
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ ట్రైన్ పట్టాలెక్కింది. భారతీయ రైల్వేల్లో కొత్త యుగానికి నాంది పలుకుతూ ఈ సూపర్ ట్రైన్ పరుగులు పెట్టనుంది. ఈ ప్రత్యేక రైలును తాజాగా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ రైల్వే స్టేషన్‌లో పరిశీలించారు. ఇంజన్‌తో పాటు ఇంటీరియర్‌ను ప్రత్యేకంగా సందర్శించారు.
Middle & low-income families की next-generation सवारी…
🚆Vande Bharat Sleeper pic.twitter.com/kTDXxW2k85— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 3, 2026
మంత్రి ట్రైన్‌ను పరిశీలిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ సమయంలో ట్రైన్ లోపలి భాగం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. లగ్జరీ విమానాన్ని తలదన్నేలా ట్రైన్ ఇంటీరియర్ ఉందని అంటున్నారు. నిద్రపోయి ప్రయాణించే విధంగా కొన్ని లగ్జరీ బిజినెస్ క్లాస్ విమానంలో ఉన్నట్లే ఈ స్లీపర్ ట్రైన్ బెర్త్‌లు ఉన్నాయని అంటున్నారు. కాగా ట్రైన్ పరిశీలన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇది మధ్య తరగతి, తక్కువ ఆదాయ వర్గాల బండి అంటూ పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతో లగ్జరీ ప్రయాణం అందించనున్నాయి ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్‌లు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి