Bajaj Chetak EV: ముహూర్తం ఫిక్స్.. బజాజ్ చేతక్ నుంచి కొత్త ఈవీ వచ్చేస్తోంది.. పూర్తి వివరాలు

. కొత్త సంవత్సరంలో ఓ కొత్త ఉత్పత్తితో ప్రారంభించనుంది. ఇప్పటికే ఉన్న చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అప్ డేటెడ్ వెర్షన్ అందుబాటులోకి రానుంది. 2024 జనవరి తొమ్మిదో తేదీన ఇది మార్కెట్లోకి రానుంది. మెకానికల్ గా అలాగే డిజైన్ పరంగా కూడా కొన్నిమార్పులు చేసి అందుబాటులోకి తీసుకురానుందని చెబుతున్నారు. గతేడాది డిసెంబర్లోనే చేతక్ అర్బేన్ వేరియంట్ ను మార్కెట్లోకి లాంచ్ చేసింది.

Bajaj Chetak EV: ముహూర్తం ఫిక్స్.. బజాజ్ చేతక్ నుంచి కొత్త ఈవీ వచ్చేస్తోంది.. పూర్తి వివరాలు
Bajaj Chetak Ev
Follow us
Madhu

| Edited By: Janardhan Veluru

Updated on: Jan 04, 2024 | 2:47 PM

ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు తమదైన ముద్ర వేస్తున్నాయి. ఏటేటా డిమాండ్ పెరుగుతుండటతో సంప్రదాయ ఐసీఈ ఇంజిన్ వాహనాలతో సమానంగా అమ్మాకాలు చేయగలుతున్నాయి. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ టూ వీలర్లతో పాటు కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ప్రధానంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. కంపెనీలు కూడా కొత్త ఉత్పత్తులను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో బజాజ్ ఆటో కూడా మరో కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్ ను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కొత్త సంవత్సరంలో ఓ కొత్త ఉత్పత్తితో ప్రారంభించనుంది. ఇప్పటికే ఉన్న చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అప్ డేటెడ్ వెర్షన్ అందుబాటులోకి రానుంది. 2024 జనవరి తొమ్మిదో తేదీన ఇది మార్కెట్లోకి రానుంది. మెకానికల్ గా అలాగే డిజైన్ పరంగా కూడా కొన్నిమార్పులు చేసి అందుబాటులోకి తీసుకురానుందని చెబుతున్నారు. గతేడాది డిసెంబర్లోనే చేతక్ అర్బేన్ వేరియంట్ ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. దీనికి మరికొన్ని హంగులను జోడిస్తూ కొత్త స్కూటర్ వచ్చే అవకాశం ఉంది. కంపెనీ ఈ కొత్త స్కూటర్ కు సంబంధించి ఎటువంటి వివరాలు వెల్లడించలేదు కానీ కొన్ని ఆన్ లైన్ సంస్థలు చెబుతున్న దాని ప్రకారం రానున్న కొత్త మోడల్ చేతక్ అర్బేన్, ప్రీమియం మోడళ్లను తలదన్నే విధంగా కొత్త స్కూటర్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆన్ లైన్లో అందుబాటులో వివరాల గురించి తెలుసుకుందాం..

స్పెసిఫికేషన్లు ఇవి..

ఎలక్ట్రిక్ స్కూటర్లో 3.2కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది సింగిల్ చార్జ్ తో 127కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న చేతక్ స్కూటర్లో 2.88కేడబ్ల్యూహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంది. ఇది గరిష్టంగా 113 కిలోమీటర్ల రేంజ్ సింగిల్ చార్జ్ పై ఇస్తుంది. ఆన్ లైన్లో లీక్ అయిన సమాచారాన్ని బట్టి కొత్త బ్యాటరీ ఫుల్ చార్జ్ చేయడానికి నాలుగు గంటల 30 నిమిషాల సమయం పడుతుంది.

పనితీరు ఎలా ఉంటుందంటే..

2024 బజాజ్ చేతక్ గరిష్టంగా 73 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. ప్రస్తుతం ఉన్న టాప్ వేరియంట్ గంటలకు 63కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణించగలుగుతుంది. కొత్తగా రానున్న స్కూటర్లో ప్రధాన అప్ డేట్ టీఎఫ్టీ స్క్రీన్, ప్రస్తుతం ఉన్న ఎల్సీడీ యూనిట్ స్థానంలో ఇది వస్తుంది. అత్యాధునిక డిస్ ప్లే టర్న్ బై టర్న్ నావిగేషన్, టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్(టీపీఎంఎస్), రిమోట్ లాక్/అన్ లాక్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉంటాయి. స్కూటర్ సీటు కింద 18 నుంచి 21 లీటర్ల స్టోరేజ్ సామర్థ్యం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..
విడాకుల నేపథ్యంలో.. రెహ్మాన్ మత మార్పిడే హాట్ టాపిక్.!
విడాకుల నేపథ్యంలో.. రెహ్మాన్ మత మార్పిడే హాట్ టాపిక్.!
భార్య విడాకులు.. ఎమోషనల్ అయిన రెహ్మాన్.! వీడియో
భార్య విడాకులు.. ఎమోషనల్ అయిన రెహ్మాన్.! వీడియో