New Recharge Plans: తక్కువ ధర.. అదిరిపోయే ప్రయోజనాలు.. పోటాపోటీగా ప్లాన్లు ప్రకటించిన ఎయిర్ టెల్, జియో, వోడాఫోన్ ఐడియా..
దేశీయ టెలికాం దిగ్గజాలైన ఎయిర్ టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా ఒకేసారి భారీ ఆఫర్లతో కూడిన టాప్ ప్లాన్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. ఈ ప్లాన్లలో అనేక బెనిఫిట్స్ అందిస్తున్నాయి. హై-స్పీడ్ ఇంటర్నెట్, అన్‌లిమిటెడ్ కాలింగ్ వంటి మరిన్ని బెనిఫిట్స్ ఉంటాయి.

టెలికాం కంపెనీల మధ్య పోటీ వాతావరణం నెలకొంది. దీంతో అన్ని కంపెనీలు వినియోగదారులకు ఆకర్షించేందుకు కొత్త రీచార్జ్ ప్లాన్లను తీసుకొస్తున్నాయి. ఉన్న యూజర్లను బయటకు వెళ్ల నివ్వకుండా.. కొత్త యూజర్లను ఆకర్షించేలా తక్కువ ధరలో అత్యుత్తమ ప్లాన్లను తీసుకొస్తున్నాయి. ఇదే క్రమంలో దేశీయ టెలికాం దిగ్గజాలైన ఎయిర్ టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా ఒకేసారి భారీ ఆఫర్లతో కూడిన టాప్ ప్లాన్లను మార్కెట్లో విడుదల చేశాయి. ఈ ప్లాన్లలో అనేక బెనిఫిట్స్ అందిస్తున్నాయి. హై-స్పీడ్ ఇంటర్నెట్, అన్‌లిమిటెడ్ కాలింగ్ వంటి మరిన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఎయిర్ టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా అందిస్తున్న ఈ కొత్త ప్లాన్ల గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఎయిర్‌టెల్ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్..
రూ. 599తో వచ్చే ఈ పోస్ట్ పెయిడ్ ప్లాన్ లో ఉచితంగా యాడ్-ఆన్ ప్లాన్ పొందవచ్చు. మొత్తం 75జీబీ + 30జీబీ మొత్తం డేటా పొందవచ్చు. ఈ ప్లాన్ 200జీబీ వరకు డేటా అనుమతిస్తుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంస్ మాత్రమే కాదు.. ఈ ప్లాన్ 6 నెలల అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్, ఒక ఏడాది డిస్నీ+హాట్‌స్టార్ మొబైల్ సర్వీసును అందిస్తుంది.
జియో కొత్త క్రికెట్ ప్లాన్‌లు ఇవే..
రూ. 219 ప్రీపెయిడ్ ప్లాన్: ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్, 3జీబీ రోజువారీ డేటా క్యాప్, 14 రోజుల పాటు యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ ఉన్నాయి. అదనంగా, జియో యూజర్లు రూ. 25 విలువైన 2జీబీ డేటా-యాడ్-ఆన్ వోచర్‌ను ఉచితంగా పొందవచ్చు. జియో వెల్‌కమ్ 5జీ ఆఫర్‌కు అర్హులైన వారు ఉచిత 5జీ డేటాను కూడా పొందవచ్చు.



రూ. 399 ప్రీపెయిడ్ ప్లాన్: ఈ ప్లాన్ ద్వారా యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్, 28 రోజుల పాటు 3జీబీ రోజువారీ డేటాను పొందవచ్చు. అంతేకాకుండా, యూజర్లు జియో యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. రూ. 61 విలువైన 6జీబీ డేటా యాడ్-ఆన్ వోచర్‌ను ఉచితంగా పొందవచ్చు.
రూ. 999 ప్రీపెయిడ్ ప్లాన్: ఈ లాంగ్ టైమ్ వ్యాలిడిటీ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్, 84 రోజుల పాటు 3జీబీ రోజువారీ డేటా అందిస్తుంది. అదనంగా, వినియోగదారులు జియో యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. 5జీకి యాక్సెస్‌ను కలిగి ఉంటే.. లిమిటెడ్ పీరియడ్ వరకు ఉచితంగా రూ.241 విలువైన 40జీబీ అదనపు డేటాను పొందవచ్చు.
వోడాఫోన్ ఐడియా(Vi) ఆఫర్లు ఇవే..
రూ. 289 ప్రీపెయిడ్ ప్లాన్: తక్కువ ధరతో ఎక్కువ కాలం పాటు అన్‌లిమిటెడ్ ప్లాన్‌ని పొందవచ్చు. ఈ ప్లాన్ రోజువారీ లిమిట్స్ లేకుండా మొత్తం 4జీబీ డేటాను 48 రోజుల వ్యాలిడిటీతో అందిస్తుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు మొత్తం 600 ఎస్ఎంఎస్ లు ప్లాన్‌లో పొందవచ్చు.
రూ. 429 ప్రీపెయిడ్ ప్లాన్: ఈ ప్లాన్‌లో 78 రోజుల వ్యాలిడిటీతో వినియోగదారులు అన్‌లిమిటెడ్ కాలింగ్, 1000 ఎస్ఎంఎస్ లను పొందవచ్చు. రోజూవారీ లిమిట్ లేకుండా 6GB డేటాను కూడా పొందవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




