Gautam Adani: ముఖేష్‌ అంబానీతో పోటీ పడుతున్న గౌతమ్‌ అదానీ.. పెరిగిన నికర ఆస్తి విలువ..!

|

Nov 13, 2021 | 3:51 PM

Gautam Adani: ఆసియాలో రెండవ ధనవంతుడైన గౌతమ్ అదానీకి కాలం కలిసి వస్తోంది. ఏడాది కాలంలో అతని సంపద అనేక రెట్లు పెరిగింది...

Gautam Adani: ముఖేష్‌ అంబానీతో పోటీ పడుతున్న గౌతమ్‌ అదానీ.. పెరిగిన నికర ఆస్తి విలువ..!
Gautam Adani
Follow us on

Gautam Adani: ఆసియాలో రెండవ ధనవంతుడైన గౌతమ్ అదానీకి కాలం కలిసి వస్తోంది. ఏడాది కాలంలో అతని సంపద అనేక రెట్లు పెరిగింది. అదానీ గ్రూప్‌ వ్యవస్థపకుడు, చైర్మన్‌ గౌతమ్‌ అదానీ నికర విలువ 2021లో 52 బిలియన్‌ డాలర్లు అంటే 153.8 శాతానికి పెరిగింది. బ్లూమ్‌ బెర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్‌ ప్రకారం.. అతని ప్రస్తుతం నికర విలువ 85.8 బిలియన్‌ డాలర్లు. భారతదేశంలో అత్యంత ధనవంతుడు రిలయన్స్ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ నికర విలువ కంటే 11.4 బిలియన్‌ డాలర్లు తక్కువగా ఉన్నారు. ప్రస్తుతం అదానీ భారతదేశంలో రెండో అత్యంత సంపన్న వ్యక్తి మాత్రమే కాకుండా ఆసియాలో రెండో ధనవంతుడు. అదానీ అంబానీతో పోటీ పడుతున్నారు.

అదానీ నికర విలువ భారీగా పెరిగింది..
ఏప్రిల్‌ 2020 నుంచి అదానీ నికర విలువ బాగా పెరిగింది. మార్చి 18,2020న అతన నికర విలువ 4.91 బిలియన్‌ డాలర్లు. 20 నెలల్లో అతని నికర విలువ 1747 శాతం పెరిగింది. అంటే 80.89 బిలియన్‌ డాలర్లు. అదే సమయంలో ముఖేష్‌ అంబానీ నికర విలువ 254 శాతం 59 బిలియన్ల డాలర్లు పెరిగింది.

అదానీ వ్యాపారం..
భారతదేశంలో అతిపెద్ద పోర్ట్‌ ఆపరేటర్‌ అయిన అదానీ గ్రూప్‌ వ్యవస్థపకుడు. అతను ఆస్ట్రేలియాలోని వివాదస్పదమైన బొగ్గు మైనింగ్‌ ప్రాజెక్టు పాయింట్‌ కూడా ఉంది. కొన్ని నెలల కిందట అతిపెద్ద సోలర్‌ పవర్‌ డెవలపర్‌ అయిన అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌, భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేటు రంగ పవర్‌ ట్రాన్స్‌మిషన్‌, రిటైల్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ అదానీ ట్రాన్స్‌మిషన్‌ లిమిటెడ్‌ కాప్‌-26 సదస్సులో తమ ఎనర్జీ కాంపాక్ట్‌ లక్ష్యాలను ప్రకటించారు.

ఇవి కూడా చదవండి:

Kids PAN Card: మీ పిల్లల పేరుపై పాన్‌ కార్డు కావాలా..? 18 ఏళ్ల లోపు ఉన్న వారు కూడా పాన్‌ పొందవచ్చు.. ఎలాగంటే..

Fixed Deposit: సీనియర్‌ సిటిజన్లకు గుడ్‌న్యూస్‌.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అధిక వడ్డీ అందిస్తున్న బ్యాంకులు ఇవే..!