
దేశ వ్యాప్తంగా పండుగల సీజన్ ప్రారంభమైంది. దీంతో అన్ని రంగాల్లో ఫెస్టివల్ ఆఫర్ల జాతర కనిపిస్తోంది. ఇప్పటికే ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారంలలో ప్రత్యేక సేల్స్ నిర్వహిస్తున్నాయి. ఇదే క్రమంలో వరుసగా వస్తున్న పండుగల నేపథ్యంలో ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ప్రత్యేక సేల్ ను తీసుకొచ్చింది. రానున్న దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకొని భారత్ ఈవీ ఫెస్ట్ 2023 పేరిట ప్రత్యేక సేల్ ను అక్టోబర్ 15న ప్రారంభించింది. నవంబర్ 15 వరకూ కొనసాగనున్న ఈ సేల్లో అనేక ఆఫర్లు, డిస్కౌంట్లను ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై అందిస్తోంది. ప్రత్యేకమైన ఎక్స్ చేంజ్ సదుపాయం, స్పెషల్ డిస్కౌంట్లు, బ్యాటరీలపై వారంటీల పొడగింపు వంటి డీల్స్ ప్రకటించింది. అలాగే ఓలా ఎస్1ఎక్స్ ప్లస్ స్కూటర్ టెస్ట్ రైడ్ చేసే వినియోగదారులకు ప్రత్యేకమైన బహుమతులు అందివ్వనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ ప్రకటించిన భారత్ ఈవీ ఫెస్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలు, దానిలో ఆఫర్లను ఇప్పుడు తెలుసుకుందాం..
ఎక్స్ చేంజ్ ఆఫర్.. ఓలా వారి అధికారిక ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌లలో ఓలా ఎలక్ట్రిక్‌ను కొనుగోలు చేసే సమయంలో మీ పాత స్కూటర్‌ను ఎక్స్ చేంజ్ చేస్తే రూ. 10,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ను పొందుకోవచ్చు.
బ్యాంక్ ఆఫర్లు.. ఐడీఎఫ్సీ, బీఓబీ, ఎస్సీబీ, యెస్ బ్యాంక్, ఫెడరల్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్ డీఎఫ్సీ బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులపై 5శాతం ప్రత్యేకమైన డిస్కౌంట్ రూ. 5000 వరకూ పొందొచ్చు. వన్ కార్డ్ క్రెడిట్ కార్డ్ కలిగిన వినియోగదారులు 10శాతం తగ్గింపు రూ. 7,500 వరకు పొందవచ్చు.
నో కాస్ట్ ఈఎంఐ.. హెచ్ డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్‌లపై 3, 6 నెలల కాలపరిమితిపై నో-కాస్ట్ ఈఎంఐ అందుబాటులో ఉంది. బ్రాండ్ ఎంపిక చేసిన ఆర్థిక సేవలతో సున్నా ప్రాసెసింగ్ ఫీజులు, జీరో డౌన్ పేమెంట్‌ను వాగ్దానం చేస్తోంది.
బ్యాటరీ వారంటీ.. ఓలా ఉత్పత్తులు ప్రామాణికంగా మూడు సంవత్సరాల బ్యాటరీ వారంటీతో వస్తాయి. అయితే భారత్ ఈవీ ఫెస్ట్ సమయంలో, ఓలా ఎస్1 ప్రో (2వ తరం) కొనుగోలుదారులు ఉచితంగా రెండు సంవత్సరాల పాటు అదనపు వారంటీని పొందవచ్చు. ఇప్పుడు మొత్తం వారంటీ వ్యవధిని 5 సంవత్సరాలు చేరుతుంది. ఓలా ఎస్ 1 ఎయిర్ కొనుగోలుదారులు పొడిగించిన బ్యాటరీ వారంటీ, సమగ్ర ప్లాన్‌లపై 50 శాతం తగ్గింపును పొందవచ్చు.
ఓలా ఎలక్ట్రిక్ కచ్చితంగా ఈ పండుగ సీజన్‌లో తమ ఎలక్ట్రిక్ స్కూటర్‌లను లాభదాయకంగా చూస్తోంది. ఇంకా, ఇప్పటికే ఉన్న ఓలా ఎస్1 కస్టమర్ల కోసం, అక్టోబర్ 21 న బ్రాండ్ కమ్యూనిటీ డేని నిర్వహిస్తోంది. ఇక్కడ కొనుగోలుదారులు తమ స్కూటర్‌పై ఉచిత సర్వీస్ చెకప్‌లు , పొడిగించిన వారంటీ ప్లాన్‌లపై 50 శాతం తగ్గింపు ను పొందుతారు. అలాగే అక్టోబర్ 24 వరకూ తన కమ్యూనిటీ సబ్యులకు వారి స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఓలా స్కూటర్ రిఫర్ చేస్తే రివార్డు అందజేస్తుంది. రిఫరర్ కి ఉచిత ఓలా కేర్ ప్లస్ , ప్రతి రిఫరల్ కు రూ. 2000 వరకూ క్యాష్ బ్యాక్ వంటి ప్రయోజనాలు పొందుతారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..