స్వీగ్గీ లో పిజ్జా రూ.400. అదే జోమాటోలో రూ.350. ఇక బిర్యానీ అయితే రూ.450 వరకూ ఉంటుంది. మరి తక్కువ ధరలో బిర్యానీ కావాలంటే ఏమి చేయాలి? తక్కువ ధరకు ఫుడ్.. ఈ కళను ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) నిజం చేస్తోంది. నిజానికి ఫుడ్ విషయంలో డబ్బు ఆదా చేసుకోవడానికి ప్రజలు ఎక్కువగా ఓఎన్‌డీసీపై ఆధారపడటం ప్రారంభిస్తున్నారు. అసలు ఈ ఓఎన్‌డీసీ అంటే ఏమిటి? ఇది మార్కెట్ డైనమిక్స్‌ను ఎలా మారుస్తోంది? అవన్నీ తెలుసుకుందాం.
ఓఎన్‌డీసీ అంటే ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అనేది ప్రభుత్వం అభివృద్ధి చేసిన ఓపెన్ సోర్స్ నెట్‌వర్క్. దీనిపై, స్థానిక, చిన్న వ్యాపారాలు ఒక నెట్‌వర్క్ అప్లికేషన్‌లో భాగం అవుతాయి. ఓఎన్‌డీసీ ఇ-కామర్స్ రిటైలర్‌ల కోసం ఓపెన్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది చిన్న వ్యాపారవేత్తలు తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి, అలాగే ఈ రంగంలో పెద్ద కంపెనీల ఆధిపత్యాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఓఎన్‌డీసీ ప్రయోజనాలను సాధారణ భాషలో అర్థం చేసుకుందాం. దీనితో చిన్న వ్యాపారులు, దుకాణదారులు కిరాణా, ఫుడ్ ఆర్డర్, డెలివరీ, హోటల్ బుకింగ్ ప్రయాణంతో సహా అన్ని వ్యాపారాలలో తమ పరిధిని పెంచుకోగలుగుతారు. అంటే వారు ఎక్కువ మంది కస్టమర్‌లను చేరుకోగలుగుతారు.
ఓఎన్‌డీసీని బెంగళూరులో సెప్టెంబర్ 2022లో తొలిసారిగా ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫారమ్ చాలా నగరాల్లో అందుబాటులో ఉంది. అలాగే ప్రజలు ఉత్తమమైన డీల్‌లను పొందడానికి దీనిని ఉపయోగిస్తున్నారు. అయితే ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లు, ఓఎన్‌డీసీ మధ్య పోలికను చూస్తే.. ఆహార పదార్థాల ఉదాహరణను తీసుకోండి. ఈ ప్లాట్‌ఫారమ్ రెస్టారెంట్ యజమాని నేరుగా కస్టమర్‌కి ఫుడ్‌ను విక్రయించడానికి అనుమతిస్తుంది.. Swiggy, Zomato వంటి థర్డ్ పార్టీ యాప్‌ల వలె కాకుండా ఫుడ్ తక్కువ ధరలో అమ్ముతారు. ప్రస్తుతం ఓఎన్‌డీసీ ద్వారా ప్రతిరోజూ 10,000 ఆర్డర్‌లు ఉంటున్నాయి.
ONDCని Paytm యాప్ ద్వారా ఉపయోగించవచ్చు. ముందుగా Paytm యాప్‌లోని సెర్చ్ బార్‌లో ONDC అని టైప్ చేయండి. దీని తర్వాత గ్రోసరీ, ఫుడ్, హోమ్ అండ్ డెకర్ వంటి ఆప్షన్‌లు ఉంటాయి. ఇప్పుడు మీరు ఆహారాన్ని ఆర్డర్ చేయాలనుకుంటే, ఓఎన్‌డీసీ ఫుడ్‌కి వెళ్లి, అక్కడ నుంచి మీ ఆర్డర్‌ని ఎంచుకోండి. అదేవిధంగా మీరు ఇతర ఉత్పత్తులను కూడా ఆర్డర్ చేయవచ్చు.
ఇప్పుడు డెలివరీ భాగానికి వస్తున్నాం.. ఈ ప్లాట్‌ఫారమ్ ప్రాథమికంగా రెండు చివరలలో పనిచేస్తుంది ఒక చివర విక్రేత, మరొక చివర కొనుగోలుదారు. Gofrugal, Digiit వంటి కంపెనీలు విక్రేత వైపు హోస్ట్ చేస్తాయి. మరోవైపు పేటీఎం కొనుగోలుదారు వైపు ఇంటర్‌ఫేస్‌ను హోస్ట్ చేస్తుంది. ఓఎన్‌డీసీ ఇంటర్‌ఫేస్‌గా పనిచేస్తుండగా.. మీరు బర్గర్ కోసం ఆర్డర్ చేశారనుకుందాం.. ఈ లావాదేవీ బ్యాకెండ్‌కు హైపర్‌లోకల్ స్టార్టప్ Magicpin మద్దతు ఇస్తుంది. ఈ యాప్ ఓఎన్‌డీసీలో కొనుగోలుదారు, విక్రేత నెట్‌వర్క్ రెండింటిలోనూ భాగం. ఇప్పుడు డెలివరీ ఆర్డర్లు Dunzo ద్వారా చేయబడుతుంది. Magicpin భాగస్వామ్యంతో డెలివరీ యాప్ Dunzo ఈ పనిని చేస్తుంది.
ఓఎన్‌డీసీని ఆన్‌లైన్ డెలివరీ యూపీఐ అని పిలుస్తున్నారని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల పెద్ద, చిన్న రిటైలర్లందరినీ ఓఎన్‌డీసీలో చేరాలని ఆహ్వానించారు. ఇది భారీ అవకాశాలను సృష్టించేందుకు దోహదపడుతుందని చెప్పారు. గోయల్ మాట్లాడుతూ.. “ఓఎన్‌డీసీని విజయవంతం చేయడంలో వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్, టాటా, రిలయన్స్ పాత్ర పోషిస్తాయి. రాబోయే సంవత్సరాల్లో, ఓఎన్‌డీసీ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌గా నిరూపించబడుతుందని అన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి