AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ola electric: ఓలా వాహన వినియోగదారులకు గుడ్ న్యూస్.. కొత్త సబ్ స్క్రిప్షన్ ప్లాన్స్ ప్రారంభం.. ధర, ప్రయోజనాలు ఇవి..

అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఎలక్ట్రిక్ స్కూటర్లను ఆవిష్కరించడంతో పాటు కస్టమర్లను ఆకర్షించేందుకు అనేక ఆఫర్లను ప్రకటిస్తూ వస్తోంది ఓలా. ఈ క్రమంలోనే ఓలా కేర్ సబ్‌స్క్రిప్షన్ అనే కొత్త కస్టమర్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రారంభించింది.

Ola electric: ఓలా వాహన వినియోగదారులకు గుడ్ న్యూస్.. కొత్త సబ్ స్క్రిప్షన్ ప్లాన్స్ ప్రారంభం.. ధర, ప్రయోజనాలు ఇవి..
Ola Electric Scooter
Madhu
|

Updated on: Jan 30, 2023 | 3:32 PM

Share

ఓలా సంస్థ ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో తన కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొంది. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన స్కూటర్లను ఆవిష్కరించడంతో పాటు కస్టమర్లను ఆకర్షించేందుకు అనేక ఆఫర్లను ప్రకటిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఓలా కేర్ సబ్‌స్క్రిప్షన్ అనే కొత్త కస్టమర్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ కొత్త ఓలా కేర్ సబ్‌స్క్రిప్షన్ లో రెండు ప్లాన్‌లను అందిస్తోంది. ఓలా కేర్, ఓలా కేర్ ప్లస్ అనే రెండు ప్లాన్‌ల ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసిన వినియోగదారులకు సేవలను అందించనుంది.

ప్లాన్ ధరలు, ప్రయోజనాలు..

ఈ రెండు ప్లాన్లకు సంబంధించిన ధరలు, ప్రయోజనాలను ఓలా ప్రకటించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.. ఓలా కేర్ ప్లాన్ తీసుకోవాలంటే ఏడాదికి రూ. 1999, అలాగే ఓలా కేర్ ప్లస్ రూ. 2,999 చెల్లించాల్సి వస్తుంది.

  • తక్కువ ధరకు వస్తున్న ఓలా కేర్ ప్లాన్ లో సర్వీస్ చేయించినప్పుడు లేబర్ చార్జి జీరో ఉంటుంది. అలాగే థెఫ్ట్ అసిస్టెన్స్ హెల్ప్ లైన్, రోడ్ సైడ్, పంక్చర్ అసిస్టెన్స్ వంటి ప్రయోజనాలు పొంద వచ్చు.
  • అలాగే ఓలా కేర్ ప్లస్ ప్లాన్లో వినియోగదారులు విభిన్న ప్రయోజనాలు పొందగలుగుతారు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసిన వారికి ఫ్రీ హోమ్ సర్వీసింగ్ లభిస్తుంది. అంటే ఇంటి వద్దకే వచ్చి ఓలా స్కూటర్ తీసుకెళ్తారు. సర్వీసింగ్ అయిపోయిన తర్వాత మళ్లీ ఇంటికి స్కూటర్‌ను తిరిగి తెచ్చిస్తారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండానే సర్వీసింగ్ పని అయిపోతుంది. వార్షిక సమగ్ర డయాగ్నసిస్, ఫ్రీ కన్సూమబుల్స్, 24 గంటలు డాక్టర్ అండ్ అంబులెన్స్ సర్వీస్ వంటివి పొందొచ్చు.
  • అలాగే ఓలా కేర్ ప్లస్ ప్లాన్‌లో ఇంకా ఉచిత ట్యాక్సీ రైడ్ బెనిఫిట్ కూడా పొందొచ్చు. ఓలా స్కూటర్ ట్రబుల్ ఇస్తే.. అప్పుడు ఈ సదుపాయం లభిస్తుంది. ఇంకా వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రేక్ డౌన్ అయితే అప్పుడు అక్కడ ఉచితంగానే హోటల్ అకామోడేషన్ లభిస్తుంది. అలాగే వెహికల్ కస్టడీ సర్వీస్ కూడా లభిస్తుంది.

ఎక్కడైనా వినియోగించుకోవచ్చు..

ఈ రెండు ప్లాన్లను కస్టమర్లు ఓలా సర్వీస్ నెట్ వర్క్ లో ఎక్కడైనా వినియోగించుకోవచ్చు. ఇది కస్టమర్లు వారి ఇంటి సమీపంలోని సర్వీస్ సెంటర్లోనూ వినియోగించుకోవచ్చని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

Follow Us
జడ వేసుకుంటేనే గుడిలోకి ఎంట్రీ.. లేదంటే గేటు బయటే..
జడ వేసుకుంటేనే గుడిలోకి ఎంట్రీ.. లేదంటే గేటు బయటే..
ఈ పిల్లి చిత్రంలో దాగున్న మరో జీవిని 10 సెకన్లలో గుర్తిస్తే..
ఈ పిల్లి చిత్రంలో దాగున్న మరో జీవిని 10 సెకన్లలో గుర్తిస్తే..
ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు.. విడుదలకు డేట్ ఫిక్స్
ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు.. విడుదలకు డేట్ ఫిక్స్
సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక..
సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక..
'మీరు విరిగిపోలేదు.. కేవలం అలసిపోయారు! గతాన్ని మోయడం ఆపండి..'
'మీరు విరిగిపోలేదు.. కేవలం అలసిపోయారు! గతాన్ని మోయడం ఆపండి..'
ఆ స్టార్ నటుడి కేఫ్‌లో ధరలు చూసి షాకవుతోన్న నెటిజన్లు
ఆ స్టార్ నటుడి కేఫ్‌లో ధరలు చూసి షాకవుతోన్న నెటిజన్లు
పండక్కి ముందే ఎయిర్‌టెల్ సూపర్ న్యూస్.. తక్కువ ధరలో రీఛార్జ్..
పండక్కి ముందే ఎయిర్‌టెల్ సూపర్ న్యూస్.. తక్కువ ధరలో రీఛార్జ్..
ఏడాది మొత్తం విజయ్‌ను మనం పెళ్లి చేసుకుందాం అని అడుగుతూనే ఉన్నా
ఏడాది మొత్తం విజయ్‌ను మనం పెళ్లి చేసుకుందాం అని అడుగుతూనే ఉన్నా
ఇక రుద్దాల్సిన పనిలేదు.. నల్లటి వెండి ఆభరణాలు నిమిషాల్లో..
ఇక రుద్దాల్సిన పనిలేదు.. నల్లటి వెండి ఆభరణాలు నిమిషాల్లో..
OTTని షేక్ చేస్తోన్న ఒడియా హారర్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ..
OTTని షేక్ చేస్తోన్న ఒడియా హారర్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ..