OLA Offers: రూ. 50వేలకే ఓలా స్కూటర్.. మరికొన్ని గంటలే మిగిలింది ‘బాస్’.. అవకాశం వదలొద్దు.. 

|

Oct 12, 2024 | 7:57 AM

ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం బాగా పెరిగింది. వివిధ కంపెనీలకు చెందిన వాహనాలను ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. ఈ మార్కెట్ లో ఓలా సంస్థకు ప్రత్యేక స్థానముంది. పండగ సందర్భంగా ఓలా కంపెనీ 'బాస్ 72 అవర్స్ రష్ సేల్'ను ప్రారంభించింది. ఎంపిక చేసిన మోడల్ ను రూ.49,999 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

OLA Offers: రూ. 50వేలకే ఓలా స్కూటర్.. మరికొన్ని గంటలే మిగిలింది ‘బాస్’.. అవకాశం వదలొద్దు.. 
Ola Scooters
Follow us on

దేశంలో దసరా సంబరాలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ తమ కుటుంబాలతో సంబరాలు జరుపుకొంటున్నారు. పండగ సందర్బంగా బంధువులు, ఆత్మీయులు, స్నేహితులను ఇంటికి ఆహ్వానించడం మన సంప్రదాయం. అలాగే ఇంటికి అవసరమైన కొత్త వస్తువులను కొనుగోలు చేయడం ఆనవాయితీ. వాటిలో ద్విచక్ర వాహనాలు ప్రథమస్థానంలో ఉంటారు. చాలామంది పండగ సమయంలో వీటిని కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం బాగా పెరిగింది. వివిధ కంపెనీలకు చెందిన వాహనాలను ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. ఈ మార్కెట్ లో ఓలా సంస్థకు ప్రత్యేక స్థానముంది. పండగ సందర్భంగా ఓలా కంపెనీ ‘బాస్ 72 అవర్స్ రష్ సేల్’ను ప్రారంభించింది. ఎంపిక చేసిన మోడల్ ను రూ.49,999 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. మరో స్కూటర్ పై తగ్గింపులు పొందవచ్చు.

బాస్ 72 అవర్స్ రష్ సేల్..

ఓలా ఎలక్ట్రిక్ తన ‘బాస్ 72 అవర్స్ రష్ సేల్’ను అక్టోబర్ 10న మొదలు పెట్టింది. మూడు రోజులు పాటు అంటే 12వ తేదీ వరకూ కొనసాగుతుంది. దీనిలో భాగంగా ఎస్ 1ఎక్స్, ఎస్ 1 ప్రో స్కూటర్లపై ప్రత్యేక ఆఫర్లు ఇస్తోంది. దీనిలో భాగంగా ఓలా ఎస్ 1ఎక్స్ 2కేడబ్ల్యూహెచ్ వేరియంట్ ను రూ.49,999 (ఎక్స్ షోరూమ్) కంటే తక్కువ ధరకు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. ఇక ఓలా ఎస్ 1 ప్రో స్కూటర్ కు తగ్గింపులు అందజేస్తున్నారు. గరిష్టంలో రూ.25 వేలతో పాటు మరో రూ.5 వేలకు మార్పిడి బోనస్ గా అందిస్తున్నారు.

అదనపు ప్రయోజనాలు..

ప్రత్యేక ఆఫర్ లో ఓలా ఎస్ 1ఎక్స్ 2కేడబ్ల్యూహెచ్ వేరియంట్ అసలు ధరకంటే దాదాపు రూ.20 వేలు తక్కువకు లభిస్తుంది. అయితే ఈ స్టాక్ లు ప్రతి రోజూ పరిమితంగా ఉంటాయి. ఖాతాదారులు లభించే అదనపు ప్రయోజనాలు ఏమిటంటే రూ.25 వేలు విలువైన 8 ఏళ్లు / 80 వేల కిలోమీటర్ల వరకూ బ్యాటరీ వారంటీ లభిస్తుంది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డు ఈఎంఐలకు రూ.5 వేల వరకూ ఫైనాన్స్ ఆఫర్, రూ.6 వేలు విలువైన మూవ్ ఓఎస్ ప్లస్ అప్ గ్రేడ్ అందిస్తున్నారు.

త్వరలో మోటారు సైకిల్ విడుదల..

ఓలా తన సర్వీస్ నెట్ వర్క్ ను విస్తరించే ప్రయత్నం చేస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి 1000 కేంద్రాలకు రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ఉంది. దేశ వ్యాప్తంగా తన విక్రయాలు, సేవలను పెంచుకునే ప్రణాళికలో భాగంగా నెట్ వర్క్ పార్టనర్ ప్రోగ్రామ్ ను ప్రకటించింది. అలాగే తన ఎలక్ట్రిక్ మోటారు సైకిల్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో ఓలా రోడ్ స్టార్ ఎక్స్ ను ప్రదర్శించింది. దాని ధర రూ.74,999 (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది. 2025 జనవరి నుంచి డెలివరీ ప్రారంభం కానున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..