Tata Harrier EV: టాటా మోటర్స్‌ నుంచి నయా ఈవీ.. హారియర్‌ రిలీజ్‌తో ప్రత్యర్థులకు చాలెంజ్‌..

|

Jul 05, 2023 | 6:00 PM

చార్జింగ్‌ సమస్యతో లాంగ్‌ రైడ్స్‌ వెళ్లలేమనే భయంతో చాలా మంది కార్లల్లో ఈవీ వాహనాలను కొనుగోలు చేయడానికి భయపడుతున్నారు. అయితే ఈ భయాలను తరిమేస్తూ కంపెనీలు హైఎండ్‌ మైలేజ్‌ సరికొత్త ఈవీ కార్లను మార్కెట్‌లో రిలీజ్‌ చేస్తున్నాయి. తాజాగా భారతదేశంలో ప్రముఖ​ కంపెనీ అయిన టాటా మోటర్స్‌ త్వరలోనే నయా ఈవీ వెర్షన్‌ కారుతో మార్కెట్‌లోకి వస్తున్నట్లు ప్రకటించింది. హారియర్‌ పేరుతో వస్తున్న ఈ నయా ఈవీను భారతీయ ఆటోమొబైల్ తయారీదారు రాబోయే ఆల్-ఎలక్ట్రిక్ ఫుల్-సైజ్ ఎస్‌యూవీ చిత్రాన్ని ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పంచుకున్నారు.

Tata Harrier EV: టాటా మోటర్స్‌ నుంచి నయా ఈవీ.. హారియర్‌ రిలీజ్‌తో ప్రత్యర్థులకు చాలెంజ్‌..
Harrier Ev
Follow us on

ప్రపంచవ్యాప్తంగా ఈవీ వాహనాల ట్రెండ్‌ నడుస్తుంది. టాప్‌ కంపెనీల నుంచి స్టార్టప్‌ కంపెనీల వరకూ తమ వాహనాల్లో ఈవీ వెర్షన్లను ఎప్పటికప్పుడు రిలీజ్‌ చేస్తున్నాయి. అమెరికా, చైనా తర్వాత భారతదేశంలోనే అత్యధికంగా ఈవీ వాహనాలు అమ్ముడవుతున్నాయి. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా అన్ని కంపెనీలు ఈవీ వెర్షన్ల రిలీజ్‌లో నిమగ్నమయ్యాయి. టూ వీలర్స్‌తో పోల్చుకుంటే ఫోర్‌ వీలర్స్‌ అయిన కార్లల్లో ఈవీ వాహనాల రిలీజ్‌ పెద్దగా ఉండడం లేదు. చార్జింగ్‌ సమస్యతో లాంగ్‌ రైడ్స్‌ వెళ్లలేమనే భయంతో చాలా మంది కార్లల్లో ఈవీ వాహనాలను కొనుగోలు చేయడానికి భయపడుతున్నారు. అయితే ఈ భయాలను తరిమేస్తూ కంపెనీలు హైఎండ్‌ మైలేజ్‌ సరికొత్త ఈవీ కార్లను మార్కెట్‌లో రిలీజ్‌ చేస్తున్నాయి. తాజాగా భారతదేశంలో ప్రముఖ​ కంపెనీ అయిన టాటా మోటర్స్‌ త్వరలోనే నయా ఈవీ వెర్షన్‌ కారుతో మార్కెట్‌లోకి వస్తున్నట్లు ప్రకటించింది. హారియర్‌ పేరుతో వస్తున్న ఈ నయా ఈవీను భారతీయ ఆటోమొబైల్ తయారీదారు రాబోయే ఆల్-ఎలక్ట్రిక్ ఫుల్-సైజ్ ఎస్‌యూవీ చిత్రాన్ని ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పంచుకున్నారు. టాటా మోటార్స్ ఇంతకుముందు 2023 ఆటో ఎక్స్‌పోలో హారియర్ ఈవీని ప్రదర్శించింది. ఈ టీజర్‌లో కార్‌కు సంబంధించిన అనేక ఫీచర్లను తెలిపింది. టాటా హారియర్‌ మరిన్ని వివరాలపై ఓ లుక్కేద్దాం.

టాటా హారియర్‌ కారును కంపెనీ ఆటో ఎక్స్‌పో-2023లో ప్రవేశపెట్టింది. అయితే తాజా టీజర్ ఈవీ ఎస్‌యూవీ ప్రీమియం కాంస్య, తెలుపు డ్యూయల్-టోన్ పెయింట్‌ను చూపుతుంది. డిజైన్‌ను మరింత ప్రత్యేకంగా నిలబెట్టడానికి, కార్‌మేకర్ వాహనం, అనేక భాగాలలో పూర్తిగా నలుపు రంగులను ఉపయోగించారు. టాటా మోటార్స్ ఈవీ ఫ్రంట్ ఫాసియాను అప్‌డేట్ చేసింది. ఇది ఐసీఈ వెర్షన్ నుంచి విలక్షణమైనది. తయారీదారు భాగస్వామ్యం చేసిన చిత్రం ప్రకారం హారియర్ ఈవీ ఫ్రంట్ గ్రిల్ పైన కనెక్ట్ అయ్యే ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌ స్ట్రిప్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. 

టాటా హారియర్ ఫీచర్లు ఇవే

ఆటో ఎక్స్‌పోలో టాటా మోటర్స్‌ హారియర్ ఈవీ డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్లు, ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో వస్తుందని ధ్రువీకరించింది. కంపెనీ అధికారికంగా ఎలాంటి బ్యాటరీ, పనితీరు గణాంకాలను ధ్రువీకరించకపోయినా హారియర్ ఈవీ ప్రతి ఛార్జ్‌కు 400-500కిమీల పరిధిని అందిస్తుందని ఆటోమొబైల్‌ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. హారియర్ ఈవీ వెహికల్-టు-లోడ్, వెహికల్-టు-వెహికల్ వంటి వివిధ ఛార్జింగ్ ఎంపికలను అందిస్తుందని పేర్కొంటున్నారు. టాటా మోటార్స్ హారియర్ ఈవీ లాంచ్‌పై అధికారికంగా ఎలాంటి వివరాలు చెప్పలేదు. అయితే ఈ నయా ఈవీ 2024లో ప్రారంభమవుతుందని పేర్కొంటున్నారు. బుకింగ్‌లు, లాంచ్‌ అదే ఏడాది ఉంటుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..