Special Train: ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. సామాన్యుడికి తక్కువ చార్జీలతో అందుబాటులో ఉండే రైల్వే.. మరిన్ని సదుపాయాలను మెరుగు పరుస్తోంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆయా రూట్లలో ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇక ఎండాకాలం సీజన్ ఉండటంతో ప్రయాణికుల రద్దీ పెరుగుతుంది. దీంతో భారత రైల్వే (Indian Railway) శాఖ రైళ్ల విషయంలో ప్రత్యేక చర్యలు చేపడుతుంటుంది. ఇక కాన్పూర్ -యలహంక మధ్య ప్రత్యేక రైలును నడుపుతోంది దక్షిణ మధ్య రైల్వే. ఏప్రిల్ 26న శనివారం ఈ రైలు కాన్పూర్ నుంచి బయలుదేరుతుంది. ఆ రోజు సాయంత్రం 7.30 గంటల బయలుదేరి మరోసటి రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రైలు ఫతేపూర్, ప్రయాగ్‌రాజ్, మాణిక్‌పూర్, సత్నా, కట్ని, జబాల్‌పూర్, జుహరాపూర్, నాగ్‌పూర్, బల్లార్షా, సిర్‌పూర్, కాగజ్‌నగర్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, జోలార్‌పట్టి, బంగార్ పేట, కృష్ణారాజపురం స్టేషన్‌లలో ఆగుతుందని రైల్వే అధికారులు తెలిపారు.
ప్రయాణికుల సౌకర్యార్థం మరిన్ని రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. సమ్మర్ సీజన్‌లో మరిన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలిపారు.
భారతీయ రైల్వే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. టెక్నాలజీ పెరుగుతున్న కారణంగా రైల్వే ప్రయాణికులకు మరిన్ని సదుపాయాలను అందిస్తోంది. ఇప్పటికే కరోనా కాలంలో నిలిపివేసిన సేవలన్నింటిని ఒక్కొక్కటిగా మళ్లీ ప్రారంభిస్తూ వస్తోంది. తాజాగా దక్షిణ మధ్య రైల్వే వేసవికాలంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వారి సౌకర్యార్థం 104 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్-ఎర్నాకులం-సికింద్రాబాద్ మధ్య 26 ప్రత్యేక రైళ్లను, మచిలీపట్నం-కర్నూల్ సిటీ-మచిలీపట్నం మధ్య 78 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది.
ఇవి కూడా చదవండి: