AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank FD: ఎఫ్‌డీ పై ఏకంగా 9.15శాతం వడ్డీ.. మహిళలు, సీనియర్ సిటిజెన్స్‌కు మరిన్ని అదనపు ప్రయోజనాలు.. పూర్తి వివరాలు..

సంస్థ గోల్డెన్ జూబిలీ సెలబ్రేషన్స్ లో భాగంగా జూబిలీ డిపాజిట్(శ్రీరామ్ ఉన్నతి డిపాజిట్స్) ఎఫ్ డీ స్కీమ్ ను ప్రారంభించింది. దీనిలో ఏకంగా 9.15 శాతం వరకూ వడ్డీ అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇది 2023 ఏప్రిల్ ఐదో తేదీ నుంచి ప్రారంభమైంది.

Bank FD: ఎఫ్‌డీ పై ఏకంగా 9.15శాతం వడ్డీ.. మహిళలు, సీనియర్ సిటిజెన్స్‌కు మరిన్ని అదనపు ప్రయోజనాలు.. పూర్తి వివరాలు..
Fixed Deposit
Madhu
|

Updated on: Apr 06, 2023 | 6:00 PM

Share

ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డీ).. సురక్షిత పెట్టుబడి పథకం. దీనిపై ప్రజలకు అపారమైన నమ్మకం. అధిక వడ్డీతో పాటు మొత్తం నగదుకు భద్రత ఉంటుండటంతో అందరూ దీనిని వినియోగించుకుంటున్నారు. ఇటీవల అన్ని బ్యాంకులు ఈ ఎఫ్డీ వడ్డీ రేట్లను పెంచాయి. దేశంలోని అతి పెద్ద ఎన్బీఎఫ్సీ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ బుధవారం మరో స్పెషల్ ఫిక్స్ డ్ డిపాజిట్ రేటును ప్రకటించింది. కంపెనీ గోల్డెన్ జూబిలీ సెలబ్రేషన్స్ లో భాగంగా జూబిలీ డిపాజిట్(శ్రీరామ్ ఉన్నతి డిపాజిట్స్) ఎఫ్ డీ స్కీమ్ ను ప్రారంభించింది. దీనిలో ఏకంగా 9.15 శాతం వరకూ వడ్డీ అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇది 2023 ఏప్రిల్ ఐదో తేదీ నుంచి ప్రారంభమైంది. కొత్త ఖతాదారులతో పాటు పాత వాటిని రెన్యూవల్స్ కి కూడా ఈ కొత్త వడ్డీ రేటు అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఎందుకు ఎఫ్ డీ రేట్లు పెరిగాయంటే.

దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్భణాన్ని అదుపు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తరచుగా రెపో రెటో ను పెంచుతోంది. 2022 నుంచి మే నుంచి ఆరు సార్లుగా మొత్తం 250 బేస్ పాయింట్లను పెంచింది. ఈ ఫిబ్రవరీలో మరో సారి 25 బేస్ పాయింట్లను పెంచి రెపో రేటును 6.5శాతానికి తీసుకెళ్లింది. ఈ ప్రభావం బ్యాంకర్లపై పడింది. ఫలితంగా రుణాల వడ్డీ రేట్లను బ్యాంకర్లు గణనీయంగా పెంచారు. మరో వైపు ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును కూడా పెంచారు. దీంతో ఖాతాదారులకు ఉపశమనం లభించింది.

ఇది కొత్త స్కీమ్..

శ్రీరామ్ ఉన్నతి డిపాజిట్స్ కింద ప్రారంభించిన ఈ ఎఫ్ డీ స్కీమ్ లో ఖాతాదారులకు 9.15శాతం వడ్డీ వస్తుంది. 50 నెలల టెన్యూర్ తో ప్రారంభమయ్యే ఈ స్కీమ్ లో ప్రస్తుతం ఉన్న వడ్డీకి అదనంగా మహిళలు 0.10 శాతం, సీనియర్ సిటిజెన్స్ 0.50 శాతం , సీనియర్ సిటిజెన్ మహిళలు 0.60 శాతం వార్షిక వడ్డీని పొందుతారు. ఈ ఖాతా తెరవాలంటే ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లలో ప్రారంభించవచ్చు.

ఇవి కూడా చదవండి

మిగిలిన బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఇలా..

  • హెచ్‌డీ ఎఫ్‌సీ బ్యాంక్ ఎఫ్ డీ ఖాతాలపై 7.1 శాతం వడ్డీ అందిస్తోంది. అదే సీనియర్ సిటిజెన్స్ కి అయితే 7.6శాతం వరకూ అందిస్తోంది.
  • పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో సాధారణ పౌరులకు 7.25శాతం, సీనియర్ సిటిజెన్స్కు 7.75శాతం వడ్డీ అందిస్తోంది.
  • ఐసీఐసీఐ బ్యాంకులో సాధారణ ప్రజలకు 7.1శాతం, సీనియర్ సిటిజెన్స కు 7.6శాతం వార్షిక వడ్డీని అందిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కుల్దీప్‌పై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. ఢిల్లీలో కలకలం
కుల్దీప్‌పై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. ఢిల్లీలో కలకలం
ఇనాక్టివ్ బ్యాంక్ అకౌంట్లోని బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.. ఈ ఒక్క
ఇనాక్టివ్ బ్యాంక్ అకౌంట్లోని బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.. ఈ ఒక్క
ఏపీకి తరగని ఆస్తి.. 1.90 లక్షల కోట్ల పెట్టుబడులు, 1.52 లక్షల జాబ్
ఏపీకి తరగని ఆస్తి.. 1.90 లక్షల కోట్ల పెట్టుబడులు, 1.52 లక్షల జాబ్
నాన్న మరణం.. గుండెలు పగిలేలా కన్నీళ్లు పెట్టుకున్న హీరో జీవ..
నాన్న మరణం.. గుండెలు పగిలేలా కన్నీళ్లు పెట్టుకున్న హీరో జీవ..
అమ్మో! ఈ జన్మలో ఇంకోసారి బిగ్‌బాస్ షోకు వెళ్లను: స్టార్ యాంకర్
అమ్మో! ఈ జన్మలో ఇంకోసారి బిగ్‌బాస్ షోకు వెళ్లను: స్టార్ యాంకర్
షాపులో చీరలు కొట్టేసి..మళ్ళీ షాప్‌కే పార్సిల్ పంపిన కిలాడీ లేడీస్
షాపులో చీరలు కొట్టేసి..మళ్ళీ షాప్‌కే పార్సిల్ పంపిన కిలాడీ లేడీస్
పెళ్లి అయినా మారని అలవాటు.. ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిల్లో ఇదే..
పెళ్లి అయినా మారని అలవాటు.. ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిల్లో ఇదే..
కోలీవుడ్ సమ్మె.. టాలీవుడ్‌లో వస్తే పరిస్థితేంటి..?
కోలీవుడ్ సమ్మె.. టాలీవుడ్‌లో వస్తే పరిస్థితేంటి..?
MIలో కలకలం! హార్దిక్ పాండ్యా కెప్టెన్సీకి గుడ్‌బై?
MIలో కలకలం! హార్దిక్ పాండ్యా కెప్టెన్సీకి గుడ్‌బై?
ఎన్టీఆర్ తర్వాత ఆ హీరోనే..
ఎన్టీఆర్ తర్వాత ఆ హీరోనే..