Fastag: ఫాస్టాగ్‌ వినియోగదారులకు ఎన్‌హెచ్‌ఏఐ గుడ్‌ న్యూస్‌.. కేవైసీ అప్‌డేట్‌ గడవు పెంచుతూ కీలక ప్రకటన

టోల్‌ ప్లాజాల వద్ద సమస్యను తీర్చడానికి ఫాస్టాగ్‌ సాంకేతికతను పరిచయం చేసింది. దీంతో టోల్‌ ప్లాజాల వద్ద రద్దీ క్రమేపి తగ్గుతూ వస్తుంది. అయితే నేషనల్‌ అథారిటీ ఆఫ​ ఇండియా ఫాస్టాగ్‌ వినియోగదారులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఫాస్టాగ్‌లో నో యువర్ కస్టమర్ (కేవైసీ)ని అప్డేట్ చేయడానికి ఎన్‌హెచ్‌ఏఐ గడువును పొడిగించింది.ఈ గడవు ఇప్పటికే ముగియగా తాజాగా ఫిబ్రవరి 29 వరకూ గడువు మరో నెల రోజులకు పెంచుతున్నట్లు నిర్ధారించింది.

Fastag: ఫాస్టాగ్‌ వినియోగదారులకు ఎన్‌హెచ్‌ఏఐ గుడ్‌ న్యూస్‌.. కేవైసీ అప్‌డేట్‌ గడవు పెంచుతూ కీలక ప్రకటన
Fastag

Updated on: Feb 03, 2024 | 7:30 AM

హైవేలపై ప్రయాణించే సమయంలో కార్ల దగ్గర నుంచి భారీ వాహనాల వరకూ టోల్‌ చెల్లించడం తప్పనిసరి. అయితే పెరుగుతున్న వాహనాల సంఖ్య కారణంగా హైవే టోల్‌ ప్లాజాల వద్ద టోల్‌ చెల్లించడానికి రద్దీ ఏర్పడుతుంది. దీంతో కిలో మీటర్ల మేర వాహనాల నిలిచిపోయే పరిస్థితి తల్లెత్తుతుంది. ఈ నేపథ్యంలో టోల్‌ ప్లాజాల వద్ద సమస్యను తీర్చడానికి ఫాస్టాగ్‌ సాంకేతికతను పరిచయం చేసింది. దీంతో టోల్‌ ప్లాజాల వద్ద రద్దీ క్రమేపి తగ్గుతూ వస్తుంది. అయితే నేషనల్‌ అథారిటీ ఆఫ​ ఇండియా ఫాస్టాగ్‌ వినియోగదారులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఫాస్టాగ్‌లో నో యువర్ కస్టమర్ (కేవైసీ)ని అప్డేట్ చేయడానికి ఎన్‌హెచ్‌ఏఐ గడువును పొడిగించింది.ఈ గడవు ఇప్పటికే ముగియగా తాజాగా ఫిబ్రవరి 29 వరకూ గడువు మరో నెల రోజులకు పెంచుతున్నట్లు నిర్ధారించింది. ఎన్‌హెచ్‌ఏఐ తీసుకున్న తాజా నిర్ణయంపై మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

గత నెలలో ఎన్‌హెచ్‌ఏఐ డిజిటల్ సేవల కోసం కేవైసీ వివరాలను అప్డేట్ చేయాల్సిందిగా ఫాస్టాగ్‌ వినియోగదారులందరినీ కోరింది. కేవైసీను సకాలంలో అప్‌డేట్ చేయడంలో విఫలమైన వారి ఫాస్టాగ్‌ నిర్వీర్యమవుతుందని పేర్కొంది. ఆటోమేటిక్ టోల్ వసూలు, టోల్ ప్లాజాల వద్ద పొడవైన క్యూలను ఆదా చేయడానికి ఫిబ్రవరి 15, 2021 నుంచి ప్రతి వాహనంపై ఫాస్టాగ్‌ తప్పనిసరి చేశారు. ఎలక్ట్రానిక్ టోల్ సేకరణ వ్యవస్థకు సంబంధిచిన సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఎన్‌హెచ్‌ఏఐ ‘ఒక వాహనం, ఒకే ఫాస్టాగ్’ ప్రచారాన్ని ప్రారంభించింది.అయితే ఇప్పటి వరకూ జారీ చేసిన 1.27 కోట్ల ఫాస్టాగ్‌లో కేవలం ఏడు లక్షల బహుళ ఫాస్టాగ్లు మూసివేశారు. తదుపరి గడువు ముగిసేలోపు మిగిలిన ఫాస్టాగ్‌ ఖాతాలు మూసేస్తారని ఎన్‌హెచ్‌ఏఐ ఆశిస్తోంది. ఫాస్టాగ్‌కు ప్రస్తుతం ఎనిమిది కోట్ల మందికి పైగా వినియోగదారులు ఉన్నారు.

ఫాస్టాగ్‌ కేవైసీ అప్‌డేట్‌ ఇలా

స్టేటస్‌ చెక్ 

ఫాస్టాగ్‌ కేవైసీ స్థితిని తనిఖీ చేయాలి. ముందుగా మీ ఖాతా తాజా ఫాస్టాగ్‌ కైవేసీ స్థితిని తనిఖీ చేయాలి.  ఫాస్టాగ్‌  కస్టమర్ వెబ్ పోర్టల్‌ను సందర్శించండి. ఆపై రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, పాస్‌వర్డ్ ఉపయోగించి మీ ఖాతాలోకి లాగిన్ అవ్వండి. మీరు ధ్రువీకరణ కోసం ఓటీపీను కూడా ఉపయోగించవచ్చు. లాగిన్ అయిన తర్వాత డాష్‌ బోర్డ్‌కు నావిగేట్ చేసి, ‘నా ప్రొఫైల్’ ఎంపికను ఎంచుకోండి. ఇది రిజిస్ట్రేషన్ ప్రక్రియ సమయంలో సమర్పించిన అన్ని వివరాలను మీకు చూపుతుంది.

ఇవి కూడా చదవండి

కేవైసీ అప్‌డేట్ చేయకపోతే 

తాజా ఫాస్టాగ్‌ కోసం కేవైసీ అప్‌డేట్‌ చేయకపోతే, ‘నా ప్రొఫైల్’ విభాగంలో కేవైసీ ఉప-విభాగాన్ని గుర్తించాలి. కేవైసీ ఉప-విభాగాన్ని క్లిక్ చేసిన తర్వాత, మీరు కస్టమర్ రకాన్ని ఎంచుకోమని అడుతుంది. అప్పుడు అవసరమైన ఐడీ రుజువు, చిరునామా రుజువు పత్రాలను సమర్పించడం ద్వారా తప్పనిసరి ఫీల్డ్స్‌ను పూరించండి. అదనంగా రుజువుగా పాస్‌పోర్ట్ సైజు ఫోటో, చిరునామా వివరాలను అప్‌లోడ్‌ చేయాలి. ఈ వివరాలను సమర్పించే ముందు, మీరు పత్రాలు, సమాచారానికి సంబంధించిన ప్రమాణీకరణ స్వీయ-డిక్లరేషన్ బాక్స్లో టిక్ చేసి మీ కేవైసీ వివరాలను సమర్పించండి.

కావాల్సిన డాక్యుమెంట్లు 

ఫాస్టాగ్‌ కోసం కేవైసీ అప్ డేట్ చేస్తున్నప్పుడు మీరు ఈ డాక్యుమెంట్లను సులభంగా ఉంచుకున్నారని నిర్ధారించుకోవాలి. వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆరసీ) మీ వద్ద ఉండాలి. అలాగే ఒక పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫోటోతో పాటు డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్‌లేదా వాహన యజమానికు సంబంధించిన ఓటరు గుర్తింపు కార్డు, ఫాస్టాగ్‌ కొనుగోలు చేసి వాహనం తప్పనిసరిగా ఉండాలి. ఈ పత్రాల్లో దేనినైనా యజమాని గుర్తింపు రుజువుగా అందించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..