Food Delivery Apps: ప్రస్తుతం సర్వం ఆన్‌లైన్ మయమవుతోంది. ప్రతీ వస్తువును ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేస్తున్నారు. ఒకప్పుడు రెస్టారెంట్‌కు వెళ్లి ఫుడ్ తినేవారు ఇప్పుడు ఇంటికే ఆర్డర్ పెట్టుకొని తినేస్తున్నారు. మారుతోన్న కాలానికి అనుగుణంగా కంపెనీలు సైతం వినియోగదారులకు మరింత విస్తృత సేవలను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆన్‌లైన్ ఫుడ్ మార్కెట్‌కు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఇటీవల భారత్‌లో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాలో ఐపీఓలో దూసుకుపోతుండడం దీనికి ప్రత్యక్ష ఉదాహరణ చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా కూడా వినియోగాదారులు ఆన్‌లైన్ ఫుడ్‌కు ఆసక్తి చూపిస్తున్నారు. ఆన్‌లైన్ ఫుడ్ మార్కెట్ ఓ రేంజ్‌లో దూసుకుపోతుంది. మరి భారత్, చైనా, అమెరికా లాంటి దేశాల్లో ఈ ఆన్‌లైన్ ఫుడ్ మార్కెట్ ఎలా ఉంది.?లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
భారత్‌లో మొత్తం 136 మంది కోట్ల జనాభాకు గాను 43 శాతం మంది ఇంటర్‌నెట్‌ను ఉపయోగిస్తున్నారు. మన దేశంలో ఆన్‌లైన్ ఫుడ్ సేవలను వినియోగించుకుంటున్న వారు 4.5 నుంచి 5.5 కోట్ల మంది ఉన్నారు. ఈ లెక్కన రానున్న రోజుల్లో భారత్‌లో ఫుడ్ డెలివరీ రంగంలో మరిన్ని మెరుగైన అవకాశాలున్నాయని చెప్పవచ్చు. ఇండియాలో ఇంటర్‌నెట్ అవకాశం ఉండి ఆన్‌లైన్ ఫుడ్ వాడుతున్న వారు 9 శాతంగా ఉన్నారు. ఇక భారత్‌లో ప్రస్తుతం ఈ రంగంలో ఉన్న మార్కెట్ వాటాలో 45 శాతం జోమాటో, 47 శాతం స్విగ్గీ ఆక్రమించాయి.
ఆన్‌లైన్ డెలివరి రంగంలో చైనా మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేనంతగా ఇక్కడి ప్రజలు ఆన్‌లైన్ ఫుడ్‌కు ఆసక్తి చూపిస్తున్నారు. మొత్తం 143 కోట్ల మంది జనాభాలో 63 శాతం మంది ఇంటర్‌నెట్‌ను ఉపయోగిస్తున్నారు. ఇక డ్రాగన్ కంట్రీలో 43 నుంచి 47 కోట్ల మంది ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. ఇక్కడ ఇంటర్‌నెట్ వాడుతోన్న వారిలో 50 శాతం మంది ఆన్‌లైన్ ఫుడ్ సేవలను వినియోగించుకుంటున్నారు. చైనాలో ఈ రంగంలో 65 శాతం మెట్వాన్ అనే సంస్థ అస్తగతం చేసుకోగా 35 శాతం మార్కెట్‌ను ఈఎల్‌ఈ.మీ అనే సంస్థ దక్కించుకుంది.
అమెరికాలోనూ ఫుడ్ డెలివరి బిజినెస్ మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్లు సాగుతోంది. అమెరికాలో మొత్తం 33 కోట్ల జనాభా ఉండగా వీరిలో ప్రపంచంలోనే అత్యధికంగా ఏకంగా 88 శాతం మంది ఇంటర్‌నెట్‌ను ఉపయోగిస్తున్నారు. ఇక అమెరికాలో 9 నుంచి 12 కోట్ల మంది ఆన్‌లైన్ ఫుడ్ సేవలను వినియోగించుకుంటున్నారు. అగ్రరాజ్యంలో ఇంటర్‌నెట్ వినియోగిస్తున్న వారిలో 36 శాతం మంది ఆ సేవలను ఉపయోగించుకున్నారు. ఈ దేశం మొత్తం ఆన్‌లైన్ ఫుడ్ మార్కెట్‌లో డోర్ డ్యాష్ సంస్థ 45 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉండగా.. ఉబర్ ఈట్స్ 22 శాతం, గ్రూబ్ హబ్ 18 శాతం వాటాను కలిగి ఉంది.
Fire Dosa: నిప్పులు చిమ్మే ఫైర్ దోస.. ఇది చూసి షాక్ తింటున్న జనం..