LPG Gas Booking – WhatsApp: వాట్సాప్‌తో ఓ మెసెజ్‌ చేస్తే చాలు మీ LPG గ్యాస్ సిలిండర్ బుక్ అవుతుంది.. ఎలా చేయాలో తెలుసా..

|

Oct 20, 2021 | 10:36 AM

పండుగ వేళ గ్యాస్ వినియోగదారులకు ఓ మంచి వార్త. గ్యాస్ కోసం పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు.. ఫోన్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీకు వాట్సప్ వాడటం వస్తే సరిపోతుంది.

LPG Gas Booking - WhatsApp: వాట్సాప్‌తో ఓ మెసెజ్‌ చేస్తే చాలు మీ LPG గ్యాస్ సిలిండర్ బుక్ అవుతుంది.. ఎలా చేయాలో తెలుసా..
Gas Booking
Follow us on

పండుగ వేళ గ్యాస్ వినియోగదారులకు ఓ మంచి వార్త. గ్యాస్ కోసం పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు.. ఫోన్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీకు వాట్సప్ వాడటం వస్తే సరిపోతుంది. గ్యాస్ బుక్కింగ్ చిటికెలో పని. స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత పనులు చాలా ఈజీగా అవుతున్నాయి. దీనికి తోడు డిజిటల్ ఇండియా సామాన్యుడి అనేక పనులను సులభతరం చేసింది. ప్రతి ఇంటిలో ఇంటర్నెట్ సదుపాయం వచ్చిన తర్వాత ఈ వ్యవస్థ చాలా సులభం అయ్యింది. డిజిటలైజేషన్‌తో పెద్ద క్యూలలో నిలబడాల్సిన అవసరం లేకుండా పనులను సులభతరం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ రోజు మనం మీ ఇంటి నుండి మీ మొబైల్ నుండి మీ గ్యాస్ అంటే LPG గ్యాస్ సిలిండర్‌ను ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి కావలసిందల్లా స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ డేటా, వాట్సాప్ మాత్రమే.

దేశంలో మూడు అతిపెద్ద LPG గ్యాస్ సిలిండర్ల సరఫరాదారులు ఇండియన్ ఆయిల్స్ ఇండినే, హిందుస్థాన్ పెట్రోలియం అనగా HP గ్యాస్, భారత్ పెట్రోలియం భారత్ గ్యాస్ తమ వినియోగదారులకు ఆన్‌లైన్ LPG సిలిండర్ బుకింగ్ సదుపాయాన్ని అందిస్తున్నాయి. గ్యాస్ సిలిండర్లను కాలింగ్ ద్వారా వెబ్‌సైట్ ద్వారా, మొబైల్ యాప్ ద్వారా, UPI, డిజిటల్ వాలెట్ ద్వారా, WhatsApp ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు

ఇండియన్ ఆయిల్స్ ఇండినే..

భారతీయ కంపెనీ వాట్సాప్ ద్వారా LPG గ్యాస్ సిలిండర్ కోసం 7588888824 నంబర్‌ను ప్రకటించింది. 7718955555 కు కాల్ చేయడం ద్వారా దేశీయ గ్యాస్ సిలిండర్‌ను కూడా నేరుగా బుక్ చేసుకోవచ్చు. ఈ రెండు సేవలను రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి మాత్రమే పొందవచ్చు. వాట్సాప్ ద్వారా సిలిండర్ బుక్ చేయడానికి మీరు ‘రీఫిల్’ అని టైప్ చేసి 7588888824 కి మెసేజ్ పంపాలి అంతే.. గ్యాస్ బుక్ అవుతుంది.

HP

కాల్, వాట్సాప్ రెండింటికి ఒకే నంబర్‌ను ప్రవేశపెట్టింది HP. ఈ సంఖ్య 9222201122. కస్టమర్లకు కావాలంటే వాట్సాప్‌లో కాల్ చేయడం లేదా మెసేజ్ చేయడం ద్వారా LPG గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. వాట్సాప్ మెసేజ్ బాక్స్‌కి వెళ్లి, 9222201122 కి ‘బుక్’ అని మెసేజ్ చేయండి . అలా చేయడం వలన గ్యాస్ సిలిండర్ బుక్ అవుతుంది. గుర్తుంచుకోండి ఈ ఫీచర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి మాత్రమే పొందుతారు.

భరత్ గ్యాస్..

భారత్ గ్యాస్ వినియోగదారులకు టోల్ ఫ్రీ నంబర్ 1800224344 జారీ చేసింది. మీరు ఈ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా లేదా WhatsApp సందేశం ద్వారా మీ LPG గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు. మీరు ‘BOOK’ లేదా ‘1’ అని టైప్ చేయడం ద్వారా మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి WhatsApp లో సందేశం పంపాలి. కొత్త సిలిండర్ బుకింగ్ నిర్ధారించబడిన వెంటనే మీ WhatsApp లో బుకింగ్ అభ్యర్థన స్థితి మార్చబడుతుంది.

ఇవి కూడా చదవండి: Last Date: ఈ నెలాఖరులోగా కచ్చితంగా ఈ 4 పనులు పూర్తి చేయండి.. లేకుంటే చాలా నష్టపోతారు..

TDP – YCP: ఏపీలో నిరసన జ్వాలలు.. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ – టీడీపీ నేతల పోటా పోటీ ఆందోళనలు..