
Ola Electric Scooter : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ త్వరలో భారతదేశంలో విడుదల కానుంది. ఈ స్కూటర్ కొత్త ట్రెండ్‌ని సృష్టిస్తుందని అందరు అనుకుంటున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ క్లాస్ ఫీచర్లను కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. ఇదే సమయంలో దాని రైడ్, పనితీరును కస్టమర్‌లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. 499 రూపాయలను చెల్లించి ఓలా స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ అమౌంట్ నామమాత్రంగా ఉండటం కూడా అడ్వాన్స్ రిజర్వేషన్ భారీగా పెరగడానికి ఓ కారణమైందని మార్కెట్ వర్గాలు చెబుతోన్నాయి. ఈ ఓలా స్కూటర్ ధర లక్ష రూపాయల నుంచి లక్షా 20 వేల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ స్కూటర్‌లో మరో కొత్త ఫీచర్ అందిస్తున్నట్లు కంపెనీ సీఈవో సీఈఓ భవీష్ అగర్వాల్ ప్రకటించారు. ద్విచక్రవాహనాల్లో చాలా అరుదుగా ఉండే రివర్స్ మోడ్‌ను దీనిలో పొందుపరిచినట్లు తెలిపారు. ‘రెవల్యూషన్ టు రివర్స్ క్లైమేట్ ఛేంజ్’ అనే క్యాప్షన్‌తో స్కూటర్ రివర్స్‌లో వెళుతున్న ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. ద్విచక్రవాహనాల్లో రివర్స్ మోడ్ చాలా అరుదుగా ఉంటుంది. ఖరీదైన బైక్ అయిన హోండా గోల్డ్ వింగ్ సహా.. బజాజ్ చేతక్, ఏథర్ 450ఎక్స్, టీవీఎస్ ఐక్యూబ్ వంటి ఈ-స్కూటర్లలో మాత్రమే ఈ ఫీచర్ ఉంది.
ఓలా స్కూటర్‌ను 18 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ చేయొచ్చని గతంలో ఓ సందర్భంలో కంపెనీ వెల్లడించింది. ఈ సగం ఛార్జింగ్‌తో 75 కి.మీ వరకు ప్రయాణించొచ్చని తెలిపింది. వీటితో పాటు తాళంచెవి లేకుండా యాప్ ద్వారానే స్కూటర్‌ను స్టార్ట్ చేసే అత్యాధునిక ఫీచర్‌ను కూడా ఇందులో పొందుపరిచినట్లు సమాచారం. ప్రస్తుతం స్కూటర్ బుకింగ్‌లు కొనసాగుతున్నాయి. 5వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15న ఈ స్కూటర్‌ను విడుదల చేయనున్నారు.
దేశంలో అడ్వాన్స్ బుకింగ్‌ను ప్రారంభించిన 24 గంటల్లో లక్ష బుకింగ్‌లు వచ్చాయి. ఏడు అంగుళాల టచ్ స్క్రీన్ డిస్‌ప్లే, జీపీఎస్ నావిగేషన్ అందుబాటులో ఉంటుంది. బ్లూటూత్ ద్వారా 4జీ కనెక్టివిటీ సౌకర్యం ఉంది. అతి పెద్ద క్లాస్ బూట్ స్పేస్, యాప్-బేస్డ్ కీలెస్ యాక్సెస్, సెగ్మెంట్-లీడింగ్ రేంజ్ వంటి ఫీచర్లతో రానుంది. డ్యూయల్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, సింగిల్-పీస్ సీట్, ఎక్స్‌టర్నల్ ఛార్జింగ్ పోర్ట్, ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్, ఎల్‌ఇడి టైల్లైట్, సామాను తీసుకెళ్లేందుకు హుక్, స్ప్లిట్-టైప్ రియర్ గ్రాబ్ హ్యాండిల్స్, బ్లాక్ కలర్ ఫ్లోర్ మత్, పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లు ఉంటాయి.
!won em ot netsiL
A revolution to Reverse climate change! See you on 15th August at https://t.co/lzUzbWbFl7 #JoinTheRevolution @OlaElectric pic.twitter.com/WXXn3sD8CN— Bhavish Aggarwal (@bhash) August 7, 2021