Ola S1x EV Scooter: రూ.6 వేలకే ఓలా ఈవీ స్కూటర్ మీ సొంతం.. నమ్మలేని ఆఫర్ ప్రకటన..!

ఓలా మోటార్స్ ప్రస్తుతం భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీలలో ఒకటిగా ఉన్నాయి. దేశంలో ఈవీ స్కూటర్ల అమ్మకాల్లో ఓలా కంపెనీ స్కూటర్లు టాప్‌లో ఉన్నాయి. అయితే ఓలా కంపెనీ సూపర్ ఈవీ స్కూటర్ అయిన ఓలా ఎక్స్1 ఎక్స్‌పై ప్రస్తుతం కంపెనీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ స్కూటర్‌ను కేవలం రూ.6 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఓలా స్కూటర్ ఎస్1 ఎక్స్‌ను అతి తక్కువ ధరకు ఎలా పొందాలో? ఓ సారి తెలుసుకుందాం.

Ola S1x EV Scooter: రూ.6 వేలకే ఓలా ఈవీ స్కూటర్ మీ సొంతం.. నమ్మలేని ఆఫర్ ప్రకటన..!
Ola S1x

Updated on: Apr 11, 2025 | 5:00 PM

ఓలా ఈవీ స్కూటర్ ఎస్1ఎక్స్  ఫీచర్లు, బ్యాటరీ ప్యాక్  విషయానికి వస్తే  ఈ స్కూటర్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, డిజిటల్ స్పీడోమీటర్ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటాయి. అలాగే పనితీరు విషయానికి వస్తే ఈ స్కూటర్ 3కేడబ్ల్యూ గరిష్ట శక్తితో ఎలక్ట్రిక్ మోటారు, 3 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం ఉన్న లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. అలాగే ఈ స్కూటర్‌ను ఓ సారి చార్జ్ చేస్తే 190 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది.

మన దేశంలో ఓలా కంపెనీ చాలా ఈవీ స్కూటర్లు అందుబాటులో ఉంచింది. అయితే అన్ని వెర్షన్‌ల ఈవీ స్కూటర్ల కంటే ఓలా ఎస్1 ఎక్స్ ధర పరంగా చాలా సౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలను దృష్టి పెట్టుకుని ఈ స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. తక్కువ ధరకు మంచి రేంజ్, పనితీరును అందించే ఎలక్ట్రిక్ స్కూటర్‌ ఓలా ఎస్1ఎక్స్ అని నిపుణులు చెబుతున్నారు.  భారత మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.89,999. ముఖ్యంగా దూర ప్రయాణాలకు అనువైన స్కూటర్‌గా  ఓలా ఎస్1ఎక్స్ ఉంది. 

సూపర్ ఆఫర్ ఇదే

ఓలా ఎస్1ఎక్స్ స్కూటర్‌ను ఫైనాన్స్ ప్లాన్ కింద ఈఎంఐపై కొనుగోలు చేయవచ్చు. అయితే మీరు ముందుగా రూ.6,000 డౌన్ పేమెంట్ చెల్లించి ఈ స్కూటర్‌ను సొంతం చేసుకోవచ్చు. అయితే మిగిలిన సొమ్మును రాబోయే 3 సంవత్సరాలకు ఏడాదికి 9.7 శాతం వడ్డీ రేటుతో సులభంగా రుణం అందిస్తారు. 36 నెలలపాటు నెలకు రూ.2877 ఈఎంఐ కింద చెల్లించాల్సి ఉంటుంది. అయితే వడ్డీ రేటు అనేది మీరు ఉండే నగరంతో పాటు బ్యాంకునకు అనుగుణంగా మారుతూ ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి