Aadhaar Verification: కొత్త ఆధార్ పొందడానికి నయా రూల్.. ఇకపై వారు ధ్రువీకరిస్తేనే ఆధార్
ఏదైనా కారణాల వల్ల 18 ఏళ్లు నిండిన వారికి ఆధార్ లేకపోతే కొత్త ఆధార్ పొందడానికి అవకాశం లేదు. అయితే తాజాగా 18 ఏళ్లు పైబడిన వారు, తొలిసారిగా ఆధార్‌ను పొందాలనుకునే వారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ సమ్మతితో భౌతిక ధ్రువీకరణకు లోబడి ఉంటారని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ప్రకటించింది. 18 సంవత్సరాల తర్వాత వారి మొదటిసారి ఆధార్‌ను కోరుకునే వారి కోసం పాస్‌పోర్ట్ లాంటి ధ్రువీకరణ వ్యవస్థ అమలులో ఉంటుందని తెలిపారు.

ఆధార్ అనేది యూఐడీఏఐ అందించే ప్రత్యేక గుర్తింపు సంఖ్య. ప్రభుత్వ పథకాలను పొందడంలో ఆధార్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే మొదట్లో ఆధార్‌ను ప్రభుత్వం ప్రత్యేక క్యాంపుల ద్వారా అందించింది. అనంతరం అందరికీ ఆధార్ వచ్చిందనే భావనతో ఇప్పుడు కొత్త ఆధార్ కేవలం పుట్టిన పిల్లలకే అందిస్తున్నారు. అయితే ఏదైనా కారణాల వల్ల 18 ఏళ్లు నిండిన వారికి ఆధార్ లేకపోతే కొత్త ఆధార్ పొందడానికి అవకాశం లేదు. అయితే తాజాగా 18 ఏళ్లు పైబడిన వారు, తొలిసారిగా ఆధార్‌ను పొందాలనుకునే వారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ సమ్మతితో భౌతిక ధ్రువీకరణకు లోబడి ఉంటారని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ప్రకటించింది. 18 సంవత్సరాల తర్వాత వారి మొదటిసారి ఆధార్‌ను కోరుకునే వారి కోసం పాస్‌పోర్ట్ లాంటి ధ్రువీకరణ వ్యవస్థ అమలులో ఉంటుందని తెలిపారు. యూఐడీఏఐ తీసుకొచ్చిన నయా రూల్ ఏంటో? ఓ సారి తెలుసుకుందాం.
కొత్త రూల్స్ ప్రకారం ఇకపై ఆధార్ పొందాలంటే రాష్ట్ర ప్రభుత్వం జిల్లా, సబ్-డివిజనల్ స్థాయిలలో నోడల్ అధికారులను, అదనపు జిల్లా మేజిస్ట్రేట్లను నియమించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆధార్ నమోదు చేసే సదుపాయం ఎంపిక చేసిన కేంద్రాల్లో అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా ప్రతి జిల్లా ప్రధాన పోస్టాఫీసుతో పాటు గుర్తించిన ఇతర ఆధార్ కేంద్రాలు ఉన్నాయి. ఈ వర్గంలోని వ్యక్తుల నుంచి అన్ని ఆధార్ అభ్యర్థనలు డేటా నాణ్యత తనిఖీల ద్వారా వెళ్లి ఆపై సేవా పోర్టల్ ద్వారా ధ్రువీకరణ కోసం మళ్లిస్తారు. సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్‌లు సర్వీస్ పోర్టల్‌లో స్వీకరించిన అన్ని అభ్యర్థనల ధ్రువీకరణను నిర్ధారిస్తారు. అలాగే క్లియరెన్స్ పొందిన 180 రోజులలోపు ఆధార్ నెంబర్ వస్తుంది
ఆధార్ కొత్త ఆదేశాలు 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారి ఆధార్‌ను మొదటిసారిగా పొందుతున్న వారికి మాత్రమే వర్తిస్తాయని తెలిపారు. అయితే వారు ఆధార్ పొందిన తర్వాత వారు కూడా సాధారణ ప్రక్రియల ద్వారా దానిని నవీకరించవచ్చని పేర్కొన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..