Ola Electric Car: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు S1, S1-ప్రో(Ola Scooter)తో తనకంటూ భారత మార్కెట్‌లో ఓపేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ స్కూటర్లు చాలా మంది దృష్టిని ఆకర్షించగలిగింది. వీటి తర్వాత ఓలా ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమలోకి అడుగు పెట్టబోతోంది. ఓలా ఎలక్ట్రిక్ కారు(Ola Electric Car)ను ఇప్పటికే సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ ఇటీవల తన ట్విట్టర్ ఖాతాలో రాబోయే ఓలా ఎలక్ట్రిక్ కారు ఎలా ఉండనుందో పంచుకున్నారు. ఓలా ఎలక్ట్రిక్ కారు గురించి మాట్లాడితే, ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ సరసమైన, ఆచరణాత్మకమైన ఎలక్ట్రిక్ వాహనం. ఓలా ఎలక్ట్రిక్ కారు డిజైన్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ను తలపిస్తుంది. ఈ కారు నిస్సాన్ లీఫ్ EV నుంచి ప్రేరణ పొందింది. ఇది ఐదు డోర్లతో రావచ్చని తెలుస్తోంది. దాని కాంపాక్ట్‌నెస్ ఉన్నప్పటికీ, క్యాబిన్ లోపల చాలా గ్లాస్ ప్యానెల్లు ఏర్పాటుచేయనున్నట్లు భావిస్తున్నారు.
EV దిగ్గజం టెస్లా ఒక చిన్న ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌పై పని చేస్తోంది. అది టెస్లా మోడల్ 3 స్థానంలో అమెరికన్ బ్రాండ్ నుంచి చౌకైన కారుగా తయారుచేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. టెస్లా చిన్న హ్యాచ్‌బ్యాక్ అనేక రెండరింగ్‌లు ఇంటర్నెట్‌లో కనిపించాయి. ఓలా ఎలక్ట్రిక్ కారు డిజైన్ కూడా అదే విధంగా కనిపిస్తోంది. ఓలా ఎలక్ట్రిక్ డిజైనర్లు టెస్లా డిజైన్ నుంచి ప్రేరణ పొందినట్లు తెలుస్తోంది.
ఇది ట్యాబ్ లాంటి సెంట్రల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో రానున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందులో స్పోర్టీ సీట్లు కూడా ఉంటాయని భావిస్తున్నారు. 360-డిగ్రీల గ్లాస్ ప్యానెల్ ప్రయాణీకులకు విశాలమైన వైబ్‌ను అందిస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఓలా ఎలక్ట్రిక్ కారు స్పోర్టీ అల్లాయ్ వీల్స్‌తో రావచ్చని భావిస్తున్నారు. ఈ కారు క్లీన్ షీట్ డిజైన్‌తో వచ్చే అవకాశం ఉంది. డిజైన్ కాన్సెప్ట్‌లో కారు డోర్ హ్యాండిల్స్ కనిపించలేదు. అయితే, ప్రొడక్షన్ మోడల్ మరింత లేటెస్ట్ డిజైన్‌తో రానున్నట్లు తెలుస్తోంది. ఆకర్షణీయమైన LED టెయిల్‌లైట్లు కారులో స్ట్రిప్ రూపంలో కనిపిస్తాయని అంటున్నారు.
Also Read: SBI Offer: ఎస్బీఐ కస్టమర్లకు బంపర్ ఆఫర్.. తక్కువ వడ్డీకే ద్విచక్ర వాహన రుణం..
Budget 2022: మిడిల్ క్లాస్‌పై ఆర్థిక మంత్రి వరాల జల్లు.. బడ్జెట్‌లో వీటికి ఉపశమనం లభించనుందా?