Reliance Industries: ఆల్గే నుంచి బయో ఫ్యూయల్.. రిలయన్స్ ఇండస్ట్రీస్ సరికొత్త ప్రయత్నం..

|

Jun 14, 2022 | 6:43 PM

Reliance Industries: ముంబయి కేంద్రంగా ఎనర్జీ టు టెలికాం వరకు అనేక వ్యాపారాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) నిర్వహిస్తోంది. ఈ కంపెనీ త్వరలో ఆల్గేను ఉపయోగించి ఇంధనాన్ని తయారు చేయనున్నట్లు వెల్లడించింది.

Reliance Industries: ఆల్గే నుంచి బయో ఫ్యూయల్.. రిలయన్స్ ఇండస్ట్రీస్ సరికొత్త ప్రయత్నం..
Mukesh Ambani
Follow us on

Reliance Industries: ముంబయి కేంద్రంగా ఎనర్జీ టు టెలికాం వరకు అనేక వ్యాపారాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) నిర్వహిస్తోంది. ఈ కంపెనీ త్వరలో ఆల్గేను ఉపయోగించి ఇంధనాన్ని తయారు చేయనున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను ఒక వీడియోను పోల్ట్ చేసింది. ఆల్గే నుండి ఇంధనమా అని ఆశ్చర్యపోతున్నారా.. మీరు విన్నది నిజమే, తమ శాస్త్రవేత్తలు ఆల్గే జాతి అభివృద్ధి, సాగు, పంటకోత కోసం అత్యాధునిక వినూత్న సామర్థ్యాలను అభివృద్ధి చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఇది జీవ ఇంధనం, బయో-కెమికల్స్, పోషక ఆహారం, ఫీడ్ ఉత్పత్తి వంటి అంతులేని అవకాశాలను అన్‌లాక్ చేసినట్లు కంపెనీ చెబుతోంది.

వేగంగా పెరుగుతున్న దేశ ఇంధన అవసరాలకు అనుగుణంగా RIL గ్రీన్, పునరుత్పాదక ఇంధన వనరుల్లో కొత్త ఆవిష్కరణలు చేస్తున్నట్లు అందులో తెలిపారు. ఈ ఆవిష్కరణలు భారతదేశ ఇంధన అవసరాలను తీర్చడంలో RIL నిబద్ధతను ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. UN సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ చేరుకోవడానికి వీలుగా స్థిరమైన మార్గంలో దీన్ని చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రమే జీవ ఇంధనాల తయారీ గురించి మాట్లాడలేదు. ఈ ఏడాది ప్రారంభంలో.. ఇంధన దిగ్గజం ExxonMobil దాని 2030 కర్బన ఉద్గారాల తగ్గింపు ప్రణాళికలను రూపొందించింది.

అయితే శాస్త్రవేత్తలు ఆల్గే వంటి చిన్న మొక్కలను ఇంధనంగా ఎలా మారుస్తారు? హార్వర్డ్ పొలిటికల్ రివ్యూ ప్రకారం.. శాస్త్రవేత్తలు సాధారణంగా పెద్ద, బహిరంగ చెరువులు లేదా కంట్రోల్డ్ ఫోటోబయోరేక్టర్లలో మైక్రోఅల్గేలను పెంచుతారు. స్కేల్ వద్ద, మైక్రోఅల్గే బహిరంగ ప్రదేశంలో పెరగాలి. దీని తరువాత.. శాస్త్రవేత్తలు ఆల్గేను పండిస్తారు. రసాయన ద్రావకాన్ని ఉపయోగించి కణాలను విచ్ఛిన్నం చేస్తారు. లోపలి లిపిడ్లు, ప్రోటీన్లు, పిండి పదార్ధాలను కలెక్ట్ చేసి ప్రాసెసింగ్ చేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా వారు జీవ ఇంధనాన్ని తయారు చేయనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.