RTO Services: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక ఆర్టీఓ ఆఫీస్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు.. 58 రకాల సేవలు ఆన్‌లైన్‌లోనే..

|

Sep 18, 2022 | 8:10 AM

RTO Services: ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయింది. రకరకాల సేవలు ఆన్‌లైన్‌ ద్వారానే చేసుకునే సదుపాయం వచ్చేస్తోంది. బ్యాంకింగ్‌ రంగం నుంచి ఇతర సేవల..

RTO Services: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక ఆర్టీఓ ఆఫీస్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు.. 58 రకాల సేవలు ఆన్‌లైన్‌లోనే..
Follow us on

RTO Services: ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయింది. రకరకాల సేవలు ఆన్‌లైన్‌ ద్వారానే చేసుకునే సదుపాయం వచ్చేస్తోంది. బ్యాంకింగ్‌ రంగం నుంచి ఇతర సేవల వరకు అన్ని ఆన్‌లైన్‌ ద్వారా చేసుకునే టెక్నాలజీ వచ్చేసింది. ఇక వాహనాలకు సంబంధించిన సేవలు మరింత సులభతరం కానున్నాయి. ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లకుండానే ఇంట్లోనే ఉండి చేసుకునే సదుపాయం వచ్చేస్తోంది. వాహనం రిజిస్ట్రేషన్‌, ఓనర్‌షిప్‌ ట్రాన్స్‌ఫర్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌తో పాటు ఇతర సేవలు ఇక నుంచి ఆన్‌లైన్‌లో పొందే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఆధార్‌ అథంటికేషన్‌ ఆధారంగా మొత్తం 58 పౌర సంబంధిత సేవలను ఆన్‌లైన్‌ ద్వారా పొందవచ్చని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసింది.

లెర్నింగ్‌ లైసెన్స్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, డూప్లికేట్‌ లైసెన్స్‌, అలాగే లైసెన్స్‌ రెన్యువల్‌ వంటి సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని కేంద్ర సర్కార్‌ విడుదల చేసిన తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. అంతర్జాతీయ డ్రైవింగ్‌ పర్మిట్‌, లైసెన్స్‌లో చిరునామా మార్పు, వాహన ఓనర్‌షిప్‌ తదితర సర్వీసులు ఆన్‌లైన్‌లోనే లభిస్తాయని తెలిపింది. అయితే డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందాలంటే మాత్రం నేరుగా హాజరు కావాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది. ఇలా సేవలు ఆన్‌లైన్‌ ద్వారా చేయడం వల్ల ఆర్టీవో కార్యాలయంపైనా భారం మరింతగా తగ్గుతుందని కేంద్రం అభిప్రాయపడుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి