New Property Registration Rules: స్థిరాస్తి క్రయవిక్రయాలపై టీడీఎస్ (ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్) కొత్త నిబంధనలు రానున్నాయి. తాజా బడ్జెట్‌లో ప్రస్తుతం స్థిరాస్తులకు సంబంధించి అమ్మకపు విలువపై టీడీఎస్ వర్తిస్తుంది. ఇక నుంచి స్థిరాస్తి కొనుగోలు చేసేటప్పుడు (వ్యవసాయ భూమిని మినహాయించి) విలువ రూ. 50 లక్షలకు మించితే అమ్మకపు విలువ లేదా స్టాంపు డ్యూటీ విలువల్లో ఏది ఎక్కువైతే.. దానిపై ఒక శాతం టీడీఎస్ చెల్లింపు తప్పనిసరి. సాధారణంగా ఆస్తుల కొనుగోళ్లలో స్టాంప్ డ్యూటీ విలువ వాస్తవ విలువ కంటే తక్కువగా ఉంటుంది. వ్యక్తుల మధ్య జరిగే డబ్బు చెల్లింపు ఎక్కువగా ఉంటుంది.
పన్ను ఎగవేతను అరికట్టేందుకు..
అందువల్ల తాజాగా తెస్తున్న విధానం ద్వారా పన్ను ఎగవేతను అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఉదాహరణకు చెప్పాలంటే ఒక వ్యక్తి ఇల్లు రూ. 60 లక్షలకు కొన్నారనుకుందాం. కానీ ఇంటిని రిజిస్ట్రేషన్ కు స్టాంపు డ్యూటీ రూ. 72 లక్షలు అనుకోండి.. పాత రూల్స్ ప్రకారం రూ. 60 లక్షలకు టీడీఎస్ చేయాలి. కానీ తాజా ప్రతిపాదనల ప్రకారం.. రూ. 72 లక్షల మీద 1 శాతం టీడీఎస్ చెల్లించాలి. దీనివల్ల టీడీఎస్ మొత్తం పెరుగుతుంది. అంతే కాకుండా, క్యాపిటల్ గెయిన్స్ లెక్కించడానికి ఎక్కువ మొత్తాన్నే పరిగణిస్తారు. ఇకపై కొత్త నిబంధనల ప్రకారం.. ఆస్తి అమ్మకపు విలువ, స్టాంపు డ్యూటీ విలువ రూ. 50 లక్షలు దాటితేనే టీడీఎస్ రూల్స్ వర్తించనున్నాయి.
ఇటువంచి చర్యలతో ప్రభుత్వానికి పన్ను ఆదాయం పెరుగుతుంది. కొన్న వ్యక్తి ఎక్కువ మొత్తం పన్నుని రికవరీ చేసి టీడీఎస్ ఖాతాలోకి జమ చేస్తారు. అయితే, ఈ జమ .. అమ్మే వ్యక్తి స్వంత ఖాతాలో పన్ను చెల్లించినట్లుగా పడుతుంది. అమ్మే వ్యక్తి పన్ను చెల్లించాల్సి ఉంటే టీడీఎస్‌ను పరిగణనలోకి తీసుకుని మిగతా మొత్తాన్ని చెల్లిస్తారు. కానీ పూర్తిగా మినహాయింపు పొందే వ్యక్తికి ఈ టీడీఎస్ మొత్తం రిఫండ్ రూపంలో వస్తుంది. అలా వచ్చే వరకు.. అది ప్రభుత్వం వద్దనే ఉంటుంది. రిఫండు వచ్చాక సరే సరి. అంటే, ప్రభుత్వం ముందుగానే ఎక్కువ టీడీఎస్ వసూలు చేసి అసెస్‌మెంట్ తర్వాత వెనక్కు ఇస్తుంది.
ఇవీ చదవండి..
Business Loan: వ్యాపారానికి రుణం తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలో.. ఇక్కడ తెలుసుకోండి..
Gold Price Today: మహిళలకు బ్యాడ్‌న్యూస్.. పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో..