Car Sales: మైండ్ బ్లాక్ అయ్యే ఆఫర్.! రూ. 2 లక్షలు ఉంటే చాలు.. ఈ కారు ఇంటికి తెచ్చుకోవచ్చు

టాటా సియెర్రా కొత్త లుక్‌తో మార్కెట్‌లోకి వచ్చేసింది. రూ. 11.49 లక్షల నుంచి ప్రారంభమయ్యే ఈ ఎస్‌యూవీని కేవలం రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో మీ సొంతం చేసుకోవచ్చు. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో.. త్వరలో ఎలక్ట్రిక్ వేరియంట్‌తో అందుబాటులోకి రానుంది.

Car Sales: మైండ్ బ్లాక్ అయ్యే ఆఫర్.! రూ. 2 లక్షలు ఉంటే చాలు.. ఈ కారు ఇంటికి తెచ్చుకోవచ్చు
Tata Sierra Car

Updated on: Jan 30, 2026 | 9:39 AM

ఐకానిక్ ఎస్‌యూవీ టాటా సియెర్రా కొత్త లుక్‌తో మార్కెట్‌లోకి వచ్చేసింది. న్యూ లుక్, శక్తివంతమైన ఇంజిన్లు, అందుబాటు ధరలో దొరుకుతోంది. 1990లలో మొదటిసారిగా మార్కెట్‌లోకి వచ్చిన ఈ కారు అప్పట్లో తెగ క్రేజ్ సంపాదించింది. ఇప్పుడు, సరికొత్త టెక్నాలజీ, ప్రీమియం ఇంటీరియర్స్, న్యూ లుక్‌తో కస్టమర్లను మరింతగా ఆకట్టుకోబోతోంది. కొత్త టాటా సియెర్రా బేస్ మోడల్ ధర రూ. 11.49 లక్షల నుంచి ప్రారంభమై, టాప్ మోడల్ ధర రూ. 18.49 లక్షల వరకు ఉంటుంది. అయితే ఈ ధరలు వివిధ నగరాలు, షోరూమ్‌లను బట్టి మారే అవకాశం ఉంది. అలాగే కస్టమర్లు కేవలం రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించి ఈ కారును ఈఎమ్ఐ ద్వారా పొందొచ్చు.

ఇది చదవండి: మటన్ బోటీ ఇలా తింటున్నారా.! అయితే విషంతో సమానం..

సియెర్రా ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో అందుబాటులో ఉంది. ఈ సంవత్సరంలో దీని ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా మార్కెట్‌లోకి రానుంది. ఇంజిన్ ఆప్షన్ల విషయానికి వస్తే.. ఇందులో 1.5 లీటర్ టిజిడిఐ హైపీరియన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఒకటి. ఇది 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. 160 బీహెచ్‌పి పవర్, 255 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరొకటి 1.5 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉంటుంది. 106 బీహెచ్‌పి పవర్, 145 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. డీజిల్ వేరియంట్‌లో 1.5 లీటర్ కైరోజెట్ ఇంజిన్ ఉంది. ఇది మాన్యువల్ గేర్‌బాక్స్‌తో 118 బీహెచ్‌పి పవర్, 260 ఎన్ఎమ్ టార్క్, ఆటోమేటిక్ వేరియంట్‌లో 280 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో టాటా సియెర్రా.. క్రెటా, సెల్టోస్, డస్టర్ లాంటి ఎస్‌యూవీలతో పోటీ పడనుంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: జబర్దస్త్‌లో సుధీర్, హైపర్ ఆది కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నది అతడే..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి