Pension: నెలకు రూ.50 వేల పెన్షన్‌ కావాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలి?

|

Jul 21, 2024 | 8:45 AM

నేషనల్ పెన్షన్ సిస్టమ్, ఎన్‌పిఎస్‌గా ప్రసిద్ధి చెందింది. ఇది ప్రభుత్వ పథకం. మార్కెట్ లింక్ అయినప్పటికీ ఈ పథకం చాలా మంచిగా పరిగణిస్తున్నారు. ఎన్‌పీఎస్‌ ద్వారా మీరు మీ పదవీ విరమణ సమయంలో మంచి ఫండ్‌ను కూడబెట్టుకోవచ్చు. అలాగే వృద్ధాప్యంలో నెలవారీ పెన్షన్‌ను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందులో టైర్ 1, టైర్ 2 అనే రెండు రకాల ఖాతాలు ఉన్నాయి. టైర్ 1 ఖాతాను ఎవరైనా తెరవొచ్చు...

Pension: నెలకు రూ.50 వేల పెన్షన్‌ కావాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలి?
Nps
Follow us on

నేషనల్ పెన్షన్ సిస్టమ్, ఎన్‌పిఎస్‌గా ప్రసిద్ధి చెందింది. ఇది ప్రభుత్వ పథకం. మార్కెట్ లింక్ అయినప్పటికీ ఈ పథకం చాలా మంచిగా పరిగణిస్తున్నారు. ఎన్‌పీఎస్‌ ద్వారా మీరు మీ పదవీ విరమణ సమయంలో మంచి ఫండ్‌ను కూడబెట్టుకోవచ్చు. అలాగే వృద్ధాప్యంలో నెలవారీ పెన్షన్‌ను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందులో టైర్ 1, టైర్ 2 అనే రెండు రకాల ఖాతాలు ఉన్నాయి. టైర్ 1 ఖాతాను ఎవరైనా తెరవొచ్చు. కానీ టైర్-1 ఖాతా ఉంటేనే టైర్-2 ఖాతా తెరవబడుతుంది.

ఇది కూడా చదవండి: Pressure Cooker: వంట చేసేటప్పుడు కుక్కర్‌ విజిల్‌ నుంచి నీరు లీక్‌ అవుతుందా? ఇలా చేయండి

మీరు 60 ఏళ్లు నిండిన తర్వాత ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి పెట్టిన మొత్తంలో 60% మొత్తాన్ని ఒకేసారి తీసుకోవచ్చు. అయితే కనీసం 40% మొత్తాన్ని యాన్యుటీగా ఉపయోగించాలి. ఈ యాన్యుటీ నుండి మీరు పెన్షన్ పొందుతారు. మీరు కూడా ఎన్‌పిఎస్‌లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే, రూ. 50,000 కంటే ఎక్కువ పెన్షన్ పొందడానికి మీరు ప్రతి నెలా ఈ పథకంలో ఎంత పెట్టుబడి పెట్టాలో తెలుసుకోండి.

ఇవి కూడా చదవండి

మీరు 50 వేలకు పైగా పెన్షన్ కోసం

మీరు 35 సంవత్సరాల వయస్సులో ఎన్‌ఫీఎస్‌లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించారని అనుకుందాం, అప్పుడు మీరు 60 సంవత్సరాల పాటు నిరంతరంగా స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాలి. అంటే, మీరు 25 సంవత్సరాల పాటు పథకంలో పెట్టుబడి పెట్టాలి. ప్రతి నెలా 50 వేల రూపాయల కంటే ఎక్కువ పెన్షన్ పొందడానికి, మీరు ప్రతి నెలా కనీసం 15,000 రూపాయలు పెట్టుబడి పెట్టాలి. ఎన్‌పీఎస్‌ కాలిక్యులేటర్ ప్రకారం, మీరు ప్రతి నెలా 15,000 రూపాయలను 25 సంవత్సరాల పాటు నిరంతరంగా పెట్టుబడి పెట్టినట్లయితే, మీ మొత్తం పెట్టుబడి రూ. 45,00,000 అవుతుంది. కానీ 10% చొప్పున, దీనిపై వడ్డీ రూ.1,55,68,356 అవుతుంది. ఈ విధంగా, మీరు మొత్తం 2,00,68,356 రూపాయలు పొందుతారు. మీరు ఈ మొత్తంలో 40% యాన్యుటీగా ఉపయోగిస్తే, 40% చొప్పున రూ. 80,27,342 మీ యాన్యుటీ అవుతుంది. మీరు ఏక మొత్తంగా రూ. 1,20,41,014 పొందుతారు. మీరు యాన్యుటీ మొత్తంపై 8% రాబడిని పొందినట్లయితే, మీరు ప్రతి నెలా రూ. 53,516 పెన్షన్ పొందుతారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి