కార్డుల ద్వారా ఆన్‌లైన్‌లో లావాదేవీలు చేస్తే కార్డుకు సంబంధించి వివరాలు సేవ్ అయి ఉంటాయి. కానీ ఆర్బీఐ తీసుకువచ్చిన టొకనైజేషన్ విధానం ద్వారా ఎలాంటి వివరాలు సేవ్ ఉండదు. కార్డుకు సంబంధించి 16 అంకెలను మళ్లీ నమోదు చేయాల్సి ఉంటుంది. దానికి బదులుగా టోకెన్ నంబర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో సురక్షితంగా క్రెడిట్ లేదా డెబిట్ కార్డు లావాదేవీలు జరుపడానికి ఆర్బీఐ ఈ విధానాన్ని తీసుకువచ్చింది. దీనికి గడువు జూన్ 30 వరకు పొడిగించింది. వివిధ బ్యాంకులు తమ ఖాతాదారులకు ఈ-మెయిల్స్, ఎస్సెమ్మెస్‌లు పంపిన తర్వాత అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి మర్చంట్ వెబ్‌సైట్ల నుంచి బ్యాంకుల ఖాతాదారుల కార్డుల వివరాలు డిలిట్ అవుతాయి.
ఇవి కూడా చదవండి: