AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్త కార్మిక చట్టం.. ఈ మార్పులు గమనించారా? మీ జీతం తగ్గే ఛాన్స్‌!

ఏప్రిల్ 1 నుండి కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఇవి ఉద్యోగుల జీతాల నిర్మాణాన్ని గణనీయంగా మార్చాయి. 50 శాతం బేసిక్ రూల్ కారణంగా టేక్-హోమ్ జీతం తగ్గుతుంది, కానీ PF కోతలు పెరుగుతాయి. ఇది దీర్ఘకాలికంగా పదవీ విరమణ భద్రతను, గ్రాట్యుటీని బలపరుస్తుంది.

కొత్త కార్మిక చట్టం.. ఈ మార్పులు గమనించారా? మీ జీతం తగ్గే ఛాన్స్‌!
New Labor Laws
SN Pasha
|

Updated on: Apr 18, 2026 | 4:59 AM

Share

ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త కార్మిక చట్టాలు దేశవ్యాప్తంగా ఉద్యోగుల జీతాల నిర్మాణంలో కీలక మార్పులను తీసుకొచ్చాయి. ఈ మార్పుల వెనుక ప్రధాన ఉద్దేశ్యం ఉద్యోగుల పదవీ విరమణానంతర భద్రతను బలపరచడం. అయితే తక్షణ ప్రభావంగా చాలామంది ఉద్యోగుల టేక్-హోమ్ జీతం కొంత తగ్గే పరిస్థితి ఏర్పడింది. ఈ కొత్త నియమాల్లో ముఖ్యమైనది 50 శాతం బేసిక్ రూల్. దీని ప్రకారం ఉద్యోగి మొత్తం CTCలో కనీసం 50 శాతం భాగం మూల వేతనం (బేసిక్ సాలరీ)గా ఉండాలి. గతంలో కంపెనీలు HRA, ప్రత్యేక భత్యాలు వంటి వాటిని ఎక్కువగా చూపిస్తూ, బేసిక్‌ను తక్కువగా ఉంచేవి. దీంతో PF కోతలు తగ్గేవి, చేతికి వచ్చే జీతం ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ విధానం మారింది.

ఉదాహరణకు వార్షికంగా రూ.6 లక్షల జీతం పొందుతున్న ఉద్యోగిని తీసుకుంటే, పాత విధానంలో నెలకు రూ.20,000 బేసిక్, రూ.10,000 HRA ఉండేది. ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం బేసిక్ రూ.25,000కి, HRA రూ.12,500కి పెరుగుతుంది. దీనివల్ల ప్రత్యేక భత్యాలు తగ్గుతాయి. బేసిక్ పెరగడంతో EPFO కింద PF కోతలు కూడా పెరుగుతాయి. ఉదాహరణకు ముందుగా రూ.2,400గా ఉన్న PF కాంట్రిబ్యూషన్ ఇప్పుడు రూ.3,000కు పెరుగుతుంది. దీంతో నెలవారీ టేక్-హోమ్ సాలరీ సుమారు రూ.600 వరకు తగ్గుతుంది. అంటే రూ.45,000గా ఉన్న జీతం ఇప్పుడు సుమారు రూ.44,400కు చేరవచ్చు.

మొదటి చూపులో ఇది నష్టంలా అనిపించినప్పటికీ, దీని వెనుక దీర్ఘకాల ప్రయోజనం ఉంది. పెరిగిన PF కాంట్రిబ్యూషన్ మీ రిటైర్మెంట్ ఫండ్‌ను బలోపేతం చేస్తుంది. అదనంగా గ్రాట్యుటీ వంటి ప్రయోజనాలు కూడా బేసిక్ సాలరీపై ఆధారపడటంతో, భవిష్యత్తులో ఎక్కువ లాభం పొందే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు తమ ఆర్థిక ప్రణాళికను తిరిగి పరిశీలించుకోవాలి. ముఖ్యంగా పన్ను సేవింగ్స్‌పై దృష్టి పెట్టాలి. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ యాక్ట్‌ 1961 సెక్షన్‌ 80C, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ యాక్ట్‌ 1961 సెక్షన్‌ 80D కింద అందుబాటులో ఉన్న పెట్టుబడి అవకాశాలను ఉపయోగించుకోవడం ద్వారా పన్ను భారం తగ్గించుకోవచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
శుక్రుడి మహా ప్రభావం.. ఈ 4 రాశుల వారికి డబ్బు, పదోన్నతి, అదృష్టం
శుక్రుడి మహా ప్రభావం.. ఈ 4 రాశుల వారికి డబ్బు, పదోన్నతి, అదృష్టం
మంగళవారం.. ఈ ఒక్క పరిహారం చేస్తే హనుమంతుడి అనుగ్రహం, కుజ దోషాలు..
మంగళవారం.. ఈ ఒక్క పరిహారం చేస్తే హనుమంతుడి అనుగ్రహం, కుజ దోషాలు..
జూన్ 9 రాశిఫలాలు:వారికి ఆర్థిక లాభాలు, అన్ని ప్రయత్నాల్లో సక్సెస్
జూన్ 9 రాశిఫలాలు:వారికి ఆర్థిక లాభాలు, అన్ని ప్రయత్నాల్లో సక్సెస్
ఉదయాన్నే కీళ్లు బిగుసుకుపోతున్నాయా? ఆర్థరైటిస్ సహా ఈ ప్రమాదకర..
ఉదయాన్నే కీళ్లు బిగుసుకుపోతున్నాయా? ఆర్థరైటిస్ సహా ఈ ప్రమాదకర..
ఎండిన తులసిని పారేయొద్దు.. ఇలా చేస్తే ఇంటికి శుభం, ఐశ్వర్యం ..
ఎండిన తులసిని పారేయొద్దు.. ఇలా చేస్తే ఇంటికి శుభం, ఐశ్వర్యం ..
ఇంట్లో పిల్లిని పెంచుకుంటే అదృష్టమా? దురదృష్టమా? వాస్తు శాస్త్రం
ఇంట్లో పిల్లిని పెంచుకుంటే అదృష్టమా? దురదృష్టమా? వాస్తు శాస్త్రం
కోట్ల విలువైన వాచీలు, చెయిన్లు.. ఫ్యాషన్ క్రికెటర్‌‌
కోట్ల విలువైన వాచీలు, చెయిన్లు.. ఫ్యాషన్ క్రికెటర్‌‌
లక్ష్మీ కటాక్షం.. పాపాలు తొలగించి ఐశ్వర్యాన్ని ప్రసాదించే రమా..
లక్ష్మీ కటాక్షం.. పాపాలు తొలగించి ఐశ్వర్యాన్ని ప్రసాదించే రమా..
అన్నం–ఐస్‌క్రీమ్ కాంబో నా ఫేవరెట్‌.. స్టార్‌‌ హీరోయిన్‌
అన్నం–ఐస్‌క్రీమ్ కాంబో నా ఫేవరెట్‌.. స్టార్‌‌ హీరోయిన్‌
ప్రశాంతమైన నిద్రకు టెక్నిక్ కనిపెట్టిన చిన్నారి
ప్రశాంతమైన నిద్రకు టెక్నిక్ కనిపెట్టిన చిన్నారి