గతంలో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి లైఫ్ సర్టిఫికెట్స్‌ను అందజేయాల్సి వచ్చేది. ఇప్పుడు డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలతో పాటు వివిధ పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా పింఛన్ దారులు ఆన్ లైన్ లో తమ జీవిత ధ్రువీకరణ పత్రాలను అందజేయవచ్చు. సీనియర్ సిటిజన్లు, మొబిలిటీ చాలెంజ్ వ్యక్తులు డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవను ఉపయోగించుకోవచ్చు. దీని ద్వారా తమ ఇళ్ల నుంచే లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించవచ్చు. మీరు కోరిన వెంటనే బ్యాంకు ప్రతినిధులు లేదా సర్వీస్ ప్రొవైడర్లు ఇంటికి వస్తారు. మీ వివరాలను, పత్రాలను ఆన్ లైన్ లో సబ్మిట్ చేస్తారు. దీని వల్ల ఇంటి నుంచి బయటకు రాకుండానే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే వీలు కలుగుతుంది.
సీనియర్ సిటిజన్లు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడానికి బ్యాంకులకు, పోస్టాఫీసుకు వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ వయసులో బయటకు రావాలంటే చాలా కష్టం. దీంతో ఇలాంటి వారికి ఉపయోగపడేలా డోర్ స్టెప్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల పింఛన్ దారులకు ఎలాంటి ఒత్తిడి లేకుండా సర్టిఫికెట్లను సమర్పించవచ్చు. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్ డీఎఫ్ సీ తో పాటు ప్రధాన బ్యాంకులన్నీ ఈ సేవలను అందజేస్తున్నాయి. అయితే దీని కోసం కొంత చార్జీ వసూలు చేస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి