Motovolt M7: వారెవ్వా.. ఇదేం ఈవీ స్కూటరండి బాబూ.. సూపర్ ఫీచర్స్‌తో మోటోవాల్ట్ ఈవీ స్కూటర్ రిలీజ్

ప్రభుత్వాలు కూడా పెరుగుతున్న వాహన కాలుష్యానికి ప్రత్యామ్నాయ వాహనాలుగా ఈవీ వాహనాలను భావించి వీటి కొనుగోలుకు ప్రత్యేక సబ్సిడీలను అందిస్తున్నాయి. దీంతో అన్ని వాహనాలు సాధారణ ప్రజలకు అందుబాటులోకి రావడంతో ఆయా వాహనాల మార్కెట్ అమాంతం పెరిగింది. తాజాగా భారతదేశంలోని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ మోటోవోల్ట్ మొబిలిటీ ఎం7 మల్టీ యుటిలిటీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ. 1.22 లక్షలు (ఎక్స్-షోరూమ్) విడుదల చేసింది. అలాగే ఈ ఈవీ కోసం రూ. 999 ధరకు బుకింగ్స్‌ను కూడా ప్రారంభించింది.

Motovolt M7: వారెవ్వా.. ఇదేం ఈవీ స్కూటరండి బాబూ.. సూపర్ ఫీచర్స్‌తో మోటోవాల్ట్ ఈవీ స్కూటర్ రిలీజ్
Motovolt M7

Updated on: Mar 08, 2024 | 7:00 AM

భారతదేశంలో ఈవీ వాహన మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఉన్నత శ్రేణి వర్గాలతో పాటు మధ్యతరగతి ప్రజలు కూడా ఈవీ వాహనాల వినియోగాన్ని ఇష్టపడడంతో మార్కెట్‌లో టాప్ కంపెనీల దగ్గర నుంచి స్టార్టప్ కంపెనీల వరకూ ఈవీ వాహనాలను రిలీజ్ చేస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా పెరుగుతున్న వాహన కాలుష్యానికి ప్రత్యామ్నాయ వాహనాలుగా ఈవీ వాహనాలను భావించి వీటి కొనుగోలుకు ప్రత్యేక సబ్సిడీలను అందిస్తున్నాయి. దీంతో అన్ని వాహనాలు సాధారణ ప్రజలకు అందుబాటులోకి రావడంతో ఆయా వాహనాల మార్కెట్ అమాంతం పెరిగింది. తాజాగా భారతదేశంలోని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ మోటోవోల్ట్ మొబిలిటీ ఎం7 మల్టీ యుటిలిటీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ. 1.22 లక్షలు (ఎక్స్-షోరూమ్) విడుదల చేసింది. అలాగే ఈ ఈవీ కోసం రూ. 999 ధరకు బుకింగ్స్‌ను కూడా ప్రారంభించింది. ఈ ఈవీ స్కూటర్ ప్లాస్టిక్ తక్కువ స్థాయిలో వినియోగించామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ముఖ్యంగా అధిక లోడ్‌ను మోసేలా ఈ స్కూటర్‌ను రిలీజ్ చేశామని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మోటోవోల్ట్ ఎం 7 స్కూటర్‌ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

మోటోవోల్ట్ ఎం 7 హెవీ  డ్యూటీ మైల్డ్ స్టీల్ ఫ్రేమ్‌తో వస్తుంది. ఈ స్కూటర్ 180 కిలోల వరకు మోసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఈవీ 1000 కంటే ఎక్కువ ఛార్జ్ సైకిళ్లకు మన్నికైన 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ నుంచి శక్తిని పొందుతుంది. అలాగే ఈ స్కూటర్‌ను ఓ సారి చార్జ్ చేస్తే 166 కిలో మీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది. మోటోవోల్ట్ బ్రాండ్ ఒకే బ్యాటరీ ఎంపికతో ఎం 7 ఎల్ వేరియంట్‌ ద్వార కూడా పని చేస్తుంది. వినియోగదారులు డ్యూయల్ సిస్టమ్‌కు అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో పనిచేస్తున్న యూరోపియన్ కంపెనీ అయిన స్వోబీతో మోటోవోల్ట్ భాగస్వామ్యంతో పని చేస్తుంది. 

మోటోవోల్ట్ ఎం 7 ఎలక్ట్రిక్ స్కూటర్ లైట్‌నింగ్ గ్రే, గెలాక్సీ రెడ్, బ్లూ జే, డోవ్ వైట్, కానరీ ఎల్లో, ప్యూమా బ్లాక్ వంటి ఆరు రంగు ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. ఈ స్కూటర్ సమర్థవంతమైన, స్థిరమైన ప్రయాణ ప్రత్యామ్నాయాన్ని అందించడమే లక్ష్యంగా రిలీజ్ చేసినట్లు మోటోవోల్ట్ మొబిలిటీ వ్యవస్థాపకుడు & సీఈఓ తుషార్ చౌదరి పేర్కొన్నారు. మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియా నినాదంతో అధునాతన ఫీచర్లతో ఎం 7 స్కూటర్‌ను రూపొందించామని ఆయన వివరిస్తున్నారు. ముఖ్యంగా జర్మన్ ఇంజనీర్లు, వారి భారతీయ సహచరుల మధ్య సాంకేతిక పరిజ్ఞానం మార్పిడి ఈ ప్రాజెక్టు మూలస్తంభంగా ఉందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి