AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Ideas: ఇంట్లో కూర్చునే ఈ వ్యాపారాన్ని ప్రారంభించండి.. నెలకు రూ. 30 వేలుపైగా గ్యారంటీ.!

ఉద్యోగం కోసం ప్రయత్నించారా.? ఎక్కడా కూడా సరైన జాబ్ దొరకలేదా.? ఇంట్లోనే ఖాళీగా కూర్చున్నారా.! అయితే తక్కువ పెట్టుబడితో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే.!

Business Ideas: ఇంట్లో కూర్చునే ఈ వ్యాపారాన్ని ప్రారంభించండి.. నెలకు రూ. 30 వేలుపైగా గ్యారంటీ.!
Money
Ravi Kiran
|

Updated on: Jun 24, 2023 | 6:20 PM

Share

ఉద్యోగం కోసం ప్రయత్నించారా.? ఎక్కడా కూడా సరైన జాబ్ దొరకలేదా.? ఇంట్లోనే ఖాళీగా కూర్చున్నారా.! అయితే తక్కువ పెట్టుబడితో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే.! ఇదిగో ఈ బిజినెస్ ఐడియా మీకోసమే.. ఈ వ్యాపారానికి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పన్లేదు. ఒక్కసారి మొదలుపెట్టి.. అంచలంచలుగా పెంచుకుంటూపోతే.. నెలకు రూ. 30 వేలకుపైగా సంపాదించవచ్చు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా..

ఆ బిజినెస్ మరేదో కాదు.. కూల్ కేక్ తయారీ వ్యాపారం. ఇటీవల అకేషన్ ఏదైనా కూడా కేక్ కట్ చేయాల్సిందే. సో దీన్ని మీరు బిజినెస్‌గా మొదలుపెడితే.. ఈజీగా మంచి రాబడిని సాధించవచ్చు. మరి కేక్ తయారీ ఎక్కడ నేర్చుకోవాలి.? అని ఆలోచించవద్దు. మీరు దానికోసం బేకరీ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గరే కూర్చుని కూల్ కేక్ తయారీని యూట్యూబ్‌లో చూసి నేర్చుకోవచ్చు.

పెద్దపల్లి జిల్లాకు చెందిన ప్రణయ్ అనే యువకుడు ఈ బిజినెస్‌నే చిన్నగా మొదలుపెట్టి.. ఇప్పుడు మంచి సంపాదనను అర్జిస్తున్నాడు. తన కుటుంబ పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో.. పై చదువులు చదవలేకపోయిన ప్రణయ్.. ఓ యూట్యూబ్ వీడియో ద్వారా కూల్ కేక్ తయారీని నేర్చుకున్నాడు. కొద్దిరోజులు నేర్చుకున్న తర్వాత.. ఆ కేక్ తయారీలో పట్టు సాధించి.. ఇంటి దగ్గర నుంచే వ్యాపారాన్ని మొదలుపెట్టాడు.

కూల్ కేక్‌‌తో పాటు అందులో ఉపయోగించే ఫ్లేవర్లను సైతం ప్రణయ్ సొంతంగానే తయారు చేసి మార్కెట్‌లో అమ్మేవాడు. సోషల్ మీడియాను సాయంగా తీసుకుని తన బిజినెస్‌ను అంచలంచలుగా అభివృద్ధి చేశాడు. కాగా, మొదటిగా రూ. 4 వేలతో ఈ బిజినెస్ మొదలుపెట్టిన అతడు.. ఇప్పుడు అన్ని ఖర్చులూ పోనూ నెలకు రూ. 30 వేలకుపైగానే రాబడి ఆర్జిస్తున్నాడు. లేట్ ఎందుకు మీరూ ఓసారి ఈ బిజినెస్ ఐడియాను ప్రయత్నించండి.

Follow Us
ఫిల్మ్ ఇండస్ట్రీకి మోదీ గుడ్‌న్యూస్!ఇక ఊరూరా థియేటర్లే!
ఫిల్మ్ ఇండస్ట్రీకి మోదీ గుడ్‌న్యూస్!ఇక ఊరూరా థియేటర్లే!
సమంత ప్రెగ్నెంట్ అని తెలిశాకే.. ఆ సీన్లన్నీ షూట్ చేశాం..
సమంత ప్రెగ్నెంట్ అని తెలిశాకే.. ఆ సీన్లన్నీ షూట్ చేశాం..
OTT గైడ్.. పెద్ది, అబ్సెషన్ తో పాటు.. ఈ వారం ఏం వస్తున్నాయంటే
OTT గైడ్.. పెద్ది, అబ్సెషన్ తో పాటు.. ఈ వారం ఏం వస్తున్నాయంటే
10th కూడా పాస్ కాలేదు.. కట్ చేస్తే.. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్
10th కూడా పాస్ కాలేదు.. కట్ చేస్తే.. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్
డేట్, టైమ్, లొకేషన్ ఫిక్స్.. పొలిటికల్ వార్‌కు వచ్చేదెవరు?
డేట్, టైమ్, లొకేషన్ ఫిక్స్.. పొలిటికల్ వార్‌కు వచ్చేదెవరు?
ఏడుస్తున్న పిల్లలను వాషింగ్ మెషీన్‌లో పెట్టి లాక్.. జెట్ స్ప్రేతో
ఏడుస్తున్న పిల్లలను వాషింగ్ మెషీన్‌లో పెట్టి లాక్.. జెట్ స్ప్రేతో
ఇంగ్లాండ్ సిరీస్‌లో ఈ ముగ్గురికి అగ్నిపరీక్ష..
ఇంగ్లాండ్ సిరీస్‌లో ఈ ముగ్గురికి అగ్నిపరీక్ష..
వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌కు ప్రభుత్వం తెలిపిన 8 అభ్యంతరాలు ఇవే
వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌కు ప్రభుత్వం తెలిపిన 8 అభ్యంతరాలు ఇవే
కోట్లాది డాలర్లు, వందల కేజీల బంగారం.. జనం సొమ్ము దోచేశారు!
కోట్లాది డాలర్లు, వందల కేజీల బంగారం.. జనం సొమ్ము దోచేశారు!
నోట్లో కరిగిపోయే కమ్మనైన పేదోళ్ల పచ్చి కొబ్బరి పాయసం..
నోట్లో కరిగిపోయే కమ్మనైన పేదోళ్ల పచ్చి కొబ్బరి పాయసం..