April Month New Rules
ప్రతి నెల ప్రారంభంలో మీ ప్రభుత్వ ఉద్యోగంలో లేదా మీ రోజువారీ జీవితంలో అవసరమైన వాటిలో చాలా మార్పులు ఉంటాయి. ఎందుకంటే ప్రభుత్వం నిబంధనలను మారుస్తూ ఉంటుంది. ఇప్పుడు మార్చి నెల ముగియడానికి ఇంకా పదిహేను రోజులు మిగిలి ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో మీరు మార్చి 31 లోపు పూర్తి చేయవలసిన అనేక ముఖ్యమైన పనులు ఉన్నాయి. ఏప్రిల్ 1, 2023 నుంచి చాలా పెద్ద మార్పులు జరగబోతున్నాయి ఏప్రిల్ 1, 2023 నుంచి పలు నిబంధనలలో మార్పులు జరుగనున్నాయి. ఆ నిబంధనలు ఏమిటో ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు ఈ పనులు చేస్తే మీరు తర్వాత ఈ మార్పుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
- బంగారం కొనుగోలుకు కొత్త నిబంధనలు: మీరు బంగారం కొనడానికి లేదా అమ్మడానికి వెళ్తున్నట్లయితే ఈ వార్త మీకు ముఖ్యమైనది. బంగారం, బంగారు ఆభరణాల కొనుగోలు, అమ్మకం నిబంధనలను కేంద్ర ప్రభుత్వం మార్చింది. 31 మార్చి 2023 తర్వాత, కొత్త హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (HUID) లేకుండా బంగారు ఆభరణాలు, ఇతర బంగారు వస్తువులను విక్రయించలేరు. కొత్త నిబంధనల ప్రకారం.. ఏప్రిల్ 1 నుంచి ఆరు అంకెల హాల్‌మార్క్‌లు మాత్రమే ఆమోదించబడతాయి. ఆరు అంకెల హాల్‌మార్క్ లేకుండా బంగారం గానీ, అభరణాలు గానీ కొనుగోలు, అమ్మకం సాధ్యం కాదు.
- నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో మార్పులు: పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ అంటే PFRDA, నేషనల్ పెన్షన్ సిస్టమ్‌కి సంబంధించిన కొత్త నిబంధన ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తుంది. ఈ నియమం ఉపసంహరణకు సంబంధించినది. డబ్బు విత్‌డ్రా చేసేటప్పుడు సభ్యులు కొన్ని డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ పత్రాలను అప్‌లోడ్ చేయకుండా NPS నుండి ఉపసంహరణ సాధ్యం కాదు. మీరు ఇప్పుడు KYC పత్రాలను అందించాలి. పత్రాలలో ఏదైనా తప్పులు ఉంటే, మీ డబ్బు నిలిపివేయబడుతుంది.
- మ్యూచువల్ ఫండ్స్‌లో మార్పులు: ఇక మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్టర్లకు కేంద్రం షాకిచ్చింది. ఇక నుంచి డెట్ ఫండ్ ఇన్వెస్టర్లకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ బెనిఫిట్స్ వర్తించవని స్పష్టం చేసింది. ఆర్థిక బిల్ 2023కి సవరణల ప్రతిపాదనలకు పార్లమెంట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. సవరణల ప్రకారం 35 శాతం కన్నా ఎక్కువ ఈక్విటీ షేర్లలో పెట్టుబడులు పెట్టని మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లాభాలను షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌గానే పరిగణిస్తారు. ఈ నిబంధన ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది.
- గ్యాస్ ధరలు: అలాగే ప్రతీ నెలా 1వ తేదీన చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చేస్తుంటుంది. వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెరగవచ్చు.. లేదా తగ్గవచ్చు. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. మార్చి 1వ తేదీన వంట గ్యాస్ సిలిండర్ ధరల్ని పెంచిన విషయం తెలిసిందే. గ్యాస్ సిలిండర్ ధరను రూ.50 మేర పెంచింది. అలాగే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.350 మేర పెరిగింది. మరి ఏప్రిల్ 1న గ్యాస్ సిలిండర్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
- కొత్త పన్ను విధానం: కేంద్ర ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కొత్త పన్ను విధానాన్ని ప్రతిపాదించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ మార్పులు ఏప్రిల్ 1, 2023 నుంచే అమలులోకి రానుంది. కొత్త పన్ను విధానం డీఫాల్ట్‌గా ఉంటుందని ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు గుర్తుంచుకోవాలి. పాత పన్ను విధానంలోనే కొనసాగాలని భావిస్తున్నవారు తప్పనిసరిగా ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.
- జీవిత బీమా పాలసీలపై.. అలాగే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ రూ.5 లక్షల కంటే ఎక్కువ వార్షిక ప్రీమియం కలిగిన జీవిత బీమా పాలసీలపై పన్ను విధించాలని ప్రతిపాదించారు. కేంద్ర బడ్జెట్ 2023ని సమర్పిస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏప్రిల్ 1న లేదా ఆ తర్వాత చేయబడిన రూ.5 లక్షల కంటే ఎక్కువ, మొత్తం రూ.5 లక్షల వరకు ప్రీమియం ఉన్న పాలసీల నుంచి వచ్చే ఆదాయం మాత్రమే మినహాయించబడుతుంది. ఇది వ్యక్తి మరణించినన తర్వాత పొందే మొత్తానికి అందించే పన్ను మినహాయింపుపై ప్రభావం చూపదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి