AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bajaj Finance: అప్పుడు 50 పైసలు.. ఇప్పుడు రూ. వెయ్యి.. లచ్చిందేవి ఊరికేరాదు మాస్టారూ.!

స్టాక్ మార్కెట్ అనేది ఓ చదరంగం.. ఇలా భావించి ప్రతీ ఒక్కరూ దాన్ని ఒక భూతం అని అనుకుంటారు. మీరు సహనంతో ఓ మంచి స్టాక్‌లో డబ్బులు పెడితే.. అది కచ్చితంగా కొన్నేళ్ళకు మీకు మంచి రాబడిని తెచ్చిపెడతాయని చాలా సందర్భాల్లో తేలింది. ఆ వివరాలు..

Bajaj Finance: అప్పుడు 50 పైసలు.. ఇప్పుడు రూ. వెయ్యి.. లచ్చిందేవి ఊరికేరాదు మాస్టారూ.!
Representative Image
Ravi Kiran
|

Updated on: Nov 10, 2025 | 11:46 AM

Share

లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌కు పెట్టింది పేరు స్టాక్ మార్కెట్. మనం ఏదైనా మంచి గ్రోత్ ఉన్న కంపెనీలో డబ్బు దాచిపెట్టి.. అలాగే ఓపికతో వెయిట్ చేస్తే కచ్చితంగా ఆ చిన్న ఇన్వెస్ట్‌మెంట్ మనకు కోట్లు తెచ్చిపెడుతుంది. అందుకు ఉదాహరణగా నిలుస్తూ.. ఎన్‌ఎస్‌సీలో చాలానే స్టాక్స్ ఉన్నాయి. సరిగ్గా అలాంటి స్టాక్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం.

బజాజ్ ఫైనాన్స్.. ఈ టూ వీలర్ కంపెనీ మొదటిగా 1994లో ఐపీఓగా వచ్చింది. అప్పుడు ‘బజాజ్ ఆటో ఫైనాన్స్ లిమిటెడ్’ పేరిట లిస్టింగ్ అయింది. ఆ తర్వాత కంపెనీ తన పేరును 2010లో మార్చుకుంది. అయితే తన పేరెంట్ కంపెనీతో ఆపరేటింగ్ అవుతున్న సమయంలో ఈ బజాజ్ ఫైనాన్స్ షేర్ ధర అనగా 2002వ సంవత్సరం సమయంలో రూ 0.58 పైసలుగా ఉంది. ఆ సమయంలో మీరు ఓ లక్ష రూపాయలు ఈ స్టాక్‌లో పెట్టి ఉంటే.. ఇప్పుడు అవి కోట్లు రాబట్టేవి. FIIs, DIIs స్టేక్ హోల్డింగ్ ఎక్కువగా ఉన్న ఈ కంపెనీ ఆపై ఎలాంటి అభివృద్ధి బాట పట్టిందో మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సమయంలో లక్షకు సుమారు 1,72,413 షేర్స్ వస్తాయి. ఇక ఇప్పుడు.. ప్రస్తుతం సమయానికి ఆ షేర్స్ విలువ సుమారు రూ. 184 కోట్లుగా ఉంది. మొన్నీమధ్య ఈ షేర్ వాల్యూ సుమారు రూ. 9 వేల వరకు వెళ్ళింది. అయితే బోనస్, స్ప్లిట్ కారణంగా మళ్లీ అది వెయ్యికి దిగింది. ప్రస్తుతం రూ. 1,069 దగ్గర రన్ అవుతోంది. ఈ లెక్క ప్రకారమే.. అప్పటి మీ లక్ష రూపాయలు.. ఇప్పుడు రూ. 184 కోట్లుగా మారతాయి. స్టాక్ మార్కెట్ ఓ చదరంగమే.. కానీ కచ్చితత్వం ఉన్న షేర్స్‌లో పెడితే.. ఓపిక.. ఇన్నేళ్ల కంపౌండింగ్‌తో మీ డబ్బు డబుల్ కాదు ట్రిపుల్ లేదా 10 టైమ్స్ పెరగడం ఖాయం.

ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!
ఏపీ ప్రభుత్వం మరో కొత్త హైవే.. హైదరాబాద్ వెళ్లేవారికి ఊరట
ఏపీ ప్రభుత్వం మరో కొత్త హైవే.. హైదరాబాద్ వెళ్లేవారికి ఊరట
ఎగ్జైటెడ్‌గా రామ్ చరణ్.. అభిమానులను మెప్పిస్తాడా?
ఎగ్జైటెడ్‌గా రామ్ చరణ్.. అభిమానులను మెప్పిస్తాడా?
1200 కోట్ల సినిమా.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరో.. మూడేళ్లకు..
1200 కోట్ల సినిమా.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరో.. మూడేళ్లకు..
శ్రేయస్‌కు నో ఛాన్స్.. 3వ స్థానంలో ఇషాన్ ఫిక్స్: సూర్యకుమార్
శ్రేయస్‌కు నో ఛాన్స్.. 3వ స్థానంలో ఇషాన్ ఫిక్స్: సూర్యకుమార్
27 ఏళ్ల తర్వాత సొంత నక్షత్రంలో శని.. ఈ రాశులవారికి జాక్‌పాట్
27 ఏళ్ల తర్వాత సొంత నక్షత్రంలో శని.. ఈ రాశులవారికి జాక్‌పాట్
వారికి సూపర్ గుడ్ న్యూస్.. ఈ నెల 23 వరకు 50 శాతం డిస్కౌంట్..
వారికి సూపర్ గుడ్ న్యూస్.. ఈ నెల 23 వరకు 50 శాతం డిస్కౌంట్..
ఇమ్యూనిటీ, జీర్ణక్రియ ఇబ్బందులకు ఈ 5 ఫుడ్స్‌తో చెక్ పెట్టేయచ్చు
ఇమ్యూనిటీ, జీర్ణక్రియ ఇబ్బందులకు ఈ 5 ఫుడ్స్‌తో చెక్ పెట్టేయచ్చు