
రెనాల్డ్ గ్రూప్‌లో భాగమైన డాసియా ఇటీవల తన ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ కారు స్ప్రింగ్‌కు సంబంధించిన తాజా వెర్షన్‌ను లాంచ్ చేసింది. స్ప్రింగ్ మొదటిసారిగా 2021లో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి కంపెనీ 1.4 లక్షల యూనిట్లను ప్రపంచవ్యాప్తంగా విక్రయించగలిగింది. ఇప్పుడు కంపెనీ స్ప్రింగ్ ఈవీకు సంబంధించిన తాజా వెర్షన్‌ను లాంచ్ చేసింది. కంపెనీ సిగ్నేచర్ ఎస్‌యూవీ డస్టర్ ప్రేరణగా ఈ నయా కారు వినియోగదారుల ముందుకు వచ్చింది. టాటా టియోగో ఈవీ, ఎంజీ కామెట్ ఈవీ కార్లకు పోటీగా రెనాల్డ్ ఈ ఎంట్రీ లెవల్ ఈవీను భారత మార్కెట్లో పరిచయం చేసింది. అయితే ఈ కారును క్విడ్ ఈవీగా భారత మార్కెట్లో పరిచయం చేసే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే కంపెనీ అధికారిక ప్రకటన వచ్చే ఈ అంశంపై ఓ అవగాహనకు రాలేమని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో డాసియా స్ప్రింగ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
డాసియా ఆల్-ఎలక్ట్రిక్ మోడలైన న్యూ డాసియా స్ప్రింగ్‌కు సంబంధించిన అప్‌డేటెడ్ ఫీచర్లను వెల్లడించిన కొత్త మోడల్ సరికొత్త డస్టర్ జనరేషన్ స్ఫూర్తితో రీడిజైన్ చేసిన ఎక్స్‌టీరియర్‌తో వస్తుంది. క్లీన్ లైన్లు, విలక్షణమైన వై-ఆకారపు లైట్ సిగ్నేచర్‌తో వినియోగదారలను అమితంగా ఆకట్టుకుంటుంది. అలాగే ఇంటీరియర్‌లో డ్యాష్ బోర్డ్‌లో కొన్ని మార్పులు చేసింది. ఈ కారు అన్ని వెర్షన్లలో 7 అంగుళాల డిజిటల్ డిస్ప్లే, నిర్దిష్ట మోడళ్లలో 10 అంగుళాల పెద్ద మల్టీమీడియా స్క్రీన్ని పొందుపరిచారు.
న్యూ స్ప్రింగ్ ప్రాక్టికాలిటీపై దృష్టి పెడుతుంది. 308 లీటర్ల నిల్వతో వస్తుంది. 35 లీటర్ల ఫ్రంక్, 3డీ-ప్రింటింగ్ టెక్నాలజీతో రూపొందించిన కప్ హెల్డర్ వంటి అదనపు నిల్వ ఎంపికలు అందుబాటులో ఉన్న స్థలాన్ని ఆప్టిమైజ్ చేయడానికి దోహదం చేస్తాయి.
సాంకేతిక అప్‌డేట్‌లో భాగంగా అనుకూలీకరించదగిన డిజిటల్ డాష్ బోర్డ్, మీడియా కంట్రోల్ సిస్టమ్, స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్ కోసం మీడియా లైవ్ సిస్టమ్ ఉన్నాయి. ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్-కీపింగ్ అసిస్ట్ వంటి ఫీచర్లను కవర్ చేస్తూ యూరోపియన్ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్) జోడిస్తుంది.
న్యూ స్ప్రింగ్ 26.8 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ 65 బీహెచ్‌పీని ఉత్పత్తి చేస్తుంది. అలాగే డబ్ల్యూఎల్‌టీపీ క్లెయిమ్ చేసిన 220 కిమీ పరిధిని అందిస్తుంది. ఇది 14 సెకన్లలోపు 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకుంటుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు.
న్యూ డాసియా స్ప్రింగ్ ప్రామాణిక 7 కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్‌తో వస్తుంది. దేశీయ అవుట్‌లెట్‌లో 11 గంటల కంటే తక్కువ వ్యవధిలో 20 శాతం నుంచి 100 శాతం వరకు పూర్తి ఛార్జ్‌ను అనుమతిస్తుంది. ఒక ఐచ్ఛిక 30 కేడబ్ల్యూ డీసీ ఛార్జర్ 45 నిమిషాల్లో 20 శాతం నుంచి 80 శాతానికి వేగంగా ఛార్జింగ్‌ను అందిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…