Indian Railways: ఇకపై రైలు ఆలస్యంగా వస్తే ప్రయాణికులకు ఉచిత భోజనం.. 3 గంటల కన్నా లేటయితే పూర్తి చార్జీ వాపసు

|

Dec 04, 2024 | 10:47 AM

రైలు ప్రయాణం సౌకర్యంగా ఉన్నా.. ఒక్కోసారి స్టేషన్ కి గంటల తరబడి ఆలస్యంగా వస్తుంటాయి. దీంతో తాము ప్రయాణించవలసిన రైలు కోసం స్టేషన్లలో ప్రయాణికులు పడిగాపులు కాస్తుంటారు. ఇకపై ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు ఇండియన్ రైల్వే ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. అందేంటంటే..

Indian Railways: ఇకపై రైలు ఆలస్యంగా వస్తే ప్రయాణికులకు ఉచిత భోజనం.. 3 గంటల కన్నా లేటయితే పూర్తి చార్జీ వాపసు
Indian Railways Offer Refund And Free Meals
Follow us on

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 3: మన దేశంలో ఏ స్టేషన్‌లో చూసిన రైలు కరెక్ట్ టైంకి రావడం అనేది చాలా అరుదుగా కనిపించే సన్నివేశం. తరచూ రైళ్లు ఆలస్యంగా రావడంతో ప్రయాణికులు రైల్వే స్టేషన్లలో పడిగాపులు కాస్తుంటారు. అయితే ఈ అసౌకర్యానికి చెక్‌ పెట్టేందుకు రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే శుభవార్త చెప్పింది. ఇక నుంచి రైలు ఆలస్యమైతే ప్రయాణికులకు స్పెషల్ ఆపర్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఎయిర్ పోర్టుల్లో మాదిరి ప్రయాణించవల్సిన రైలు ఆలస్యం వస్తే రైల్వే ప్రయాణికులకు ఉచితంగా ఆహారం అందజేస్తామని ప్రకటించింది. ఐఆర్‌సీటీసీ క్యాటరింగ్‌ పాలసీ కింద నిర్దేశిత సమయం కన్నా రెండు లేదా అంతకంటే ఎక్కువ గంటలు రైలు ఆలస్యమైతే.. ఆ రైళ్లలో ప్రయాణించవల్సిన వారికి ఉచిత భోజనం లేదంటే అల్పాహారం అందజేస్తామని తెలిపింది.

ఈ సౌకర్యం రైల్వే ప్రయాణీకులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి లేదా చేరుకోవడానికి వేచి ఉన్న వారికి మాత్రమే అందిస్తారు. భోజనం లేదా అల్పాహారం సమయాన్ని బట్టి అందజేస్తారు. సాయంత్ర వేళ అయితే షుగర్‌, షుగర్‌ లెస్‌ పానియాలు, మిల్క్‌ క్రీమర్‌తోపాటు బిస్కెట్లు, టీ, కాఫీ, 200ML ఫ్రూట్ డ్రింక్‌ అందిస్తారు. మధ్యాహ్నం లేదా రాత్రి భోజనంలో అయితే సాచెట్‌లు, 7 పూరీలు, కూరలు, మసాల సాచెట్‌లు ఇస్తారు. ప్రయాణికులు తమకు కావల్సిన వాటిని ఎంపిక చేసుకోవచ్చు. అయితే ఈ ఉచిత భోజన సౌకర్యం రాజధాని, శతాబ్ది, దురంతో లాంటి ప్రీమియం రైల్లలో ప్రయాణికులకే వర్తిస్తుంది.

ఒకవేళ.. రైలు మరింత ఆలస్యంగా వస్తేమాత్రం ప్రయాణీకులకు పూర్తి ఛార్జీలు రిఫండ్‌ చేస్తారు. అంటే రైలు మూడు అంతకంటే ఎక్కువ ఆలస్యంగా రావడం లేదా దారి మళ్లించిన సందర్భంలో ప్రయాణికులు తమ టిక్కెట్‌లను రద్దు చేసి, వారి బుకింగ్ చార్జీలను వాపసు చేస్తారు. అయితే రైల్వే కౌంటర్లలో బుక్ చేసుకున్న వారు నగదు వాపసు పొందేందుకు వ్యక్తిగతంగా టికెట్‌ రద్దు చేసుకోవల్సి ఉంటుంది. లేదంటే రైలు వచ్చేంత వరకూ వెయిట్ చేసేందుకు వెయిటింగ్ రూమ్‌లలో సేదతీరవచ్చు. ఇలాంటి సందర్భాల్లో వెయిటింగ్‌ రూముల కోసం ఎటువంటి అదనపు చార్జీలు వసూలు చేయవు. అలాంటి సందర్భాల్లో రైల్వే స్టేషన్‌లలో ఆహార దుకాణాలు ఎక్కువ గంటలు పనిచేస్తాయి. ప్రత్యేకించి అర్థరాత్రి అయితే ప్రయాణికుల భద్రత కోసం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) స్టేషన్లలో అదనపు సిబ్బందిని మోహరింపజేస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.