Nirmala Sitharaman: జన్‌ధన్ యోజన ఖాతాల గురించి కీలక సమాచారం అందించిన మంత్రి నిర్మలాసీతారామన్
ఈ జన్ ధన్ యోజన కింద 50.70 కోట్ల మంది లబ్ధిదారుల ఖాతాల్లో సుమారు 206,781.34 కోట్ల రూపాయలు జమ అయ్యాయని అన్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 50 కోట్ల జన్‌ధన్ ఖాతాల్లో 56 శాతం మహిళలకు చెందినవే. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో 67 శాతం ఖాతాలు తెరిచారు. ఈ ఖాతాల ద్వారా దాదాపు 34 కోట్ల రూపే కార్డులు జారీ చేయబడ్డాయి..
కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన గురించి అందరికి తెలిసిందే. ప్రభుత్వ పథకంలో దేశంలోని కోట్లాది మంది లబ్ధిదారులు తమ ఖాతాలను తెరిచారు. ఈ ప్రభుత్వ పథకం గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్యమైన సమాచారాన్ని అందించారు. కౌటిల్య ఎకనామిక్ కాన్క్లేవ్ 2023 ప్రారంభోత్సవంలో నిర్మలా సీతారామన్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (జన్ ధన్ ఖాతా) గురించి ప్రస్తావించారు.
ఈ పథకాన్ని 2014లో ప్రారంభించారు
2014లో ప్రారంభించిన ప్రధాన్ మంత్రి జన్-ధన్ యోజన (PMJDY) దేశంలో ఆర్థిక చేరికలను తీసుకురావడానికి అతిపెద్ద సాధనంగా ఉద్భవించిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం అన్నారు. కౌటిల్య ఎకనామిక్ కాన్‌క్లేవ్ 2023ను ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ, 50కి పైగా ప్రభుత్వ పథకాల కింద ప్రయోజనాలు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ అవుతున్నాయన్నారు. ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు.
ఖాతాల్లో రూ.206,781.34 కోట్లు జమ అయ్యాయి
ఈ జన్ ధన్ యోజన కింద 50.70 కోట్ల మంది లబ్ధిదారుల ఖాతాల్లో సుమారు 206,781.34 కోట్ల రూపాయలు జమ అయ్యాయని అన్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 50 కోట్ల జన్‌ధన్ ఖాతాల్లో 56 శాతం మహిళలకు చెందినవే. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో 67 శాతం ఖాతాలు తెరిచారు. ఈ ఖాతాల ద్వారా దాదాపు 34 కోట్ల రూపే కార్డులు జారీ చేయబడ్డాయి.
ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకులు “జీరో బ్యాలెన్స్” ఖాతాలను అందిస్తున్నందున అవి ఒత్తిడికి లోనవుతాయని చాలా మంది వ్యాఖ్యానించారని, అయితే ఈ ఖాతాల్లో రూ.2 లక్షల కోట్లకు పైగానే ఉన్నాయని సీతారామన్ చెప్పారు.
మంత్రి తన ప్రసంగంలో వాతావరణ ఫైనాన్సింగ్, దానికి సంబంధించిన సవాళ్ల గురించి కూడా వివరంగా మాట్లాడారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితిలో బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకులు (MDBలు) సహా బహుపాక్షిక సంస్థలు తక్కువ ప్రభావవంతంగా మారాయని అన్నారు. అయితే ఈ జన్ ధన్ యోజన స్కీమ్ గురించి చాలా మంది ఎన్నో రకాలుగా వ్యాఖ్యలు చేశారని, అప్పుడు ఆ ఖాతాల వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకోవాలని అన్నారు. ఈ జీరో అకౌంట్ ఖాతాలతో వినియోగదారులు చాలా ప్రయోజనాలు పొందారని అన్నారు. ఇవే కాకుండా మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు ఎన్నో రకాల పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చిందని గుర్తు చేశారు. ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకునే విధంగా మోడీ ప్రభుత్వం పథకాలను రూపొందిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి