January New Rules: వినియోగదారులకు అలర్ట్‌.. జనవరి 1 నుంచి కొత్త రూల్స్‌.. ఏవేంటో తెలుసుకోండి!

|

Dec 19, 2022 | 2:49 PM

ప్రతి నెల కొత్త కొత్త నిబంధనలు అందుబాటులోకి వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బ్యాంకింగ్‌, గ్యాస్‌ సిలిండర్‌, ఆదాయపు పన్ను, ఇన్సూరెన్స్, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..

January New Rules: వినియోగదారులకు అలర్ట్‌.. జనవరి 1 నుంచి కొత్త రూల్స్‌.. ఏవేంటో తెలుసుకోండి!
New Rules 1st January 2023
Follow us on

ప్రతి నెల కొత్త కొత్త నిబంధనలు అందుబాటులోకి వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బ్యాంకింగ్‌, గ్యాస్‌ సిలిండర్‌, ఆదాయపు పన్ను, ఇన్సూరెన్స్, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తదితర రంగాలలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. ఇక ఈ ఏడాది డిసెంబర్‌తో ముగియబోతోంది. మరో పది రోజుల్లో జనవరి 2023 రాబోతోంది. జనవరి 1 నుంచి కొత్త రూల్స్‌ అందుబాటులోకి రానున్నాయి. వినియోగదారుల ఇలాంటి విషయాలను ముందస్తుగా తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే నిబంధనలు తెలుసుకోకపోతే ఆర్థిక నష్టాలతో పాటు సమయం వృథా అయ్యే అవకాశం ఉంది. మరి జనవరి 1 నుంచి ఎలాంటి నిబంధనలు మారనున్నాయో తెలుసుకుందాం.

జనవరి 1 నుంచి పెట్రోల్‌, డీజిల్‌ ధరలలో మార్పులు ఉండే అవకాశం ఉంది. అలాగే క్రెడిట్‌ కార్డుల విషయంలో కొత్త రూల్స్‌ వచ్చే అవకాశం ఉంది. వాహనదారులకు సంబంధించి కూడా కొత్త నిబంధనలు రానున్నాయి. వచ్చే ఏడాదిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నందున ఆదాయపు పన్ను శాఖకు సంబంధించిన విషయాల్లో మార్పులు జరగనున్నాయి.

క్రెడిట్ కాట్స్ రివార్డ్ పాయింట్లు

ఇక క్రెడిట్‌ కార్డులు వాడుతున్నవారు రివార్స్డ్‌ పాయింట్లను రిడీమ్‌ చేసుకోవడం అనేది చేస్తుంటారు. ఈ ఏడాది డిసెంబర్ లోగా వాటిని రిడీమ్ చేసుకుంటేనే మంచిది. క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్ల గురించి చాలా బ్యాంకులు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది. పాయింట్లను తగ్గించే అవకాశం ఉంది. అందుకే ముందస్తుగా పాయింట్లను రిడీమ్‌ చేసుకోవడం ముఖ్యం.

ఇవి కూడా చదవండి

ఇన్సూరెన్స్‌ ప్రీమియం

జనవరి 2023 నుంచి ఇన్సూరెన్స్‌ ప్రీమియం కూడా మరింత ప్రీయం కానుంది. ఇన్సూరెన్స్‌ ప్రీయం పెంచేందుకు ఐఆర్‌డీఏఐ పరిశీలిస్తోంది. ఇది కనుకు జరిగితే జనవరి 1 నుంచి ఇన్సూరెన్స్‌ ప్రీమియం మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇక రూ.5 కోట్ల కంటే ఎక్కువ విలువైన వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారు తప్పకుండా ఈ-ఇన్‌వాయిసింగ్‌ తప్పకుండా జనరేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 1 నుంచి ఇది తప్పనిసరి చేసే అవకాశం ఉంది.

వాహనాల నంబర్‌ ప్లేట్‌కు హైసెక్యూరిటీ

ఇక వాహనాలకు సంబంధించిన హైసెక్యూరిటీ నంబర్‌ ప్లేటు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ ప్లేట్‌ ఏర్పాటు చేసుకోకుంటే ఈ పని త్వరగా చేసుకోండి. లేకపోతే ఇబ్బందులు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. హైసెక్యూరిటీ నంబర్‌ ప్లేట్‌ లేకుంటే గరిష్టంగా రూ.5వేల వరకు జరిమానా చెల్లించుకోవాల్సి ఉంటుంది.

సీఎన్‌జీ గ్యాస్‌ ధరలు:

సాధారణంగా ప్రతినెల తొలివారంలో సీఎన్‌జీ, పీఎన్‌జీ వంటి ధరలను సవరిస్తుంటాయి కంపెనీలు. 2022 నవంబర్ నెలలో కమర్షియల్ సిలిండర్ల ధరలు తగ్గాయి. డిసెంబర్‌లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఇప్పుడు జనవరిలో ధరలు పెరగడమో లేదా తగ్గడమో జరుగుతుంటుంది. ఢిల్లీ, ముంబై వంటి ప్రాంతాల్లో ఈ ధరలు పెరిగాయి.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి