Hyundai: కొత్త కారు కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. మార్కెట్‌లోకి మరో నయా కారు ఎంట్రీ

|

Apr 15, 2023 | 3:44 PM

Hyundai Exter Micro SUV: తాజాగా ఎక్స్‌టర్ పేరుతో మరో కొత్త ఎస్‌యూవీను లాంచ్ చేసింది. స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్‌తో ఈ కొత్త ఎస్‌యూవీ పని చేయనుంది. అలాగే హ్యూందాయ్ లైనప్‌లో ఇది ఎనిమిదో ఎస్‌యూవీ అని కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు.

Hyundai: కొత్త కారు కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. మార్కెట్‌లోకి మరో నయా కారు ఎంట్రీ
Hyundai Exter
Follow us on

సొంత కారు కొనుక్కోవాలని ప్రతి మధ్య తరగతి వారికి ఉంటుంది. అయితే కార్ల ధరలు అందుబాటులో లేకపోవడంతో కొంచెం వెనకడుగు వేస్తారు. ఇలాంటి వారికి కూడా అందుబాటులో ధరల్లో కార్లను అందించి మార్కెట్‌ను పెంచుకోవాలని కార్ల కంపెనీలు కొత్త మోడల్స్‌ను ప్రవేశపెడుతున్నాయి. ముఖ్యంగా టాటా, హ్యూందాయ్ వంటి కంపెనీలు వినియోగదారులను ఆకర్షించడానికి కొత్త కార్లను రిలీజ్ చేస్తున్నాయి. ఇప్పటికే టాటా కంపెనీ పంచ్ పేరుతో ఓ కార్‌ను అందుబాటులోకి తీసుకురావడంతో ఆ కార్ సేల్స్ విపరీతంగా పెరిగాయి. దీంతో హ్యూందాయ్ కంపెనీ కూడా తన ఎస్‌యూవీ లైనప్‌లో మరో కొత్త కార్‌ను చేర్చింది. ముఖ్యంగా టాటా పంచ్‌ కార్‌కు పోటీగా ఈ కొత్త కార్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. ఇప్పటికే ఈ కంపెనీ వెన్యూ, క్రెటా, అల్కాజార్, కోనా, టక్సన్ వంటి ఎస్‌యూవీలను వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. తాజాగా ఎక్స్‌టర్ పేరుతో మరో కొత్త ఎస్‌యూవీను లాంచ్ చేసింది. స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్‌తో ఈ కొత్త ఎస్‌యూవీ పని చేయనుంది. అలాగే హ్యూందాయ్ లైనప్‌లో ఇది ఎనిమిదో ఎస్‌యూవీ అని కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. అంతర్జాతీయ మార్కెట్ కాస్పర్ మైక్రో ఎస్‌యూవీ పేరుతో రిలీజ్ చేస్తున్న ఈ కార్‌ను భారత్‌లో మాత్రం ఎక్స్‌టర్ పేరుతో కంపెనీ రిలీజ్ చేస్తుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.  నివేదికల ప్రకారం ఎక్స్‌టర్ 3,595 మిమీ పొడవు , 1,595 మిమీ వెడల్పు, 1,575 మిమీ ఎత్తుతో వస్తుంది. అలాగే ఎక్స్‌టర్ హ్యుందాయ్ శాంత్రో కార్‌లా అదే కే1 ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది, అయితే దీనికి ఎస్‌యూవీ స్టాన్స్ ఇవ్వడానికి  గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం పెంచారు. 

హ్యూందాయ్ ఇంజిన్, ట్రాన్స్‌మిషన్

ఎక్స్‌టర్‌లో ఇంజిన్ హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ 1.2 లీటర్ నాలుగు సిలిండర్ ఇంజిన్‌లా వస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. లేకపోతే శాంత్రో 1.1 లీటర్ నాలుగు-సిలిండర్ యూనిట్‌లా కూడా ఉండవచ్చని పేర్కొంటున్నారు. అలాగే ఈ కారులో 5 స్పీడ్ ఎంటీ, 4 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా అయితే 1. -లీటర్ సహజంగా ఆశించిన పవర్‌ట్రైన్‌తో పాటు 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో ఈ కార్‌ను రిలీజ్ చేశారు. అలాగే దాని హోమ్ మార్కెట్లో ఈ కార్ 4 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. 

ధర ఎంతంటే?

ఈ ఏడాదిలోని ఈ కార్‌ను భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టనున్నారు. అలాగే ఈ కార్ ధర రూ. 5 లక్షల నుంచి రూ. 9 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంటుంది. భారతదేశంలో ప్రవేశపెట్టినప్పటి నుంచి అమ్మకాల్లో అగ్రస్థానంలో ఉన్న టాటా పంచ్ మైక్రో ఎస్‌యూవీ ఈ కార్ ప్రత్యక్ష ప్రత్యర్థిగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..